Fever : జ్వరం ఉన్నప్పుడు మాంసాహారం ఎందుకు తినకూడదో తెలుసా?

By Mahesh RajamoniFirst Published Jan 20, 2022, 1:52 PM IST
Highlights

Fever : ఈ సమయాల్లో మాంసానికి దూరంగా ఉండాలంటూ పెద్దలు చెబుతూ హెచ్చరిస్తుంటారు. అయితే జ్వరం వచ్చినప్పుడే ఎందుకు మాంసం తినకూడదు అనే విషయానికి సమాధానం చాలా వరకు ఎవరూ చెప్పరు. కేవలం తింటే అనారోగ్యానికి గురవుతారని మాత్రమే చెప్తూ ఉంటారు. అసలు జ్వరంతో బాధపడుతున్నప్పుడు మాంసాహారం తింటే ఏయే సమస్యలు వస్తాయంటే..

Fever : ఈ సమయాల్లో మాంసానికి దూరంగా ఉండాలంటూ పెద్దలు చెబుతూ హెచ్చరిస్తుంటారు. అయితే జ్వరం వచ్చినప్పుడే ఎందుకు మాంసం తినకూడదు అనే విషయానికి సమాధానం చాలా వరకు ఎవరూ చెప్పరు. కేవలం తింటే అనారోగ్యానికి గురవుతారని మాత్రమే చెప్తూ ఉంటారు. అసలు జ్వరంతో బాధపడుతున్నప్పుడు మాంసాహారం తింటే ఏయే సమస్యలు వస్తాయంటే..

చికెన్ బిర్యాని, చికెన్ ఫ్రై, చికెన్ మంచురియా, చికెన్ టిక్కా అంటూ చికెన్ తో ఎన్ని రకాల వంటలు చేస్తే అన్ని రకాలను ఇష్టంగా లాగించేవాళ్లు చాలా మందే ఉన్నారు. అందులోనూ మటన్ కంటే చికెన్ ప్రియులే అధిక మొత్తంలో ఉంటారు. ఇష్టమైన చికెన్ ను టేస్టీగా ఎలా వండుకుని తిన్నా అద్బుతమే అంటూ చికెన్ ను పొగుడుతూ ఉంటారు. అందులోనూ వారానికి ఒకసారైనా చికెన్ పక్కాగా తినేవాళ్లు చాలా మందే ఉంటారు. కాగా ఆరోగ్యంగా ఉండేందుకు చికెన్, మటన్, చేపలు బాగా ఉపయోగపడతాయి. అందులోనూ మాంసాహారం వల్ల శరీరానికి ఎక్కువ శక్తి కూడా లభిస్తుంది. 

అందుకే వారానికి ఒకసారైనా మాంసాహారాన్ని తినాలని వైద్యులు చెబుతూ ఉండటం మనకు తెలిసిందే. అయితే మాంసాహారాన్ని మితిమీరి తింటే కూడా తిప్పలు తప్పవని హెచ్చరిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే మాంసాహారాన్ని ఏయే సమయాల్లో తినాలి.. ఎప్పుడెప్పుడు తినకూడదు అనే విషయాలపై చాలా మందికి కొన్ని అనుమానాలున్నాయి. అందులోనూ జ్వరం వచ్చినప్పుడు కొందరు మాంసాన్ని తినాలంటే.. మరికొందరేమో అస్సలు తినకూడదని హెచ్చరిస్తూ ఉంటారు. మరి ఇందులో ఏది వాస్తవమో.. ఏది కాదో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 

సాధారణంగా జ్వరంతో బాధపడుతున్నప్పుడు మాంసాహారానికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తుంటారు. మటన్, చికెన్ అంటూ దేని జోలికీ వెళ్లకూడదని సలహాలనిస్తూ ఉంటారు. ఎందుకంటే జ్వరంతో ఉన్నప్పుడు మాంసాహారాన్ని తినడం వల్ల జీర్ణ శక్తి తగ్గిపోతుంది. అందుకే మాంసానికి బదులుగా తేలిగ్గా జీర్ణమయ్యే ఫుడ్ నే తినాలని సలహానిస్తుంటారు. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు కూడా మాంసాహారాన్ని తీసుకున్నట్టైతే లివర్ పనితీరు మందగిస్తుందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. మరీ ముఖ్యంగా అలాంటి సమయాల్లో మాంసం తింటే పచ్చకామెర్లు వచ్చే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంటున్నారు. మాంసాహారమే కాదు అధిక నూనెతో చేసిన వంటకాలకు కూడా దూరంగా ఉండాలి. 

అలాంటి సమయాల్లో ఎక్కువగా తేలికపాటి ఆహారం అంటే తొందరగా జీర్ణమయ్యే ఆహారాలనే తినాలి. దీని వల్ల జీర్ణక్రియలు సాధారణంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందులోనూ జ్వరం వచ్చినప్పుడు శరీరానికి తగినన్ని పోషకాలు అవసరం అవుతాయి. అందుకోసం తేలిక పాటి ఆహారాలనే తినాలి. జ్వరంతో ఉన్నప్పుడు కూడా చికెన్ ను తినాలనుకుంటే మాత్రం దానికి మసాలాలను వేయవద్దు. చికెన్ సూప్ జ్వరంతో ఉన్నవాళ్లకు ఇచ్చిన పెద్దగా నష్టమేమీ ఉండదు. కాకపోతే అధికంగా మసాలాలను దట్టించిన చికెన్, బిర్యానీలు, వేపుల్లకు దూరంగా ఉండటం ఉత్తమం. చికెన్ వండుకుని తిన్నా అందులో నూనె శాతం ఎక్కువగా ఉండకూడదు. అలాంటివే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 


 

click me!