చాలా మందికి, అనేక కారణాల వల్ల, రాత్రి భోజనం చేసిన తర్వాత మళ్లీ ఆకలిగా అనిపిస్తుంది. పని వేళల్లో మార్పులు, విసుగు, ఒత్తిడి, ఏదైనా పార్టీ ఇలాంటి అనేక కారణాలు కావచ్చు. అయితే, నైట్ డిన్నర్ తరువాత మళ్లీ తినాలా? వద్దా? అనే దానిపై చాలా చర్చ జరుగుతోంది.
నేటి రోజుల్లో రకరకాల కారణాల వల్ల అర్థరాత్రి వరకు మేల్కోవడం ... దీంతో ఆకలితో అనారోగ్యకరమైన ఆహారం తినడం మామూలుగా మారిపోయింది. దీంతో జీవనశైలిలో, ఆహారపుఅలవాట్లలో వచ్చిన ఈ మార్పులు ఒబేసిటీకి దారితీస్తాయి. దీర్ఘకాలంలో అనారోగ్యానికి కారణమవుతాయి. చాలామంది డైట్ లో భాగంగా ఒక సమయం గడిచిన తరువాత ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది పడతారు.
ఒకవేళ ఆకలికి తట్టుకోలేక ఏదో ఒకటి తిన్నా.. ఆ గిల్ట్ ఫీలింగ్ లో ఉంటారు. అయితే అర్థరాత్రి పూట ఎలాంటి బెరుకు లేకుండా హాయిగా తినగలిగే కొన్ని రకాల ఆహారపదార్థాలు మీకోసం...
నిపుణులు ఏం సూచిస్తున్నారు?
చాలా మందికి, అనేక కారణాల వల్ల, రాత్రి భోజనం చేసిన తర్వాత మళ్లీ ఆకలిగా అనిపిస్తుంది. పని వేళల్లో మార్పులు, విసుగు, ఒత్తిడి, ఏదైనా పార్టీ ఇలాంటి అనేక కారణాలు కావచ్చు. అయితే, నైట్ డిన్నర్ తరువాత మళ్లీ తినాలా? వద్దా? అనే దానిపై చాలా చర్చ జరుగుతోంది.
ఇది సరైందే అయితే, ఆ సమయంలో తినే ఆహారాలు ఏమిటి? డైటీషియన్లు, న్యూట్రిషనిస్టులు ఏం చెబుతున్నారు? అంటే... అలా రాత్రిపూట అల్పాహారం తీసుకుంటే, బరువు పెరగరని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో కూడా వీరు చెబుతున్నారు.
బెర్రీలు - ఫైబర్‌తో నిండిన Berriesల తినడం వల్ల కడుపునిండిన భావన కలుగుతుంది. బెర్రీల్లో మెగ్నీషియం ఉంటుంది. ఇవి నరాలు, కండరాలను ఉత్తేజపరిచే ఖనిజాన్ని కలిగి ఉంటాయి.
పీనట్ బటర్, శాండ్‌విచ్ - పీనట్ బటర్ లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది నిద్రను ప్రోత్సహించడానికి మెదడులో మెలటోనిన్‌గా మారుతుంది. బ్రెడ్ వంటి కార్బోహైడ్రేట్లు మెదడుకు ట్రిప్టోఫాన్ మరింత అందుబాటులో ఉండేలా చేయడానికి తోడ్పడుతుంది. అందువల్ల Peanut butter Sandwich నిద్రకు ముందు చిరుతిండిగా తినడానికి సరైన చిరుతిండిగా చెబుతున్నారు.
హొల్ గ్రెయిన్ క్రాకర్స్ : రాత్రిపూట రుచికరమైన, కరకరలాడేవి ఏదైనా తినాలనే ఆకలితో ఉన్నప్పుడు, ఇది ఉపయోగపడుతుంది. దీనికోసం Whole-grain crackers సరైన చాయిస్. అయితే మంచివి కదా అని అతిగా తినకూడదు. అంతేకాదు వీటిల్లో ఉప్పు ఎక్కువగా ఉందా అని గమనించాలని కూడా చెబుతున్నారు.
క్యారట్, హమ్మస్ : కరకరలాడుతూ ఉండి, తక్కువ కేలరీలతో ఉండాలని... కడుపు త్వరగా నిండిన భావన కలగాలంటే.. తాజా hummusతో కూడిన Carrots ఉపయోగపడతాయి.
పాప్‌కార్న్ : ఉప్పగా మరియు క్రంచీగా ఏదైనా తినాలనుకునే వారు Popcorn తీసుకోవాలని చెబుతున్నారు. ఇది ఫైబర్ అధికంగా ఉండే చిరుతిండి, మీరు మళ్లీ తినేవరకు మిమ్మల్ని నిండుగా ఉంచుతుంది. అయితే ఇందులో వెన్న, ఉప్పును వదిలేసి, వాటిని ఆలివ్ ఆయిల్ లేదా తాజా మూలికల వంటి గుండె-ఆరోగ్యకరమైన కొవ్వులతో ఉండేలా చూసుకోవాలి. వాస్తవానికి, మూడు కప్పుల పాప్‌కార్న్‌లో 100 కేలరీల కంటే తక్కువ, సుమారు 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది.
నట్స్ : వాల్‌నట్స్, బాదం వంటి గింజలు సహజమైన మెలటోనిన్, ప్రోటీన్, మెగ్నీషియం కలిగి ఉంటాయి. అందుకే కొద్దిపాటి గింజలు ఆకలిని తగ్గిస్తాయి. నిద్రను ప్రేరేపిస్తాయి.
రోస్టెడ్ గ్రామ్స్ : Roasted Grams అనేది క్రంచీ పోషక-దట్టమైన, తక్కువ కేలరీల చిరుతిండి. వీటిల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటుంది, ఇది బంగాళాదుంప చిప్స్ వంటి ఉప్పుతో కూడిన స్నాక్స్‌కు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది.
తక్కువ కొవ్వు ఉన్న పసుపు కలిపిన పాలు : పాలు కాల్షియం, భాస్వరం, విటమిన్ బి, పొటాషియం, విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలకు గొప్ప మూలం, పాలలో పసుపు కలపడం వలన మీ శరీరం విశ్రాంతిని పొందుతుంది. మెదడుకు ప్రశాంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఈ Low Fat turmeric Milk మీకు రాత్రి పూట మంచి నిద్రను అందిస్తుంది.
World Food Day 2021: చర్మ సౌందర్యానికి ఉపయోగపడే ఫుడ్స్ ఇవి..!