బొప్పాయి తింటే అబార్షన్ జరుగుతుందా..?

By ramya neerukonda  |  First Published Jan 9, 2019, 4:51 PM IST

బొప్పాయి తింటే.. అబార్షన్ అవుతుందని.. చాలా కాలం నుంచి అందరూ భావిస్తున్న నమ్మకాల్లో ఇది కూడా ఒకటి. అందుకే గర్భం దాల్చిన స్త్రీలకు అన్ని పండ్లు పెడతారు కానీ.. బొప్పాయి మాత్రం పెట్టరు.


బొప్పాయి తింటే.. అబార్షన్ అవుతుందని.. చాలా కాలం నుంచి అందరూ భావిస్తున్న నమ్మకాల్లో ఇది కూడా ఒకటి. అందుకే గర్భం దాల్చిన స్త్రీలకు అన్ని పండ్లు పెడతారు కానీ.. బొప్పాయి మాత్రం పెట్టరు. కడుపులోని బిడ్డకు ప్రమాదం జరగుతుందని వారి భయం. అయితే.. ఇందులో 100శాతం నిజం లేదంటున్నారు నిపుణులు.

బొప్పాయిలో సీ విటమిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. గర్భం దాల్చిన స్త్రీలు.. సీ విటమిన్ ఎక్కువగా తింటే.. అబార్షన్ జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. అబార్షన్ జరగాలంటే.. స్త్రీలు కనీసం ఐదు కిలోల బొప్పాయి తినాలట. అంత మొత్తంలో తీసుకున్నప్పుడు మాత్రమే అబార్షన్ జరుగుతుందట. అంత మొత్తంలో ఎవరూ తీసుకోలేరు కాబట్టి ప్రమాదం ఏమీ ఉండందని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. మితంగా తీసుకుంటే.. గర్భిణీ స్త్రీలు కూడా బొప్పాయి తినవచ్చు. 

Latest Videos

click me!