పిల్లల్ని ఒంటరిగా వదిలేస్తున్నారా.? ఈ వీడియో చూస్తే ఇకపై చచ్చినా ఆ పని చేయరు.

By Narender Vaitla  |  First Published Dec 30, 2024, 2:19 PM IST

చిన్న పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా పెద్దల కళ్లుగప్పి ప్రమాదాలకు గురవుతుంటారు. అందుకే పేరెంటింగ్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే చిన్నారులను ఒంటరిగా వదిలేస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో చెప్పేందుకు సాక్ష్యంగా నిలుస్తోందీ ఓ వీడియో... 
 


ప్రమాదం ఎప్పుడు ఎలా పొంచి ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండాలని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా చిన్నారుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అభంశుభం తెలియని చిన్నారులు ప్రమాదాలకు గురవుతుంటారు. అందుకే వారికి ఊహ తెలిసేంత వరకు తల్లిదండ్రులు చిన్నారులపై నిత్యం ఒక కన్ను వేసి ఉంచాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. 

సోషల్‌ మీడియాలో.. 

చిన్నారులు ప్రమాదాల బారిన పడుతోన్న సంఘటనలు ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన ప్రస్తుత తరుణంలో ఇలాంటి సంఘటనలు ఇట్టే ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ షాకింగ్‌ సంఘటనకు సంబంధించి వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. భారీగా వర్షం కురుస్తున్న సమయంలో ముగ్గురు చిన్నారులు ఇంటి ముందు సరాదాగా ఆడుతున్నారు. 

Latest Videos

భారీ వర్షం కారణంగా అప్పటికే మురికి కాల్వల నిండిపోయిన వర్షం నీరు ప్రవహిస్తుంది. అలా ఆడుతున్న సమయంలో ఆ ముగ్గురిలో ఓ చిన్న కుర్రాడు కాలువలో పడిపోయాడు. కాలువ పూర్తిగా నిండిపోవడంతో కుర్రాడు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అయితే ఆ ముగ్గురు చిన్నారుల్లో ఉన్న బాలిక ఈ విషయాన్ని గమనించలేదు. వెనకాలే ఉన్న మరో కుర్రాడు ఏడుస్తూ వచ్చి బాలికకు విషయం అర్థమయ్యేలా చెప్పాడు. వెంటనే వారిద్దరూ పరిగెత్తుకుంటూ ఇంటిలోకి వెళ్లిపోయారు. 

నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియో.. 

 

 

ఇదంతా ఇంటి బయట ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డ్‌ అయ్యింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయగా వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఈ సంఘటన ఇండోనేషియాలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కి గురవుతున్నారు. ఇంతకీ ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడ అన్న విషయం మాత్రం తెలియదు. నెటిజన్లు మాత్రం ఆ బాలుడికి ఏం కాలేదని ఆశిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం చిన్నారులను ఇలా ఒంటరిగా వదిలేయడం సరైంది కాదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. 
 

click me!