Mosquitos: మీ ఇంట్లో ఈ దోమల అగర్‌బత్తీలు వాడుతున్నారా? జాగ్రత్త! క్యాన్సర్ కంటే ప్రమాదం

Published : Jun 26, 2026, 07:14 PM IST
Governments Ban Illegal Mosquito Incense Sticks Over Health Risks

సారాంశం

Mosquito Incense Sticks: ఈ మధ్యకాలంలో "హెర్బల్", "నాచురల్" అనే లేబుళ్లతో మార్కెట్లోకి వస్తున్న దోమల అగర్‌బత్తీలను ప్రజలు గుడ్డిగా నమ్మి కొనేస్తున్నారు. అయితే, మనకు సువాసన ఇస్తూ దోమలను తోలేస్తున్నాయని మనం అనుకుంటున్న ఈ అగర్‌బత్తీలు.. నిజానికి మన ఆరోగ్యాన్ని లోలోపలే గుల్ల చేస్తూ, ప్రాణాంతకంగా మారుతున్నాయని మీకు తెలుసా? 

 

వేసవి, వర్షాకాలం వచ్చిందంటే చాలు.. దోమల రొద, వాటి ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధుల భయం అందరినీ వెంటాడుతుంది. దోమల నుంచి రక్షణ పొందడానికి చాలామంది ఇళ్లలో దోమల నివారణ కాయిల్స్ లేదా అగర్‌బత్తీలను (Mosquito Repellent Incense Sticks) వెలిగిస్తుంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో "హెర్బల్", "నాచురల్" అనే లేబుళ్లతో మార్కెట్లోకి వస్తున్న దోమల అగర్‌బత్తీలను ప్రజలు గుడ్డిగా నమ్మి కొనేస్తున్నారు. అయితే, మనకు సువాసన ఇస్తూ దోమలను తోలేస్తున్నాయని మనం అనుకుంటున్న ఈ అగర్‌బత్తీలు.. నిజానికి మన ఆరోగ్యాన్ని లోలోపలే గుల్ల చేస్తూ, ప్రాణాంతకంగా మారుతున్నాయని మీకు తెలుసా?

ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఇలాంటి నకిలీ, చట్టవిరుద్ధమైన బ్రాండ్లపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో వీటిపై భారీ ఎత్తున నిషేధం విధించడమే కాకుండా, దాడులు చేసి లక్షలాది రూపాయల విలువైన స్టాక్‌ను సీజ్ చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు.. నిలిచిపోయిన అమ్మకాలు

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రిజిస్టర్ కాని, చట్టవిరుద్ధమైన దోమల అగర్‌బత్తీలపై తనిఖీలు తీవ్రమయ్యాయి.

మహారాష్ట్ర: మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న 'స్లీప్‌వెల్' (Sleepwell), 'కంఫర్ట్' (Comfort) వంటి అగర్‌బత్తీలపై రాష్ట్రవ్యాప్త నిషేధం విధించింది.

ఆంధ్రప్రదేశ్: విజయవాడలో అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో.. ఎలాంటి అనుమతులు లేని, దాదాపు 69 లక్షల రూపాయల విలువైన ప్రమాదకరమైన 'స్లీప్‌వెల్' అగర్‌బత్తీలను సీజ్ చేశారు.

ఉత్తరప్రదేశ్: యూపీలోని వివిధ జిల్లాల యంత్రాంగాలు గట్టి నిఘా పెట్టాయి. 'స్లీప్‌వెల్', 'కంఫర్ట్' లతో పాటు 'స్వీట్ నైట్' (Sweet Night), 'డైనోసార్' (Dinosaur) 'శ్రీ డెంగ్యూ కిల్లర్' (Shri Dengue Killer) పేరుతో చలామణి అవుతున్న అగర్‌బత్తీల అమ్మకాలను, పంపిణీని తక్షణమే నిలిపివేయాలని తయారీదారులు, రిటైలర్లను ఆదేశించాయి.

ఈ ప్రొడక్ట్స్ అన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ ఇన్‌సెక్టిసైడ్స్ बोर्ड (CIBRC) నుండి ఎలాంటి అనుమతులు లేదా రిజిస్ట్రేషన్ నంబర్లు పొందకుండా, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

ల్యాబ్ పరీక్షల్లో షాకింగ్ నిజాలు.. ఏముంది ఆ పొగలో?

