Potatoes Side Effects: మొలకెత్తిన ఆలుగడ్డలు అంత ప్రమాదకరమా?

By Mahesh RajamoniFirst Published Jan 28, 2022, 5:11 PM IST
Highlights

Potatoes Side Effects: బంగాళ దుంపళలతో రకరకాల టేస్టీ టేస్టీ వంటకాలు చేసుకుని తింటుంటాం. అయితే ఈ బంగాళ దుంపలు కొన్న కొన్ని రోజులకే మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చిన బంగాళదుంపలను తినడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే.

Potatoes Side Effects: బంగాళదుంపల్లో ఎన్నో పోషక విలువలుంటాయి. అందుకే వీటితో రకరకాల డిషెస్ చేసుకుని తరచుగా తింటూ ఉంటారు. ఈ బంగాళ దుంపలను కూరలోనే కాదు సాంబర్ లోనూ వాడుతుంటారు. అయితే ఈ సంగతి పక్కన పెడితే బంగాలదుంపళను కొన్న కొన్ని రోజులకే మొలకలు వస్తూ ఉండటం మనం తరచూ చూస్తున్నదే. అయితే ఆ మొలకలొచ్చిన బంగాళ దుంపలను చాలా మంది అలాగే కూర వండుకుని తినేస్తుంటారు. అయితే ఆ మొలకలొచ్చిన బంగాళా దుంపలు ఆరోగ్యానికి మంచివేనా? కాదా? అనే అందేహం ఎవ్వరికీ రాకుండొచ్చు. కానీ ఈ విషయంపై అమెరికాకు చెందిన  National Capital Poison Center పలు ఆసక్తికరమైన విషయాలను వెళ్లడించింది. మొలకెత్తిన బంగాళదుంపలు ఆరోగ్యానికి మంచివి కావని తెలియజేస్తోంది. ఒకవేళ మీరు కొన్న బంగాళ దుంపలకు మొలకలు వస్తే వెంటనే తీసి బయటపడేయాలని పేర్కొంటోంది. ఎందుకంటే మొలకెత్తిన బంగాళదుంపలు ఆరోగ్యానికి ఎంతో చేటు చేస్తాయని హెచ్చరిస్తోంది. 

మొలకెత్తిన బంగాళ దుంపలు తింటే ఎటువంటి సమస్యలొస్తాయి: సాధారణ బంగాళదుంపలు చాకోనిన్, సోలనిన్ వంటి విష పదార్థాలను సహజంగా కలిగి ఉంటాయి. వీటిలో ఈ విష పదార్థాలు తక్కువ శాతం ఉన్నా.. దాని ఆకులల్లో, మొక్కలో ఎక్కువ శాతం ఉంటాయి. అంతేకాదు మొలకెత్తిన బంగాళ దుంపల్లో ఈ విషపదార్థాలు డబుల్ అవుతాయని నేషనల్ క్యాపిటల్ పాయిజన్ సెంటర్ హెచ్చరిస్తోంది. ఒకటి రెండు సార్లు ఈ మొలకెత్తిన బంగాళ దుంపలను తింటే ఎటువంటి ప్రమాదం లేదు కానీ.. తరచుగా తింటే మాత్రం కడుపు సంబంధిత సమస్యలు రావడంతో పాటుగా ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తోంది. 

మొలకెత్తిన బంగాళదుంపలను తినడం అందులోని విషయదార్థాలు వల్ల మీ శరీరంలోకి వెళ్లినట్లైతే.. మీకు వెంటనే కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు అవుతాయి. ఇలాంటి లక్షణాలు కొంత మంది తీవ్ర స్థాయిలో లేనప్పటికీ, కొంతమందికి తీవ్రంగా ఉంటాయి. దీని ప్రభావం మరింత తీవ్రమైతే మాత్రం బీపీ తగ్గడం, తీవ్రమైన తలనొప్పి, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. అటువంటి సమయంలో సరైన చికిత్స పొందకపోతే ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉంది.

బంగాళదుంపలు మొలకలు రాకుండా ఏం చేయాలంటే: బంగాళదుంపలను చల్లటి ప్రదేశంలో ఉంచడం వల్ల మొలకలు రావు. అలాగే వాటిని ఉల్లిగడ్డలకు దగ్గరలో  పెట్టకూడదు. వాటి దగ్గర పెడితే అవి తొందరగా మొలకలు వస్తాయి. వీటిని ఎక్కువ మొత్తంలో కొన్నప్పుడు ఒక కాటన్ సంచిలో పెట్టి గాలి వెళ్లేలా తెరచి ఉంచాలి. కాగా బంగాళదుంపలను కొనే టప్పుడు అవి పచ్చగా కనిపించకుండా ఉంటేనే కొనుగోలు చేయండి. ఎందుకంటే పచ్చగా ఉంటే అవి మొలకలు రావడానికి సిద్దంగా ఉన్నాయని అర్థం. 

click me!