Google: స్మార్ట్ ఫోన్ల వాడకం రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. అందులో అమ్మాయిలు కూడా గంటల తరబడి ఆ ఫోన్లతోనే గడుపుతుంటారు. ఎవరికైనా తెలుసా అమ్మాయిలు గూగుల్ లో ఎలాంటి విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారనేది. 75 శాతం మంది మహిళలు గూగుల్ లో అలాంటివే వెతుకుతారట..
Google: అరచేతిలో ప్రపంచాన్ని చూసే ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే పెద్దగా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటారా? ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేక పోతున్నారు. తిండైనా మానేస్తారేమో గానీ, స్మార్ట్ ఫోన్ చూడకుండా, దాన్ని వాడకుండా అస్సలు ఉండలేకపోతున్నారు. అందుకే కదా స్మార్ట్ కొనివ్వలేదనో, చూడనివ్వలేదనో చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలను నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నం. ఈ సంగతి పక్కన పెడితే.. చిన్న చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వాళ్ల వరకూ స్మార్ట్ ఫోన్లతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ల రాకతో మనుషుల మధ్య సంబంధాలు తగ్గిపోయాయి. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నిస్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. అంటే ఇంట్లో కుటుంబ సభ్యులెందరుంటారో అన్ని స్మార్ట్ ఫోన్లు ఖచ్చితంగా ఉంటున్నాయి. దీన్ని యూజ్ చేయడం వల్ల మంచి జరుగుతుందా.. చెడు జరుగుతుందా అంటే అది పూర్తిగా మన చేతిలో పనే. ఇక మనదేశంలో ఇంటర్నేట్ వాడకం రోజు రోజుకు పెరుగుతుందని అధ్యయనాలు తేల్చి చెప్పాయి.
అందులో ఆడ, మగ అంటూ తేడా లేకుండా గంటల తరబడి ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారు. మనదేశంలో ఇంటర్నెట్ ను వినియోగించే వారు సుమారుగా 150 మిలియన్ల దాకా ఉన్నారని ఓ నివేధిక వెళ్లడించింది. ఇక ఇందులో మహిళలలు 60 మిలియన్లు ఉన్నారని పేర్కొంది. కాగా మహిళలే ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారని సర్వే తేల్చి చెప్పింది. వీరిలో 15 నుంచి 34 ఏండ్ల మధ్యనున్న వాళ్లే 75 శాతం మంది ఉన్నారట. కాగా వీరు ఎక్కువగా గూగుల్ సెర్చ్ లో ఏం ఎలాంటి విషయాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎలాంటివి చూసారు అనే విషయాలను గూగూల్ తన సెర్చ్ ను లీస్ట్ ను ఓ నివేధిక ద్వారా తాజాగా వెళ్లడించింది. 75 శాతం మంది మహిళలు గూగుల్ సెర్చ్ లో ఎక్కువగా తమ జీవన శైలిని ఏ విధంగా మెరుగుపరుచుకోవాలనే విషయం పైనే ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు నివేధిక వెళ్లడించింది.
undefined
1. గూగుల్ సెర్చ్ లో ఎక్కవగా తమ కెరీర్ కు సంబంధించిన విషయాలనే మహిళలు ఎక్కువగా వెతుకుతున్నారని తాజా నివేధిక వెళ్లలడిస్తోంది. తమ కెరీర్ ను ఏ విధంగా మలుచుకోవాలి. ఎలా ముందుకు వెళ్లాలి, ఏ విధమైన కోర్సులు తీసుకుంటే ఉపయోగం ఉంటుంది అనే విషయాలను తెలుసుకుంటున్నారు. అలాగే తమకు ఎదురైన సమస్యలను, ఛాలెంజ్ లను ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయాను తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపారు.
2. ఆఫ్ లైన్ షాపింగ్ కంటే ఆన్ లైన్ షాపింగ్ కే ఎక్కువ చూపిస్తున్నారు ఆడవారు. అందుకే గూగుల్ లో మహిళలు ఎలాంటి డ్రెస్సులు బాగుంటాయి. కొత్త కొత్త డిజైన్స్ ఏమొచ్చాయి, ఎలాంటి వాటిపై ఆఫర్లున్నాయి.. వంటి విషయాలను ఎక్కువగా వెతికారని తెలుస్తోంది.
3. ప్రస్తుత కాలంలో యువత అందానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తోంది. అందంగా కనిపించడం కోసం, అందరిలో డిఫరెంట్ లుక్ లో కనినించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే గూగుల్ లో కూడా ఎలాంటి టిప్స్ పాటిస్తే అందంగా కనిపిస్తామని, ఎలాంటి బ్యూటీ ప్రొడక్స్ట్ ను వాడాలని, హోం రెమిడీస్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నట్టు అధ్యయనాలు వెళ్లడించాయి.
4. గోరింటాకంటే పడి చచ్చిపోయే యువతులు లేకపోలేదు. చేతికి ఉన్న మొహందీ డిజైన్ పూర్తిగా తొలగిపోకమునుపే మరో కొత్త డిజైన్ తో చేతులను నింపేస్తుంటారు. ఒకప్పుడు గోరింటాకు పెట్టుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపేవారు. కాలంతో పాటుగా అమ్మాయిలు గోరింటాకుకు బదులుగా మెహంది డిజైన్స్ వేసుకోవడానికే మక్కువ చూపిస్తున్నారు. అందుకే గూగుల్ లో లేటెస్ట్ మెహంది డిజైన్లను సెర్చ్ చేస్తున్నారు.
5. ఆడ, మగ అంటూ తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ మంచి సాంగ్స్ ను వినడానికి కాస్త సమయాన్ని కేటాయిస్తుంటారు. కాగా అందులో అమ్మాయిలు ఎక్కువగా రొమాంటిక్ పాటలను వినడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారట. ఆన్ లైన్ లో రొమాంటిక్ సాంగ్స్ ను వినడానికి అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారని అధ్యయనం వెళ్లడించింది.