సెల్ రిపోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, చల్లని వాతావరణంలో పని చేయడం వలన శరీరంలోని వివిధ ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా శరీరం సామర్థ్యాన్ని పెంచుతుంది . ఈ క్రమంలో.. శరీరంలోని కొవ్వు తొందరగా కరగడానికి సహాయపడుతుంది.
కరోనా మహమ్మారి కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆఫీసులు, కాలేజీలు ఉంటే.. ఆలస్యమౌతుందని హడావిడిగా పరిగెత్తేవాళ్లం. కానీ ఇప్పుడు ఆఫీసులు, కాలేజీలు లేకపోవడంతో తోచక ఎక్కువగా తినేస్తున్నారట. అలా ఎక్కువగా తినేసి.. ఈ లాక్ డౌన్ సమయంలో బరువు పెరిగిన వారు చాలా మందే ఉన్నారు. మరి అలా పెరిగిన బరువును తగ్గించుకోవడమెలా అని మీరు ఆలోచిస్తున్నారా..? అయితే.. ఆ పెరిగిన బరువు తగ్గించుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అని నిపుణులు చెబుతున్నారు.
మీరు చదివింది నిజమే.. అన్ని కాలాలతో పోలిస్తే.. చలికాలంలో సులువుగా బరువు తగ్గించుకోవచ్చట. తాజాగా పరిశోధకులు చేసిన సర్వేలో ఈ విషయం స్పష్టంగా తేలింది.
సెల్ రిపోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, చల్లని వాతావరణంలో పని చేయడం వలన శరీరంలోని వివిధ ఉష్ణోగ్రతలకు తగ్గట్టుగా శరీరం సామర్థ్యాన్ని పెంచుతుంది . ఈ క్రమంలో.. శరీరంలోని కొవ్వు తొందరగా కరగడానికి సహాయపడుతుంది.
Also Read: చీర కట్టుకునేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయకండి..!
బరువు తగ్గే విషయానికి వస్తే, మీ ఆహారం, వ్యాయామం షెడ్యూల్, జీవనశైలి ఎంపికలు ఎఫెక్ట్ చూపిస్తాయి. జిమ్‌లో వ్యాయామం చేయడం మంచిదని చాలామంది భావిస్తుండగా, కొందరు దీనిని పార్కులో చేయడానికి ఇష్టపడతారు. అయితే మన ఫిట్‌నెస్ ప్రయాణంలో వాతావరణం వంటి అంశాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మనలో ఎవరూ ఆలోచించి ఉండరు. సులభంగా త్వరగా బరువు తగ్గడానికి శీతకాలం చాలా అనుకూలంగా ఉంటుంది.
శరీరంలోని కేలరీలను బర్న్ చేయడానికి ఎండాకాలం అయితే.. ఉత్తమం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే.. నిజానికి శీతకాలంలోనే సులువుగా బరువు తగ్గవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: ఆవనూనెతో చేసిన వంటలతో.. బరువు తగ్గొచ్చా?
కోపెన్‌హాగన్ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు కొందరు పురుషులను ఎంచుకొని.. రెండు వాతావరణాల్లో వారితో సమానమైన వ్యాయామం చేయించారు. ఈ రెండింటితో పోల్చి.. ఏ కాలంలో ఎక్కువగా బరువు తగ్గారు అనే విషయంపై క్లారిటీకి వచ్చారు. వారి పరిశోధన ప్రకారం.. చలికాలంలోనే వారు ఎక్కువగా బరువును కోల్పోవడం గమనార్హం.