జుట్టు బిరుసుతనాన్ని తగ్గించి.. మృదువుగా చేసే హెయిర్ మాస్క్.. ఇంట్లోనే ఇలా....

By AN TeluguFirst Published Oct 19, 2021, 3:05 PM IST
Highlights

బిరుసైన జుట్టు చికాకు పుట్టిస్తుంది. ఇబ్బంది కలిగిస్తుంది. దువ్వుతే వంగదు. నూనెలకు లొంగదు. నూనె రాస్తే కాసేపటికే డ్రై అయిపోతుంది. ఎలాంటి hair stile వేయలేరు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న బిరుసుగా ఉండే జుట్టు మాట వినదు. బిరుసు జుట్టులో కర్లీ హెయిర్ కూడా ఒక భాగమే.

అందమైన తలకట్టు ఉండాలని అందరూ కోరుకుంటారు. ముఖ్యంగా ఆడవారికి జుట్టంటే ప్రాణం.. రకరకాల స్టైల్స్ లో వాటిని తీర్చిదిద్దుకుని మురిసిపోతుంటారు. కొందరికి జుట్టు ఒత్తుగా ఉంటుంది. కానీ గడ్డిగా లేస్తూ ఉంటుంది. ఎంత బాగా తయారైనా ఈ జుట్టు వల్ల వారు చికాకు పడుతుంటారు. నలుగురిలో ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. దీనికి కారణం వారి frizzy hair. జుట్టు బిరుసుగా మారిపోయి..ఎంత మంచి స్టైలింగ్ చేసినా పెద్ద ప్రయోజనం ఉండకుండా సతాయిస్తుంటుంది. 

బిరుసైన జుట్టు చికాకు పుట్టిస్తుంది. ఇబ్బంది కలిగిస్తుంది. దువ్వుతే వంగదు. నూనెలకు లొంగదు. నూనె రాస్తే కాసేపటికే డ్రై అయిపోతుంది. ఎలాంటి hair stile వేయలేరు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న బిరుసుగా ఉండే జుట్టు మాట వినదు. బిరుసు జుట్టులో కర్లీ హెయిర్ కూడా ఒక భాగమే.

మీ జుట్టు బిరుసుగా మారిపోతే దాన్ని స్మూత్ గా చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నారా? ఆయిల్స్, మాస్క్ లు, ట్రీట్మెంట్లు వాడుతున్నారా? అయినా ప్రయోజనం లేకుండా పోయిందా? అయితే ఇంట్లోనే తయారు చేసుకునే ఓ రకమైన హెయిర్ మాస్క్ తో బిరుసు జుట్టు బిరుసుతనాన్ని వంచొచ్చు.

ఉంగరాల జుట్టు మామూలుగా బిరుసుగా ఉంటుంది. అలా కాకుండా మామూలు జుట్టు కూడా చాలా సార్లు బిరుసుగా మారిపోతుంది. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి. వాతావరణంలోని కాలుష్యంతో మొదలుపెట్టి.. హెయిర్ స్ప్రేలు, హీటర్లు, షాంపూలు, వాటిల్లోని రసాయనాలు జుట్టును బిరుసుగా చేస్తాయి. 

అయితే.. మాట విననంటూ బిగుసుకుపోయిన frizzy hairను కూడా జలపాతంలా జాలువారేలా చేయచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా కాస్త సమయాన్ని కేటాయించడం...

ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే ఓ రకమైన hair mask తో మీ జుట్టును మృధువుగా చేసుకోవచ్చు. ఫలితాలు మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. దీనికి ఇంట్లో ఉండే కొన్ని రకాల పదార్థాలు కావాల్సి ఉంటుంది. అవేంటంటే...

బాగా పండిన అరటిపండు ఒకటి తీసుకుని.. దాన్ని మెత్తటి గుజ్జులా చేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల తేనె కావాల్సి ఉంటుంది. దీనికి తోడు రెండు టేబుల్ స్పూన్ల్ చల్లటి పాలు కావాలి. 

ఇప్పుడు ఈ పదార్థాలతో హెయిర్ మాస్క్ ను ఎలా తయారు చేయాలో చూద్దాం. అరటిపండు గుజ్జు, తేనె, పాలు మూడింటిని ఒక గిన్నెలో తీసుకుని బాగా కలపాలి. చక్కగా మిక్స్ అయిన తరువాత జుట్టుకు పట్టించాలి. ఆ తరువాత రెండు గంటల పాటు అలాగే వదిలేయాలి. రెండు గంటల తరువాత జుట్టును కడిగేసుకోవాలి. 

ఆ తరువాత మీరు మీ జుట్టును చూసి ప్రేమలో పడిపోతారు. అప్పటివరకు చిరాకు పెట్టిన జుట్టే మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. జుట్టుతో ఆడుకోవాలనిపిస్తుంది. జుట్టును అలాగే ముట్టుకుంటూ ఆ మృధుత్వాన్ని ఫీలవ్వాలనిపిస్తుంది. మాస్క్ తరువాతి మీ జుట్టు...బిరుసు జుట్టులా జీవరహితంగా కాకుండా.. మెరుస్తూ, నిగనిగలాడుతూ కనిపిస్తుంది. 

click me!