navaratri special: సులభంగా చేసుకునే టేస్టీ ఫుడ్స్..!

By telugu news teamFirst Published Oct 13, 2021, 3:46 PM IST
Highlights

తొమ్మిది రోజులు పూజలు చేసి దసరా రోజు ఇష్టమైన ఆహారాలు అమ్మవారికి ప్రసాదంగా సమర్పించి వారు తింటూ ఉంటారు. మీరు కూడా అలానే పూజ చేస్తున్నట్లయితే సులభంగా చేసుకునే అల్పాహారాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి.. వాటిని ప్రయత్నించవచ్చు.

దసరా నవరాత్రుల్లో తొమ్మిది రోజులపాటు అమ్మవారిని అందంగా అలంకరించి ప్రత్యేకంగా పూజలు చేయడం ఆనవాయితీ. అంతేకాదు.. ఈ తొమ్మిది రోజులు చాలా మంది నిష్టగా ఉపవాసాలు కూడా చేస్తుంటారు. తొమ్మిది రోజులు పూజలు చేసి దసరా రోజు ఇష్టమైన ఆహారాలు అమ్మవారికి ప్రసాదంగా సమర్పించి వారు తింటూ ఉంటారు. మీరు కూడా అలానే పూజ చేస్తున్నట్లయితే సులభంగా చేసుకునే అల్పాహారాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి.. వాటిని ప్రయత్నించవచ్చు.

పకోరా..

ఈ దసరా పర్వదినం రోజున పకోరా చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. దీనిని కేవలం ఉల్లిపాయతోనే వేసుకోవాలని లేదు. ఇతర కూరగాయలతో కూడా ఆరోగ్యంగా రుచిగా చేసుకోవచ్చు. సగ్గుబియ్యం,  ఉప్పు, కారప్పొడి, ఉల్లిపాయ లేదా ఇతర కూరగాయ ముక్కలు, పచ్చి మిరపకాయలు, ధనియాల పొడి వేసి కలిపి నూనెలో వేయించుకోవాలి.

హల్వా


హల్వా అనేది దాదాపు ప్రతి ఒక్కరూ ఇష్టపడే మరొక తీపి వంటకం. మీకు కావలసిందల్లా బంగాళాదుంపలు మాత్రమే. వాటిని ముందుగా ఉడక పెట్టి మెత్తగా పేస్టు చేసుకోవాలి. ఆ తర్వాత  కొద్దిగా నెయ్యి వేసి అందులో , జీడిపప్పు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి;  తర్వాత బంగాళాదుంపలను వేసి, వాటిని వేయించాలి. తరువాత చక్కెర వేసి, అది కరిగిపోయే వరకు కొన్ని నిమిషాలు వేయించాలి. ఇప్పుడు పిండిచేసిన ఏలకులు కుంకుమపువ్వు జోడించండి, హల్వా లాగా అయ్యేంత వరకు బాగా కలపాలి. ఇప్పుడు దీనిలో జీడిపప్పు జత చేయాలి.

చాట్..

నవరాత్రి రోజున చాట్ కూడా ప్రశాంతంగా తీసుకోవచ్చు.  ఈ చాట్ ని పచ్చి అరటి తో చాట్ చేసుకోవచ్చు. పచ్చి, అరటిపండ్లను పొట్టు తీసి సన్నని ముక్కలుగా చేసి, 30 నిమిషాలు చల్లటి నీటిలో  నాన పెట్టాలి. తర్వాత నీటిలో నుంచి తీసి... బాణలిలో నూనె వేడి చేసి అవి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత అందులో స్వీట్ అండ్ హాట్ సాస్ లు వేసి బాగా కలుపుకోవాలి.  అరటి ముక్కలతో బాగా కలపాలి. తరువాత వాటిని కొత్తిమీర ఆకులతో అలంకరించండి. దీనికి మరింత రుచిని జోడించడానికి నిమ్మకాయ మరియు రాక్ సాల్ట్ జోడించండి.

మిల్క్ షేక్..


డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ చేసుకొని హాయిగా ఆస్వాదించవచ్చు.  మీకు కావలసిందల్లా పాలు, పంచదార , ఏలకులతో అన్ని డ్రై ఫ్రూట్‌లను బ్లెండర్‌లో కలపడం. అలా బ్లెండ్ చేసిన తర్వాత.. ప్రశాంతంగా తాగేయవచ్చు.

ఉత్తపం..


ఈ నవరాత్రి రోజున ఉత్తపం కూడా చేసుకోవచ్చు. సాధారణ దోస పిండితో దీనినే వేసుకోవచ్చు . అయితే..  దానిని కొంచెం మందంగా వేసుకోవాలి. ఆ తర్వాత దానిపైన ఉల్లిపాయ, క్యారెట్ తురుము, జీలకర్ర, టమాట ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని కాల్చుకొని తింటే  చాలా టేస్టీగా ఉంటుంది. ఉతప్పానికి వేసుకునే పిండి కొంచెం పులిస్తే.. ఇంకా టేస్టీగా ఉంటుంది.

click me!