
కళ్ళు తెరిపించిన బ్రిటన్ పరిశోధన... ఈ పరిశోధనను లండన్ విశ్వవిద్యాలయ కళాశాల, లండన్ కింగ్స్ కళాశాల, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కలిసి చేశారు.
వారు బ్రిటన్ లో 1946 నుంచి పుట్టిన వారిని అనుసరించిన యాభై ఒక్క పరిశోధనలను కలిపి విశ్లేషించారు.
1946 లో పుట్టిన వారిని ఒక బృందంగా,
1958 లో పుట్టిన వారిని మరో బృందంగా,
1970 లో పుట్టిన వారిని మరో బృందంగా,
1989 - 1990 లో పుట్టిన వారిని మరో బృందంగా,
2000 తరువాత పుట్టిన వారిని మరో బృందంగా విడదీశారు.
ప్రతి బృందంలో లక్షల మంది ఉన్నారు. వారిని పుట్టినప్పటి నుంచి, పిల్లలుగా, యువకులుగా, పెద్దలుగా, ముసలివారు అయ్యే వరకు ప్రతి కొన్ని ఏళ్లకు ఒకసారి పరీక్షించారు. వారి ఎత్తు, బరువు, రక్తపోటు, రక్తంలో చక్కెర, గుండె, ఊపిరితిత్తులు, మనసు నోట్ చేసుకున్నారు.
తరువాత ఒకే వయసు వచ్చినప్పుడు, పెద్ద తరం వారిని, తరువాత తరం వారిని పోల్చారు. ఉదాహరణకు, పెద్ద తరం వారు నలభై నాలుగు ఏళ్ల వయసులో ఎలా ఉన్నారో, తరువాత తరం వారు నలభై నాలుగు ఏళ్ల వయసులో ఎలా ఉన్నారో చూశారు.
ఫలితం ఆశ్చర్యం కలిగించింది...
నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది ఏళ్ల వయసులో:
పెద్ద తరంలో మధుమేహం: వందకు ముగ్గురు
తరువాత తరంలో మధుమేహం: వందకు ఆరుగురు
అంటే రెండింతలు ఎక్కువ!
అంతే కాదు. తరువాత తరంలో ఊబకాయం చాలా ఎక్కువ. రక్తపోటు ఎక్కువ. గుండె జబ్బులు ముందే వస్తున్నాయి. దిగులు, ఆందోళన, నిద్రలేమి కూడా తరువాత తరంలో చాలా ఎక్కువ.
పదహారు నుంచి ఇరవై నాలుగు ఏళ్ల వయసులోనే, తరువాత తరం పిల్లల్లో దిగులు, ఆందోళన పెద్దల కంటే ఎక్కువగా కనిపించిందని ఈ పరిశోధన చెబుతోంది.
వింత ఏమిటంటే:
తరువాతి తరం వారు...
ఎక్కువ చదువుకున్నారు.
చిన్నప్పటి నుంచి మంచి ఇల్లు, మంచి తిండి, మంచి సుఖాలతో పెరిగారు.
పుట్టినప్పటి నుంచి మంచి వైద్యం అందింది.
అయినా సరే, వారు పెద్దల కంటే అనారోగ్యంతో ఉన్నారు. దీనిని పరిశోధకులు తరాల ఆరోగ్య క్షీణత అంటున్నారు.
డిజిటల్ డిప్పగాళ్ళు... "ఏముంది.. ఎక్కువ టెస్ట్ లు చేశారు కాబట్టి ఈ రోజుల్లో ఎక్కువ రోగాలు బయట పడుతున్నాయి" అంటారు.
ఇది వైద్యులు ఎక్కువగా పరీక్షలు చేయడం వల్ల కాదు. ఎందుకంటే ఊబకాయం కంటికి కనిపిస్తుంది, మధుమేహం రక్త పరీక్షలో తెలుస్తుంది. దిగులును కూడా ఒకే కొలమానంతో అందరికీ కొలిచారు.
ఒక చిన్న పరిశోధన అయితే పొరపాటు ఉండవచ్చు. కానీ యాభై ఒక్క పరిశోధనలు, డెబ్బై ఎనిమిది ఏళ్ల పాటు, లక్షల మందిని చూసిన ఫలితం ఇది.
ఎందుకు ఇలా అయ్యింది?
అసలు కారణం రెండే:
1. తిండి మారిపోయింది.
మన అమ్మమ్మలు, నాయనమ్మలు తిన్న సాధారణ తిండి పోయింది. దాని బదులు కర్మాగారాల తిండి, రసాయన తిండి, చక్కెర, బయటి తిండి, పొట్లాల తిండి వచ్చాయి. కడుపు నిండుతోంది, కానీ శరీరానికి బలం రావడం లేదు.
1. కదలిక ఆగిపోయింది.
పెద్దలు నడిచారు, పొలం పని చేశారు, మెట్లు ఎక్కారు, సైకిల్ తొక్కారు.
తరువాత తరం కుర్చీలో కూర్చుని పని, బండిలో ప్రయాణం, తెర ముందు జీవితం.
సుఖం పెరిగింది, కానీ కదలిక తగ్గింది. శరీరం బలహీనమయ్యింది, మనసు కూడా బలహీనమయ్యింది.
ఇది బ్రిటన్ పరిశోధన అయినా, మన భారతదేశంలో పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది.
తరువాత తరమే ఇలా ఉంటే, రోజంతా కూర్చుని, పొట్లాల తిండి తిని, ఆలస్యంగా పడుకుని, తెర చూసే పిల్లలు ఏమవుతారు?
వారు ఇంకా ఎక్కువ కాలం అనారోగ్యంతో బతకాల్సి వస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
మంచి సోమవారం - గింజలు
కాల్షియం మంగళవారం - పాల ఉత్పత్తులు, నువ్వుల లడ్డు
విజ్జి బుధవారం - క్యారెట్, దోసకాయ
టేస్టీ గురువారం - సాంప్రదాయ ఆహారం
ఫ్రూటీ శుక్రవారం - పళ్ళు
సలాడ్ శనివారం, హోం ఫుడ్ ఆదివారం
కాలం మారింది.
ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ.. సినీ తారలు, క్రికెట్ తారలతో పిల్లల మెదడు కడుగుతున్నారు. అందుకే కేవలం నీతులు చెబితే కుదరదు.
పిల్లల నరనరాల్లోకి ఈ శాస్త్రీయ భావన ఎక్కించాలి. అలవాటు చెయ్యాలి.
"అన్నీ తిండ్లు కావు. విషం తిండి కాదు. అది నిన్ను ముందుగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు బానిసను చేస్తుంది. అటుపై స్టార్ ఆసుపత్రికి. ఇదొక మోడరన్ గేమ్.. మాస్టర్ ప్లాన్." అని పిల్లలకు చెప్పాలి.
చిన్నప్పుడు ఏ తిండి అదే రుచి వారి మెదడులో ముద్ర పడిపోతుంది.
బాల్యంలో జంక్ ఫుడ్ కు అలవాటు పడితే అటుపై మారడం కష్టం.. చాలా కష్టం.
కాన్సర్.. ఫ్యాటీ లివర్ వ్యాధి... బి.పి.. ఊబకాయం.. మధుమేహం.. మానసిక కుంగుదల.. లాంటి వాటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.