ఈ ఫేస్ ప్యాక్స్ తో.. మొటిమలే కాదు.. మచ్చలు కూడా పోతాయ్..!

Published : Oct 16, 2021, 03:55 PM IST
ఈ ఫేస్ ప్యాక్స్ తో.. మొటిమలే కాదు.. మచ్చలు కూడా పోతాయ్..!

సారాంశం

సహజ పదార్థాలతో చేసే ఈ ఫేస్ ప్యాకులతో సులభంగా మొటిమలతోపాటు.. వాటి తాలూకు మచ్చలను కూడా తరిమేయవచ్చు. అవేంటో ఓసారి చూద్దామా..


ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా  చాలా మంది అమ్మాయిలు.. మొటిమలు, వాటి తాలుకూ మచ్చలతో బాధపడుతున్నారు. వాటిని తొలగించడానికి మార్కెట్లో ఎన్ని క్రీములు అందుబాటులోకి వచ్చినా.. వాటివల్ల శాశ్వత పరిష్కారం దొరకడం లేదు. అయితే.. సహజ పదార్థాలతో చేసే ఈ ఫేస్ ప్యాకులతో సులభంగా మొటిమలతోపాటు.. వాటి తాలూకు మచ్చలను కూడా తరిమేయవచ్చు. అవేంటో ఓసారి చూద్దామా..

ఒకటి ...

ఒక టీస్పూన్ తేనె, నిమ్మరసం,  జాజికాయ పౌడర్,   దాల్చినచెక్క పొడి పేస్ట్ లాగా చేయండి. మొటిమలు ఉన్న ప్రాంతానికి అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఎండిపోయిన తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయండి. ఇది మొటిమల నల్లని మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.

Also Read: World Food Day 2021: చర్మ సౌందర్యానికి ఉపయోగపడే ఫుడ్స్ ఇవి..!

రెండు ...

పాలలో ఒక టీస్పూన్ తేనె , రెండు టీస్పూన్ల ఓట్స్ పోసి బాగా కలపండి. ఈ మాస్క్‌ను అప్లై చేసి 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి.

మూడు ...

అర టీస్పూన్ పసుపు పొడి, ఒక టీస్పూన్ సీవీడ్ పిండి, అర టీస్పూన్ పాలను బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత కడిగేయండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మొటిమల మచ్చలు తగ్గుతాయి.

నాలుగు ...

కలబంద చర్మ సంరక్షణకు మంచిదని అందరికీ తెలుసు. కలబంద జెల్ మొటిమలు , దాని మచ్చలపై అప్లై చేయవచ్చు. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి.

ఐదు ...

అర కప్పు కాల్చిన దోసకాయ మరియు పావు కప్పు పెరుగు కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోండి.

PREV
click me!

Recommended Stories

10 గ్రాముల్లో అందమైన బంగారు నెక్లెస్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో!
పాదాల అందాన్ని రెట్టింపు చేసే మెట్టెలు