
హిందూ మత శాస్త్రాల ప్రకారం ఉదయం సమయం ఎంతో శుభప్రదమైనది. పూర్తిగా పాజిటివ్ ఎనర్జీతో ఆ సమయం నిండి ఉంటుంది. అందుకే ఆ సమయంలో చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయనే నమ్మకం ఉంది. అందరికీ పూజలు, వ్రతాలు చేసేంత సమయం ఉండకపోవచ్చు. కాబట్టి ఉదయం లేచాక లేదా ఇంటి నుంచి బయటికి వెళ్లిటప్పుడు కొన్ని చిన్న మంత్రాలు జపించడం వల్ల రోజంతా పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఆఫీస్‌కు బయలుదేరే ముందు ఒక్క నిమిషం పాటూ ఈ ఐదు చిన్న మంత్రాలను జపిస్తే చాలు, రోజంతా సానుకూల శక్తి మీతో పాటూ కొనసాగుతూ ఉంటుంది. అక్కడ ఆ ఐదు మంత్రాలు ఇక్కడ ఇచ్చాము.
ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్
ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ ఏకాగ్రత పెరుగుతుంది.
వినాయకుడి మంత్రం ఇది. ఈ మంత్రం జపించడం వల్ల అన్ని ఆటంకాలను తొలగిస్తుందని నమ్మకం. అందుకే ఏ శుభకార్యం ప్రారంభించే ముందైనా ఈ మంత్రాన్ని జపిస్తారు.
3. మహామృత్యుంజయ మంత్రం:
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతాత్॥
ఈ శివ మంత్రాన్ని పఠించడం వల్ల మానసిక బలం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఎంతో మంది నమ్మకం.
శివుని పంచాక్షరీ మంత్రం ఇది. దీన్ని జపించడం వల్ల మనసులో స్థిరత్వాన్ని, సానుకూల ఆలోచనలను నింపడానికి సహాయపడుతుంది.
ఈ హనుమాన్ మంత్రం ఉదయం పూట చెప్పడం వల్ల ధైర్యం, శక్తి పెరుగుతుంది. ఇది ప్రతికూల ఆలోచనలను కూడా దూరం చేస్తుందని చెబుతారు.
హిందూ శాస్త్రాల్లో కొన్ని చాలా శక్తివంతమైనవి మంత్రాలు. పైన చెప్పిన ఐదు మంత్రాలు కూడా అలాంటివే. ఈ మంత్రాలను పూర్తి విశ్వాసంతో, భక్తితో జపిస్తే, అవి మీకు కచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తాయి. ఈ మంత్రాలు మన మనసుకు, ఆత్మకు పాజిటివ్ ఎనర్జీని అందించి, మనం చేసే అన్ని పనులలో విజయం సాధించేలా చేస్తాయి.