పిల్లలు పుట్టడంలేదా.. ఇది కూడా ఒక కారణమే

By ramya neerukondaFirst Published Jan 3, 2019, 4:19 PM IST
Highlights

ఈ మధ్యకాలంలో పిల్లలు పుట్టడం లేదంటూ.. హాస్పిటల్స్ చుట్టూ తిరిగే జంటలు పెరిగిపోయాయి. 

ఈ మధ్యకాలంలో పిల్లలు పుట్టడం లేదంటూ.. హాస్పిటల్స్ చుట్టూ తిరిగే జంటలు పెరిగిపోయాయి.  పిల్లలు కలగకపోవడానికి గల కారణాల్లో ఒకటి అధిక బరువు అంటున్నారు నిపుణులు.  మహిళలు అధిక బరువు కలిగి ఉంటే.. వారికి పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుందటున్నారు వైద్యులు.

అధిక బరువు వల్ల మహిళల్లో నెలసరి సరిగ్గా రాకపోవడం, రక్తస్రావం సరిగా జరగకపోవడం సంతాన సాఫల్యతపై ప్రభావం చూపిస్తాయంటున్నారు. ఇవి కాకుండా చిన వయసులోనే షుగర్, హైపర్ టెన్షన్ లాంటివి కూడా వచ్చి చేరతాయి.

అధిక బరువు కారణంగా త్వరగా గర్భం దాల్చలేరని.. ఒక వేళ ప్రెగ్నెన్సీ వచ్చానా కూడా అనేక సమస్యలు తలెత్తుతాయంటున్నారు. అంతేకాదు.. అబార్షన్లు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయట. వీటన్నింటనీ అధిగమించి బిడ్డకు జన్మనిచ్చినా..  వారిలో జన్యుపరమైన లోపాలు, అవయవాలు సరిగా ఏర్పడకపోవడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

మరికొన్ని సార్లు.. బిడ్డ కడుపులోనే చనిపోయే అవకాశం కూడా ఉందట. కడుపుతో ఉన్నప్పుడు నొప్పులు రాకపోవడం.. బిడ్డ అడ్డం తిరగడం లాంటి సమస్యలు కూడా ఎదురౌతాయంటున్నారు వైద్యులు. కాబట్టి.. మంచి డైట్ ఫాలో అవుతూ..వాకింగ్, యోగా లాంటివి జిమ్ లో కసరత్తులు చేసి ముందుగా అధిక బరువుని తగ్గించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

click me!