‘చపాతీ కర్రతో... ఇంటికి ఆలస్యంగా వచ్చిన భర్త ను ఏం చేయచ్చు’.. వైరల్ గా మారిన దీపికా పదుకునే పోస్ట్....

By AN TeluguFirst Published Oct 19, 2021, 12:21 PM IST
Highlights

ఆమె ఈ మధ్య.. తన ఇన్ స్ట్రా గ్రామ్ పేజ్ లో ‘బేలాన్ తో ఉపయోగం ఏంటి?’ అంటూ ఓ క్వశ్చన్ పోస్ట్ చేసింది Deepika Padukone. అయితే ఈ పోస్ట్.. Ranveer Singh హోస్ట్ చేస్తున్న క్విజ్ షో ప్రారంభమవ్వడానికి ముందు రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. చర్చనీయాంశంగా మారింది.  

దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్.. బాలీవుడ్ క్యూటెస్ట్ కపుల్. దీపికా అప్పుడప్పుడూ సదరా పోస్టులతో తన అభిమానుల్ని అలరిస్తూ ఉంటుంది. ఇటీవల అలాటి ఓ ఫన్నీ పోస్టుతో మరోసారి క్విజ్ మాస్టర్ గా మారిపోయింది దీపికా పదుకొనే. 

ఆమె ఈ మధ్య.. తన ఇన్ స్ట్రా గ్రామ్ పేజ్ లో ‘బేలాన్ తో ఉపయోగం ఏంటి?’ అంటూ ఓ క్వశ్చన్ పోస్ట్ చేసింది Deepika Padukone. అయితే ఈ పోస్ట్.. Ranveer Singh హోస్ట్ చేస్తున్న క్విజ్ షో ప్రారంభమవ్వడానికి ముందు రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. చర్చనీయాంశంగా మారింది.  

దీపిక అచ్చు క్విజ్ లో అడిగే ప్రశ్నల్లాగే...ఈ Belan ప్రశ్నతో పాటు నాలుగు ఆప్షన్స్ ఇచ్చింది. అది కూడా అతి సాధారణమైన ప్రశ్న అడికింది. అదెలా ఉందంటే...

ప్రశ్న : "వంటగదిలో అందుబాటులో ఈ వస్తువు దేనికోసం ఉపయోగిస్తారు?" 
దానికింద నాలుగు జవాబులు...
ఎ. చపాతీలు చేయడానికి
బి. గుడ్లు ఉడికించడానికి
సి. ఇంటికి ఆలస్యంగా వచ్చిన భర్త ను బెదిరించడానికి
డి. గల్లీ క్రికెట్ లో  బ్యాట్‌గా 

దీనికి అభిమానుల నుంచి సరదా అయిన సమాధానాలు వచ్చాయి. వారంతా నవ్వుతూ స్పందించారు. క్విజ్ షోకు ఇలా అభిమానుల్ని రెడీ చేయడం బాగుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

దీపికా-రణ్ వీర్ లు తమ instagram అభిమానులతో సరదాగా వీడియోలు పంచుకుంటుంటారు. వంటలకు సంబంధించిన వీరు చేసే వీడియోలకు మంచి ఫాలోయింగ్ ఉంది. రుచికరమైన నూటెల్లా పట్ల వారి ప్రేమ నుండి బిర్యానీ వండడం వరకు, ఈ జంట ఆహారం పట్ల వారి ప్రేమను చెబుతుంటారు. అంతేకాదు ఏంతో సరదాగా ఉండే వీరిని అభిమానులు బాగా ప్రేమిస్తారు. 

బాలీవుడ్ క్యూట్ అండ్ లవ్వబుల్ జోడీలలో దీపికా-రణ్ వీర్ లను చూస్తుంటే.. ఒకరి కోసం మరొకరు పుట్టినట్లుగా ఉంటారు. దీపికా-రణ్ వీర్ లు ముందు సినిమాల్లో సూపర్ పెయిర్ గా క్లిక్ అయ్యారు. ఆ తర్వాత అదే ప్రేమకు దారి తీసింది. ఆ తరువాత పెళ్లి చేసుకొని ఆనందకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరి జోడిని అభిమానులు కూడా ఎంతగానో ఇష్టపడతారు.

పెళ్లి తర్వాత కూడా దీపికా సినిమాల్లో నటిస్తున్నారు అంటే.. అది రణ్ వీర్ ఆమెకు ఇచ్చిన మద్దతే కారణం. ఈ విషయాన్ని ఆమె  చాలా సార్లు చెప్పారు. ఇక రణ్ వీర్.. దీపికను రాణి అని చెప్పుకుంటారు. ఆమె వచ్చాక తన జీవితం ఎంతో అందంగా మారిందని గర్వంగా చెప్పుకుంటాడు.

ఇద్దరూ సినిమాల్లో బిజీ స్టార్స్ కావడంతో.. విదేశాలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. అలా ఇద్దరిలో  ఒకరు షూటింగ్ కోసం విదేశాలకు వెళితే.. మరొకరు వెంటనే అక్కడికి వాలిపోతారట, దీపిక పై తనకున్న ప్రేమను చూపించడానికి రణ్ వీర్ ఎప్పుడూ వెనకాడడు. పబ్లిక్ ఉన్నా.. ఈవెంట్ లో ఉన్నా.. తన ప్రేమను చూపిస్తూనే ఉంటాడు,

నిజమైన బంధం ఎప్పుడు నిలపడుతుంది అంటే వారు కుటుంబాలకు, బంధాలు, అనుబంధాలకు విలువ ఇచ్చినప్పుడే అని పెద్దలు  చెబుతుంటారు. ఈ విషయంలో వీరిద్దరూ చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. అందుకే వీరిద్దరూ మేడ్ ఫర్ ఈజ్ అదర్.

శృతిహాసన్ లా నిగారించే చర్మం కావాలా? ఈ హోమ్ మేడ్ స్క్రబ్ ట్రై చేయండి...

 

click me!