సాధారణంగా ఈ అగర్‌బత్తీలను వేప, తులసి, సిట్రొనెల్లా వంటి సహజసిద్ధమైన మూలికలతో తయారు చేశామని ప్యాకెట్లపై ముద్రిస్తారు. కానీ ల్యాబ్ పరీక్షల్లో తేలిన నిజాలు మాత్రం మనల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ చట్టవిరుద్ధమైన అగర్‌బత్తీలలో ప్రభుత్వ అనుమతి లేని, మోతాదుకు మించిన 'డైమెఫ్లుత్రిన్' (Dimefluthrin), 'మెపర్‌ఫ్లుత్రిన్' (Meperfluthrin) వంటి అత్యంత ప్రమాదకరమైన కీటక నాశిని (Insecticide) రసాయనాలను వాడుతున్నారు.

డాక్టర్లు ఏమంటున్నారు? హెల్త్ సర్వే షాకింగ్ రిపోర్ట్

హోమ్ ఇన్‌సెక్ట్ కంట్రోల్ అసోసియేషన్ (HICA) పర్యవేక్షణలో నిర్వహించిన ఒక పబ్లిక్ హెల్త్ సర్వేలో వైద్యులు కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు:

70% మంది డాక్టర్ల అభిప్రాయం ప్రకారం: అనుమతి లేని కెమికల్స్ ఉన్న ఈ దోమల అగర్‌బత్తీల పొగను నిరంతరం పీల్చడం వల్ల మనుషుల్లో తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు (Major Respiratory Hazards) తలెత్తుతున్నాయి.

90% మంది డాక్టర్ల పరిశీలన ప్రకారం: ఈ ప్రమాదకరమైన పొగకు గురికావడం వల్ల చిన్నపిల్లల్లో తరచూ గొంతు మంట, విపరీతమైన దగ్గు , అలర్జీలు వస్తున్నాయి.

గమనిక: ఈ కెమికల్స్ కలిపిన అగర్‌బత్తీల పొగ ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధులు , ఆస్తమా (Asthma) రోగులకు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.

ప్రస్తుతం 'స్లీప్‌వెల్' వంటి బ్రాండ్స్ బ్యాన్ అయినప్పటికీ.. మార్కెట్లో ఇప్పటికీ 'హంటింగ్ టైగర్' (Hunting Tiger), 'సుభానిద్ర' (Subhanithra) వంటి మరికొన్ని కొత్త పేర్లతో అదే ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్న అగర్‌బత్తీలను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. లాంగ్ టర్మ్‌లో ఈ పొగను పీల్చడం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వినియోగదారులు ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. దోమల నివారణ ప్రొడక్ట్స్ కొనేటప్పుడు వినియోగదారులు కచ్చితంగా ఈ క్రింది విషయాలను గమనించాలి:

CIR నంబర్ తనిఖీ చేయండి: మీరు కొనే ఏ దోమల అగర్‌బత్తీ లేదా కాయిల్ ప్యాకెట్ పైన అయినా CIR (Central Insecticide Registration) నంబర్ ఉందో లేదో గమనించండి. ఈ నంబర్ ఉంటేనే అది ప్రభుత్వం ల్యాబ్ లలో పరీక్షించి, సురక్షితమైన మోతాదులో కెమికల్స్ ఉన్నాయని సర్టిఫై చేసిన చట్టబద్ధమైన ప్రొడక్ట్ అని అర్థం.

గుడ్డిగా నమ్మకండి: ప్యాకెట్ మీద కేవలం 'హెర్బల్' (Herbal) లేదా '100% ఆర్గానిక్' (Natural) అని రాసి ఉన్న మాటలను చూసి మోసపోకండి. ప్రభుత్వం ఆమోదించిన సీల్స్ ఉంటేనే నమ్మండి.

నిపుణుల సూచనలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన, మార్కెట్లో పేరున్న రిజిస్టర్డ్ బ్రాండ్స్ ప్రొడక్ట్స్‌ని మాత్రమే వాడటం ఉత్తమం.

దోమలను చంపే క్రమంలో మనం పీల్చే గాలిని విషపూరితం చేసుకోకూడదు. కాబట్టి, దోమల అగర్‌బత్తీలను కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. నకిలీ వస్తువులను దూరం పెట్టి, మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. స్టే అలర్ట్.. స్టే సేఫ్!

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dal Tadka: తాళింపు సీక్రెట్.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ దాల్ తడ్కా, వాసనకే కడుపునిండిపోద్ది
Psychology: సైకాలజీ ప్రకారం మన మెదడు ఎందుకు నెగెటివ్ విషయాలనే ఎక్కువ గుర్తుపెట్టుకుంటుంది?