
Father's Day : ఫాదర్స్ డే రోజున మీ నాన్నను మీరు స్పెషల్ గా ఫీలయ్యేలా చేయాలి అనుకుంటున్నారా? దాని కోసం మీరు ఖరీదైన బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. బదులుగా కొత్తగా వంటలు చేసి నాన్నల దినోత్సవాన్ని మరింత ప్రత్యేకంగా చేయండి. మీకు వంట చేయడం ఇష్టమైతే నాన్నకు ఇష్టమైన ఆరోగ్యకరమైన వంటకాలు చేయండి.
నాన్న కోసం అవకాడో ఎగ్ టోస్ట్
అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఉంటాయి. గుడ్డు కలిపితే ప్రోటీన్, ఇతర పోషకాలు లభిస్తాయి. నాన్నకు బ్రేక్‌ఫాస్ట్‌గా హెల్తీ టోస్ట్ చేయండి. వారికి ఇష్టమైన టీ లేదా కాఫీ కూడా ఇవ్వండి.
బేక్డ్ స్వీట్ పొటాటో
ఓవెన్‌లో సులభంగా స్వీట్ పొటాటో ఫ్రై చేయవచ్చు. బేక్డ్ స్వీట్ పొటాటోలో బీటా కెరోటిన్, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఆలివ్ ఆయిల్ వాడితే పోషకాలు పెరుగుతాయి. వెల్లుల్లి పొడి కూడా వాడండి. దీనివల్ల స్వీట్ పొటాటో మరింత రుచిగా, క్రిస్పీగా ఉంటాయి.
నాన్న కోసం చల్లని లస్సీ
నాన్నకు చల్లని లస్సీ ఇవ్వండి. లస్సీ పెరుగుతో తయారవుతుంది. ఇది శరీరానికి చలువ చేస్తుంది, జీర్ణక్రియకు మంచిది.
స్వీట్ ట్రీట్ కోసం చాక్లెట్ డిప్
మెల్ట్ చేసిన చాక్లెట్‌లో స్ట్రాబెర్రీ ముక్కలు వేసి స్వీట్ డిప్ తయారు చేయండి. స్ట్రాబెర్రీలో యాంటీఆక్సిడెంట్లు, సహజ తీపి ఉంటాయి. నాన్నకు ఈ స్వీట్ డెజర్ట్ చాలా ఇష్టం అవుతుంది.
ఆరోగ్యకరమైన మాక్ టెయిల్
మాక్ టెయిల్ తయారీకి సోడా వాడక్కర్లేదు. పుదీనా, దోసకాయ ముక్కలు, బెర్రీస్ కలిపి రుచికరమైన మోక్‌టెయిల్ తయారు చేయండి. వేసవిలో ఇలాంటి డ్రింక్స్ శరీరాన్ని చల్లగా ఉంచుతాయి, నీటి శాతం తగ్గకుండా చూస్తాయి.