పునర్జన్మ పై జోరుగా ప్రయోగాలు, అందుకోసం తమ వారి మృతదేహాలను ముందుగానే భద్రపరుస్తున్న కుటుంబాలు

Published : Aug 21, 2025, 02:13 PM IST
cryonics

సారాంశం

పునర్జన్మ గురించి ఎన్నో కథలు వినే ఉంటారు. పునర్జన్మ ఒక్కటే ఇప్పుడు మన శాస్త్రవేత్తలకు అంతపట్టకుండా ఉంది. అందుకే దానిపై కూడా ఎన్నో దేశాల పరిశోధకులు పరిశోధనలు చేస్తున్నారు.  

పునర్జన్మ అనేది ఈనాటి కాన్సెప్ట్ కాదు. ఈజిప్టు కాలం నుండి పునర్జన్మపై నమ్మకం ఉంది. కానీ ఇంతవరకు అది ఎక్కడా నిరూపణ కాలేదు. ఇప్పుడు సైన్స్ పరంగా పునర్జన్మను సాధించాలని ఎంతోమంది శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలలో పునర్జన్మ పద్ధతులపై సైన్స్ పరంగా ఉన్న అవకాశాలను ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ నిజ జీవితంలో మాత్రం అది సక్సెస్ కావడం లేదు. భవిష్యత్తులో సైన్సు పునర్జన్మను కూడా ప్రసాదించగలిగే స్థాయికి వస్తే తమ అభిమాన కుటుంబ సభ్యులను తిరిగి బతికించుకోవాలని కొన్ని కుటుంబాలు ఆరాటపడుతున్నాయి.. అలాంటి వారి కోసమే క్రయోనిక్స్ కంపెనీలు పుట్టుకొచ్చాయి.

క్రయోనిక్స్ అంటే...

ప్రతి కుటుంబంలో ప్రియమైన వారు మరణించడం లేదా పెంచుకున్న మూగ జీవాలు మరణించడం జరుగుతూ ఉంటుంది. వాటిని భూస్థాపితం చేయడం లేదా దహనం చేయడం వంటివి చేయకుండా క్రయోనిక్స్ పద్ధతిలో శరీరాన్ని తాజాగా ఉంచుతారు. అందుకోసం -196 డిగ్రీల వద్ద మెదడును శరీరాన్ని స్తంభింప చేస్తారు. దీన్నే క్రయోనిక్స్ పద్ధతి అంటారు. ఇలా ఎన్నో కుటుంబాలు తమ వారి శరీరాలను భద్రపరుస్తున్నారు.

క్రయోనిక్స్ పద్ధతిలో శరీరాన్ని అత్యంత తక్కువ ఉష్ణోగ్రత వద్ద సంరక్షిస్తారు. భవిష్యత్తులో వైద్య పద్ధతులను ఉపయోగించి తమ వారికి పునర్జన్మను పునరుద్ధరించగలిగే స్థితిలో శరీరాన్ని ఉంచడం కోసమే ఈ తాపత్రయం. ఈ ప్రక్రియలో శరీరంలోని కణజాలాలన్నీ నీటని గడ్డ కట్టించి, ద్రవ నత్రజనితో నిండిన స్టీల్ కంటైనర్లో ఉంచుతారు. ఇలా ఉంచడం వల్ల ఎన్నేళ్లు అయినా కూడా ఆ దేహం చెడిపోకుండా తాజాగా ఉంటుంది.

బెర్లిన్ లో ఉన్న టుమారో బయో కంపెనీ 2020లో ప్రారంభించారు. దీని పని మృతదేహాలను క్రయోనిక్స్ పద్ధతిలో భద్రపరచడమే. ఇప్పటికే ఈ కంపెనీలో 20 మృతదేహాలు, పది పెంపుడు జంతువుల మృతదేహాలు ఉన్నాయి. అంతేకాదు ఎనిమిది వందల మందికి పైగా ఈ ప్రక్రియ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. 1972లోనే ఇలాంటి కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఆల్కోర్ అనే కంపెనీ 248 మృతదేహాలను భద్రపరిచింది. అలాగే మిచిగాన్ కు చెందిన కంపెనీ 204 రష్యాకు చెందిన క్రయోరస్ కంపెనీ వంద మనుషుల దేహాలు, 77 జంతువుల మృతదేహాలను ఇలా క్రయోనిక్స్ పద్ధతిలో కాపాడుతూ వస్తోంది.

ఎంత ఫీజు వసూలు చేస్తారు?

క్రయోనిక్స్ పద్ధతిలో మృతదేహాలను భద్రపరిచేందుకు ఆ కంపెనీలు అధిక మొత్తంలోనే డబ్బులను వసూలు చేస్తాయి. ఒక్కొక్క మృతదేహాన్ని భద్రపరచడానికి రెండు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తాయి. అలాగే ఈ కంపెనీలు మెదడును భద్రపరచడానికి ఒక రేటు, శరీరం మొత్తాన్ని భద్రపరచడానికి ఒకరేటుగా నిర్ణయించాయి. ఇలా ఈ కంపెనీలో అధిక మొత్తంలోనే ప్రతి ఏడాది సంపాదిస్తున్నాయి. భవిష్యత్తులో పునర్జన్మ అనే అంశం ఉంటుందో ఉండదో తెలియదు. కానీ ప్రస్తుతం ఆ పేరుతో ఎన్నో కంపెనీలు కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నాయి.

ప్రాచీన ఈజిప్టులో పునర్జన్మ అనేది విపరీతంగా నమ్మేవారు. మరణం తర్వాత కూడా ఆత్మ జన్మిస్తుందని తిరిగి కొత్త జీవితాన్ని పొందుతుందని వారు విశ్వసించేవారు. అందుకోసమే వారు మృతదేహాన్ని ఖననం చేసే పద్ధతి కూడా ప్రత్యేకంగా ఉండేది. కేవలం మరణించిన వారి ఆత్మ కోసమే పిరమిడ్లను నిర్మించారు. ప్రాచీన ఈజిప్షియన్లకు మరణానంతర జీవితంపై ఎంతో నమ్మకం ఉండేది. మరణించిన వ్యక్తి మళ్ళీ జన్మించాలంటే వారు తమ జీవితాన్ని ఎలా గడిపారో... అలాగే గడిపేందుకు కావలసిన వస్తువులు అన్నీ ఉండాలని... అతడి సమాధిలోనే ఆ వస్తువులను పెట్టేవారు. పునర్జన్మ అనేది కేవలం నమ్మకం గానే ఉండిపోయింది. ఇప్పటివరకు సైన్సు ఈ విషయంలో ఎలాంటి ముందడుగు వేయలేదు. అది పూర్తిగా అసాధ్యమైన ప్రక్రియ గానే సైన్స్ నిర్ణయిస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kids Health: పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు అరటిపండు, పెరుగు పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది?
అయిదు గ్రాముల్లో అదిరిపోయే సూయి ధాగా చెవి రింగులు