Phone Effect On Sperm: మగవాళ్లూ.. సెల్ ఫోన్ అతిగా వాడితే.. వాటి నాణ్యత తగ్గుతుంది జాగ్రత్త..

Published : Jan 30, 2022, 02:02 PM IST
Phone Effect On Sperm: మగవాళ్లూ.. సెల్ ఫోన్ అతిగా వాడితే.. వాటి నాణ్యత తగ్గుతుంది జాగ్రత్త..

సారాంశం

Phone Effect On Sperm: సెల్ ఫోన్ అతిగా వాడితే అనర్థాలు తప్పవు. అందులో పురుషులు సెల్ ఫోన్ ను లిమిట్ కు మించి వాడితే.. వాళ్ల స్పెర్మ్ నాణ్యత తగ్గే ప్రమాదముందుని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు మీరు సంతాన లేమి సమస్యలను ఎదుర్కోకతప్పదు జాగ్రత్త..  

Phone Effect On Sperm: ఫోన్లను అతిగా ఉపయోగిస్తే జరిగే నష్టాలేంటో ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఇక తాజాగా ఓ అధ్యయనం పలు ఆసక్తికరమైన విషయాలను వెళ్లడించింది. మగవాళ్లు అతిగా ఫోన్లను వాడితే future లో సంతానలేమి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని తాజా అధ్యయనం పేర్కొంది. మొబైల్ ఫోన్లను వాడకం ఎక్కువైతే వీర్యం నాణ్యత లోపిస్తుందని పేర్కొంది.  ఈ విషయంపై జరిగిన పరశోధనలోని పలు విషయాలను ఎన్విరాన్ మెంటల్ రీసెర్చ్ లో ప్రచురితమయ్యాయి. దీని ప్రకారం..  సెల్ ఫోన్లు రేడియోఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ (RF-EMWs) లను రిలీజ్ చేస్తాయి. అవే స్పెర్మ్ నాణ్యతను తగ్గిస్తాయని అధ్యయనం తేల్చి చెప్పింది. మనం సెల్ ఫోన్లు వాడుతున్నప్పుడు  RF-EMWs లు విడుదల అయ్యి వీర్యంపై ప్రభావం పడుతుంది. తద్వారా వీర్యంలోని కణాలు Mobility ను కోల్పోతాయట. కాగా ఈ శుక్రకణాలు అండం వైపు వెళితేనే గర్భధారణ జరుగుతుంది. కానీ స్పెర్మ్ కణాలు చలనశీలతను కోల్పోవడంతో అది సాధ్యం కాదు. 

పురుషులు సెల్ ఫోన్ల వాడకాన్ని తగ్గించుకుంటేనే వారి శుక్రకణాలు నాణ్యంగా ఉంటాయని.. నేషనల్ యూనివర్సిటిలోని ఒక Researcher, అసిస్టెంట్ ప్రొఫెసర్ యున్ హమ్ కిమ్ అన్నారు. కాగా ఈ విషయం గురించి ఇదివరకు చేసిన పరిశోధనలు కూడా తేల్చిచెప్పాయి. సెల్ ఫోన్లు వాడటం వల్ల వాటి నుంచి రిలీజ్ అయ్యే RF-EMW లను మనిషి బాడీ గ్రహిస్తుందని చెప్పింది. దీని వల్ల గుండె, మెదడు, పునరుత్పత్తిపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అధ్యయాలు పేర్కొన్నాయి. 

సెల్ ఫోన్ నుంచి విడుదలయ్యే EMWలు పురుషుల శుక్రకణాల నాణ్యతను దెబ్బతీస్తుందని 2012 నుంచే పలు అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. కాగా ఇదే అంశంపై దక్షిణ కొరియా సైంటిస్టులు మెటా అనాలసిస్ పేరుతో.. పురుషులు RFకి గురవడం వల్ల జరిగే దుష్పలితాలను అంచనా వేయడానికి  సమీక్ష నిర్వహించారు. కాగా ఇందులో వారు పురుషుల శుక్రకణాల నాణ్యతను సెల్ ఫోన్ల నుంచి  విడుదలయ్యే EMWలు దెబ్బతీస్తున్నాయని తేల్చి చెప్పారు. 

కాగా ఈ విషయంపై  2012 నుంచి 2021 మధ్య ప్రచురితమైన 435 అధ్యయనాల్లోని అంశాలపై విశ్లేషన జరిపారు. అయితే పురుషులు ఎంత సమయం సెల్ ఫోన్లతో గడిపడం వల్ల స్పెర్మ్ దెబ్బతింటుందనే విషయాన్ని మాత్రం తేల్చలేకపోయారు. అంతేకాదు 2012 నుంచి ఈ అధ్యయనాలు జరగడంతో అప్పటి ఫోన్ల రేడియేషన్ వేరేలా ఉండేదని పరిశోధకులు భావిస్తున్నాయి. అంటే ఇప్పటి ఫోన్లకు అప్పటి ఫోన్ల రేడియేషన్ లో చాలా వ్యాత్యాసం ఉందని వారు పేర్కొంటున్నారు. 

అయితే ఇప్పటి ఫోన్లు  RF-EMW లను ఎంత మొత్తంలో రిలీజ్ చేస్తాయో పూర్తిగా తెలుసుకుని దానిపై అధ్యయనం చేయాల్సి ఉందని పలువురు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కానీ సెల్ ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ శుక్రకణాల నాణ్యతనే కాదు మనిషి ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తుంది. అందుకే వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Blouse Designs: కళ్లు చెదిరిపోయేలా హెవీ బ్లవుజు డిజైన్లు
డిసెంబర్ లో కచ్చితంగా చూడాల్సిన ప్రదేశం ఇది