కొరియన్ బార్లీ టీ.. తాగారంటే నిత్య యవ్వనం మీ సొంతమట..

By AN TeluguFirst Published Oct 14, 2021, 11:18 AM IST
Highlights

మీరు ఇప్పటికే ముఖం మీద ముడతలు రాకుండా ఉండడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారా? anti-wrinkle క్రీమ్స్, లోషన్స్, ప్యాక్ లు వాడుతున్నారా? అయితే వీటిలో చాలావరకు అంతగా పనిచేయవు, లేదా సమర్థవంతంగా ముడతలు రాకుండా ఆరికట్టలేవు. చాలా నెమ్మదిగా ప్రభావం చూపిస్తాయి. 

ముఖం మీది ముడతలు, మచ్చలు వయసు మీద పడుతుందనడానికి గుర్తులు.. వయసు పెరిగిన కొద్దీ ఇవి నెమ్మదిగా ముఖాన్ని ఆక్రమించుకుంటాయి. చర్మం కాంతి కోల్పోతుంది. అయితే జీవనశైలిలో కొన్ని రకాల మార్పులు, క్రమ బద్ధమైన ఆహారం, వ్యాయామాలతో వీటిని తరిమి కొట్టొచ్చని.. లేదా వాటిని ఆలస్యం చేయచ్చని.. ఎక్కువ కాలం యవ్వనంగా, ఉత్సాహంగా ఉండొచ్చని అనేక అధ్యయనాలు తెలిపాయి. 

నిత్య యవ్వనంగా కనిపించడానికి.. వయసును దాచడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల ఆహారపదార్థాలు ప్రయత్నిస్తారు. అయితే కాలాన్ని మార్చలేం. జరిగేదాన్ని జరగకుండా ఆపలేం. మీదపడే వయసును తరిమికొట్టలేం. కాకపోతే కాస్త ఆలస్యం చేయచ్చు. అలా చేయడానికి పనికి వచ్చే ఆయుధాల్లో ఒకలే కొరియన్ బార్లీ టీ. 

మీరు ఇప్పటికే ముఖం మీద ముడతలు రాకుండా ఉండడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారా? anti-wrinkle క్రీమ్స్, లోషన్స్, ప్యాక్ లు వాడుతున్నారా? అయితే వీటిలో చాలావరకు అంతగా పనిచేయవు, లేదా సమర్థవంతంగా ముడతలు రాకుండా ఆరికట్టలేవు. చాలా నెమ్మదిగా ప్రభావం చూపిస్తాయి. 

ముఖం మీద ముడతలు రాకుండా చేసే అద్భుతమైన విషయాన్ని మీకు చెబితే మీరు ఎగిరి గంతేస్తారా? కేవలం ఇంట్లో కూర్చుని హాయిగా, ఓ టీ తాగడం వల్ల ఇది సాధ్యమవుతుందని చెబితే ఎలా పీలవుతారు? ఆశ్చర్యంగా ఉందా అయినా ఇది నిజం అంటున్నారు నిపుణులు. ఎలాగంటే.. 

korean మహిళలు అందంగా ఉంటారు. ఎంత వయసు వచ్చినా పెద్దగా ఏజ్ కనిపించరు. దీనికి కారణమేంటో తెలుసా.. వీరు ప్రతిరోజూ బార్లీ టీ తాగుతారట. చర్మాన్ని మెరిపించడానికి, వృద్ధాప్య ఛాయల్ని వెనక్కి నెట్టడానికి ఇది బాగా పనికి వస్తుందట. 

ఆ టీ మీరు కూడా తాగాలనుకుంటున్నారా? అయితే దాన్ని ఎలా తయారు చేయాలో చూడండి.. ఒక గిన్నెలో కప్పుడు నీళ్లు పోసి మరిగించి ఇందులో రెండు టేబుల్ స్పూన్ల roasted barley వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు తక్కువ మంటమీద మరగనివ్వాలి. తరువాత స్టౌ ఆర్పేసి కాస్త చల్లారాక.. వడకట్టి తాగేయడమే. 

బార్లీ టీలో ఎన్నో beauty benefits ఉన్నాయి. barley teaలో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి మీ చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ డామేజ్ తో పోరాడేలా చేస్తాయి. దీనివల్ల చర్మం మీద ముడతలు పడడాన్ని వాయిదా వేస్తాయి. దీంతోపాటు మొటిమల నివారణలోనూ అద్భుతంగా పనిచేస్తుంది. బార్లీలోని అజేలిక్ యాసిడ్ రొసేషియా తో వచ్చే మొటిమల నివారణలో సమర్థవంతంగా పనిచేస్తుంది. 

అన్ని రకాల చర్మ సమస్యలతోనూ పోరాడే సుగుణం బార్లీ టీ లో ఉంది. అందుకే మీ చర్మ సమస్యలు పోయి, చర్మం అందంగా కాంతివంతంగా, మెరుస్తూ.. నిత్య యవ్వనంగా కనిపించాలంటే బార్లీ టీ మంచి ఆప్షన్ అని సూచిస్తున్నారు నిపుణులు. 

మీరు జామకాయ తింటున్నారా.. అయితే మీకు ఈ సమస్యలు గ్యారంటీ

click me!