ఎదుటివారికి వేలు చూపించి మాట్లాడుతున్నారా? అయితే మీ వ్యక్తిత్వం ఎలాంటిదంటే..

Published : Aug 21, 2025, 01:47 PM IST
finger point

సారాంశం

ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు కొందరికి ఎదుటి వారిపై వేలు చూపించే అలవాటు ఉంటుంది. ఇది కొంతమంది తప్పుగా అర్థం చేసుకోవచ్చు కూడా. ఈ అలవాటు మంచిదో కాదో.. ఇది మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుందో తెలుసుకోండి. 

ఒకరికి వేలు చూపించి మాట్లాడడం అనేది ఎంతో మందికి ఉన్న ఒక సాధారణ అలవాటు. దీన్ని ప్రవర్తనలో ఒక భాగంగానే చెప్పుకోవాలి. కాకపోతే ఇలా వేలు చూపించే మాట్లాడటం అనేది వ్యక్తిత్వానికి చెందిన అనేక అంశాలను చెబుతుంది. ఇది ఒక వ్యక్తి శరీర భాష, వారి ఆలోచన, అంతర్గత స్వభావాన్ని కూడా వివరిస్తుంది. ఒకరికి మీరు వేలు చూపించే మాట్లాడుతున్నారంటే మీ వ్యక్తిత్వం ఎలాంటిదో ఇక్కడ వివరించాము.

డామినేషన్ వ్యక్తి

మీరు మాట్లాడేటప్పుడు ఎదుట వ్యక్తి వైపు మీ చూపుడువేలిని చూపిస్తూ ఉంటే అది మీ ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది. అలాగే మీకు ఆధిపత్యం చెలాయించే అలవాటు ఉందని కూడా ఎదుటివారికి అర్థమవుతుంది. మీరు డామినేషన్ పర్సన్స్ అని చెప్పకనే చెబుతుంది. మీరు వేలు చూపించే మాట్లాడినప్పుడల్లా మీరు చెప్పే ప్రతి మాటను ఎదుటివారు తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంటుంది. ఇది మీలో ఆత్మవిశ్వాసమే కావచ్చు. కానీ ఎదుటివారికి మాత్రం బాధపెట్టే అవకాశం ఉంది.

అసహనం

వేలు చూపించి మాట్లాడే అలవాటు ఉన్నవారికి తరచుగా కోపం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వారు అసహనంగా ఉంటారు. వారితో సంభాషించడం కష్టంగా మారుతుంది. చాలా త్వరగా నిగ్రహాన్ని కోల్పోతారు. ఏ విషయాన్ని అయినా వివరించడానికి బదులుగా అరవడానికి, ఆధిపత్యం చెలాయించడానికి చూస్తారు. ఇది వారి వ్యక్తిత్వంలోని నెగెటివిటీని చూపిస్తుంది. కొన్నిసార్లు ఈ ప్రవర్తన అనేది సంబంధాలను వీగిపోయేలా చేస్తుంది. అలాగే వృత్తి జీవితంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని పడేలా చేస్తుంది.

ఒకరిపై పదేపదే వేలు చూపించడం అంటే ఆ వ్యక్తిని నిందించడమే. నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, ఇది నీ తప్పు... ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వేలు చూపించకండి. అలా చూపిస్తే మీ మాటలు, చర్యలు రెండింతలు ఎదుటివారిని కష్టపెడతాయి. మీరు వారిని నిందించడమే పనిగా పెట్టుకున్నారని ఎదుటివారికి అర్థం అవుతుంది. దీనివల్ల మీకు కొత్త సమస్యలు వస్తాయి. ఇలా వేలు చూపించి మాట్లాడే వారిని చాలా తక్కువ మందే ఇష్టపడతారు.

గర్వం ఉందనుకుంటారు

మీకు సంభాషించేటప్పుడు చూపుడువేలిను పదేపదే చూపించే అవకాశం అలవాటు ఉంటే దాన్ని వెంటనే వదులుకోండి. ఇది మీలో ఉన్న అహంకారాన్ని, స్వార్థపూరిత అలవాట్లను, గర్వాన్ని ప్రతిబింబిస్తుంది. మీకు గర్వం లేకపోయినా, మీకు అహంకారం లేకున్నా కూడా ఇలా వేలు చూపించడం వల్ల అవి మీలో ఉన్నాయనే అభిప్రాయం ఎదుటివారికి వచ్చేస్తుంది. వారు మీ మాటలను కాకుండా మీ చూపుడువేలునే ఎక్కువగా పట్టించుకుంటారు. వారు బాధపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.

ఒకరి వైపు పదేపదే చూపుడువేలు చూపించి మాట్లాడే పద్ధతి ఏమాత్రం మంచిది కాదు. ఇది మీకు ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు మిమ్మల్ని మెరుగుపరుచుకోవాలి. శరీర భాష అనేది చాలా ముఖ్యం. మీరు మాట్లాడే మాటలు ఎంత పదునుగా ఉంటాయో.. శరీరం భాష అంతకన్నా పదునుగా మారిపోతుంది. కాబట్టి వేలు చూపించే అలవాటును వెంటనే వదిలేయండి. ఇది మీ వ్యక్తిత్వాన్ని సాలుకూలంగా, స్నేహపూర్వకంగా కనిపించేలా చేస్తుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kids Health: పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు అరటిపండు, పెరుగు పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది?
అయిదు గ్రాముల్లో అదిరిపోయే సూయి ధాగా చెవి రింగులు