Telugu

Fennel Seeds: భోజనం తర్వాత స్పూన్ సోంపు తింటే ఏమౌతుంది?

Telugu

సోంపులో పోషకాలు...

భోజనం తర్వాత సోంపు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. కేవలం ఆహారం జీర్ణం అవ్వడానికి మాత్రమే కాదు, ఈ సోంపులో చాలా పోషకాలు ఉంటాయి. దీనిని తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి.

Image credits: Getty
Telugu

పీరియడ్ పెయిన్ ని తగ్గిస్తుంది..

మహిళలకు నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి, ఇతర నొప్పుల నుంచి ఉపశమనం అందించడంలో సోంపు బాగా సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu

రక్తపోటును నియంత్రిస్తుంది

సోంపు నమలడం వల్ల రక్తపోటు (బీపీ) అదుపులో ఉంటుంది. సోంపులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది హృదయ స్పందన రేటును, రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
Image credits: Getty
Telugu

అజీర్తి, మలబద్ధకానికి చెక్ పెడుతుంది

మీకు అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు ఉంటే, భోజనం తర్వాత కొద్దిగా సోంపు నమలండి. ఇది కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది.
Image credits: Getty
Telugu

ఆస్తమా, కఫం తగ్గుతాయి

ఆస్తమా, కఫం వల్ల వచ్చే దగ్గుతో బాధపడేవారు సోంపు తింటే మంచిది. ఇది ఆస్తమా, సైనస్, కఫం వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
Image credits: pexels
Telugu

నోటి దుర్వాసన పోతుంది

సోంపు నమలడం వల్ల నోటి దుర్వాసన తొలగిపోతుంది. ఇది లాలాజల ఉత్పత్తిని పెంచి, సహజమైన మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది.
Image credits: Getty
Telugu

పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది

సోంపులో యాంటీస్పాస్మోడిక్ గుణాలు ఉన్నాయి. ఇవి కడుపు నొప్పి, పేగుల్లో అసౌకర్యాన్ని తగ్గించి, వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
Image credits: Getty

Gold Earrings: ట్రెండింగ్ డిజైన్ లో బంగారు కమ్మలు.. చూస్తే ఫిదా!

Victorian Set: పట్టు చీరలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే విక్టోరియన్ సెట్స్

Gold Bracelet: క్యూట్ డిజైన్ లో గోల్డ్ బ్రేస్లెట్స్.. ఓ లుక్కేయండి!

Pearl Bangles: ముచ్చటైన ముత్యాల గాజులు.. అదిరే డిజైన్లు