Beauty: ఫేస్ సీరమ్ వాడుతున్నారా..? ఏది దేనికోసమో తెలుసా..?

By Ramya news teamFirst Published Jan 29, 2022, 4:05 PM IST
Highlights

ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీనిలో ఉుండే సెరమైడ్స్, అమైననో ఆసిడ్స్.. చర్మం సహజంగా, మృదువుగా కనిపించేలా చేస్తాయి.
 

ఈ మధ్యకాలంలో.. చర్మ సౌందర్యంపై అందరికీ దృష్టి పడింది. అందుకే.. చర్మాన్ని  కాపాడుకోవడానికి ఏవేవో క్రీములు వాడుతున్నారు. అయితే... అందరికీ ఎక్కువగా నచ్చుతున్న.. అందరూ మెచ్చుతున్న వాటిలో ఫేస్ సీరమ్ ఒకటి. ఈ ఫేస్ సీరమ్ ని ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల... ముఖంపై మెరుపును తీసుకువస్తుంది అంతేకాదు.. యవ్వనంగా కనపడేలా కూడా సహాయం చేస్తుంది.  ఈ సీరమ్ వాడటం వల్ల మన చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయో... ఏ రకంఫేస్ సీరమ్ వాడాలో ఓసారి చూద్దాం..

విటమిన్ సీ ఫేస్ సీరమ్ ... ఇది వృద్ధాప్య ఛాయల్ని మన దరి చేరకుండా సహాయం చేస్తుంది. మూడు పదుల వయసు దాటినవారందరూ దీనిని వాడటం మొదలుపెట్టవచ్చు. ఇది కొలాజెన్ స్థాయిలను పెంచడమే కాకుండా.. ముఖంపై మెరుపును తీసుకువస్తుంది.

హ్యాలురోనిక్ ఆసిడ్ సీరమ్ ... ఇది చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీనిలో ఉుండే సెరమైడ్స్, అమైననో ఆసిడ్స్.. చర్మం సహజంగా, మృదువుగా కనిపించేలా చేస్తాయి.

యాంటీ ఆక్సిడెంట్లు సీరమ్... కాలుష్యం కారణంగా దెబ్బతిన్న  చర్మాన్ని రక్షించడానికి ఇది సహాయపడుతుంది. ఈ కాలుష్యాన్నిచర్మం నుంచి రక్షించడానికి బాటా కెరొటిన్, గ్రీన్ టీ, బెర్రీలు, దానిమ్మ, దాక్ష గింజల సమ్మేళనాలను అందించాల్సి ఉంటుంది. ఇవి సీరమ్ లో పుష్కలంగా ఉంటాయి.

రెటినాల్స్ సీరమ్ .. కొందరికి వయసుతో సంబంధం లేకుండా మొటిమల సమస్య వేధిస్తూ ఉంటుంది. అంతేకాకుండా చర్మంపై దద్దుర్లు లాంటివి వచ్చి వేధిస్తూ ఉంటాయి. కాలుష్యం కారణంగా ముడతలు కూడా వస్తూ ఉంటాయి. అలాంటి వారు రెటినాల్స్ సీరమ్ ని ఎంచుకోవాలి.

ప్లాంట్ బేస్డ్.. దీనిలో లికోరైస్ వంటి గుణాలుంటాయి. చర్మం నిర్జీవంగా ఉండేవారు దీనిని ఎంచుకోవడం ఉత్తమమం. ఇది ముఖంపై ఎండ, మొటిమల కారణంగా ఏర్పడిన మచ్చలను తొలగించడానికి సహాయం చేస్తుంది.

యాంటీ ఇన్ ఫ్లమేటరీ...  సున్నితమైన చర్మం ఉన్నవారు.. ఈ సీరమ్ ని ఎంచుకోవచ్చు. అలెవెరా, ఆర్నికా, జింక్ వంటి గుణాలతో దానిని తయారు చేస్తారు. చర్మాన్ని నునుపుగా చేయడమే కాకుండా..  మొటిమలు రాకుండా సహాయం చేస్తుం

click me!