Paracetamol Side Effects: పారాసెటమాల్ టాబ్లెట్లను అతిగా మింగితే ఎంత డేంజరో తెలుసా..?

Published : Jan 20, 2022, 11:56 AM IST
Paracetamol Side Effects: పారాసెటమాల్ టాబ్లెట్లను అతిగా మింగితే ఎంత డేంజరో తెలుసా..?

సారాంశం

Paracetamol Side Effects: దగ్గు, జ్వరం, తలనొప్పి, జలుబు అంటూ ఏది కొంచెం మనల్ని అటాక్ చేసినా ముందుగా మనకు గుర్తొచ్చేది పారాసెటమాల్ టాబ్లెట్సే. డాక్టర్ల అవసరం లేకుండా చిన్నపాటి జ్వరాన్ని తగ్గించడంలో ఈ మందుబిల్లలు బాగా ఉపయోగపడతాయి. అందులోనూ ఈ టాబ్లెట్లను కరోనా వచ్చినప్పటినుంచి ఇంకా ఎక్కువగా ఉపయోగించడం మొదలు పెట్టారు జనాలు. కానీ వీటిని అతిగా ఉపయోగించడం వల్ల వచ్చే అనర్థాలు బహుషా ఎవరికీ తెలియదేమో. తెలిస్తే గనుక వీటిని వాడటానికి జంకుతారు. ఎందుకో తెలుసా.. 

Paracetamol Side Effects: కరోనా వచ్చినప్పటి నుంచి చిన్నపాటి జ్వరానికి గానీ, దగ్గు, జలుబుకు, తలనొప్పికి సొంత వైద్యాన్ని చేసుకోవాడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. అందులోనూ చిన్నచిన్న సమస్యలకు కూడా హాస్పటల్లకు రాకపోవడమే ఉత్తమనని వైద్యులు కూడా వెళ్లడిస్తున్నారు. అందుకే కరోనా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇంట్లోనే చిన్న చిన్న జబ్బులను నయం చేసుకుంటున్నారు. కాగా కరోనా రాకముందు నుంచి పారాసెటమాల్ (Paracetamol) ను జనాలు వాడుతూ వచ్చారు. 

కానీ కరోనా వచ్చిన తర్వాత ఈ పారాసెటమాల్, క్రోసిన్, డోలో వంటి టాబ్లెట్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఒల్లు కొంచెం వేడిగా అయినా పారాసెటమాల్ టాబ్లెట్లను మింగేస్తున్నారు. కానీ వీటిని ఎంత మోతాదులో తీసుకోవాలో తెలియక జనాలు చిక్కులు పడుతున్నారు. అతిగా పారాసెటమాల్ ను వాడితే అనేక అనర్థాలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మోతాదులోనే ఈ టాబ్లెట్లను తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. లేకుంటే అనేక అనారోగ్య సమస్యలను ‘కొని’తెచ్చుకున్న వాళ్లమవుతామని హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా పారాసెటమాల్ టాబ్లెట్ ను జ్వరం, శరీర నొప్పి, పంటినొప్పి, మైగ్రేన్, పీరియడ్స్ నొప్పి ఉన్నప్పుడు వాడుతుంటారు. కానీ వీటిని మోతాదులో మాత్రమే వినియోగించాలి. ఎందుకంటే దీనిలో స్టెరాయిడ్స్ ఉంటుంది. దీన్ని అతిగా వాడితే శరీరానికి తీవ్ర హాని కలుగుతుంది.  అందుకే చిన్న వాళ్లైనా, పెద్దవాళ్లైనా ఈ టాబ్లెట్ ను మోతాదులోనే తీసుకోవాలి. ఈ మోతాదు అనేది రోగుల బరువు, ఎత్తు , Chronic diseases లాంటి వాటిపై ఆధారపడి ఉంటుందని అమెరికా వైద్య నిపుణులు వెళ్లడిస్తున్నారు. కాగా పెద్దవారికి జ్వరం వచ్చినప్పుడు  4 నుంచి 6 గంటల మధ్యలో 325 నుంచి 650 mg పారాసెటమాల్ ను వేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఫీవర్ వచ్చిన 6 గంటల వ్యవధిలో  500mg పారాసెటమాల్ ను వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఇకపోతే నెలకంటే తక్కువ వయసున్న పిల్లలకు 4 నుంచి 6 గంటల కాలంలో 10 లేదా 15 mg పారాసెటమాల్ ను వెయ్యాలని తెలుపుతున్నారు. అలాగే 12 ఏండ్ల లోపు అంతకంటే ఎక్కువన్న పిల్లలకు  6 నుంచి 8 గంటల మధ్యలో ఈ టాబ్లెట్ ను వెయ్యాలని సూచిస్తున్నారు. పారాసెటమాల్ టాబ్లెట్ ను చిన్న పిల్లలకు 6 నుంచి 8 గంటల వ్యవధిలోనే 10 నుంచి 15 mg ని వెయ్యాలని వైద్యులు తెలుపుతున్నారు.   

అయితే టాబ్లెట్ వేసుకున్న కొద్ది సేపటికే మన సమస్యలు తగ్గడం అంటే అది సాధ్యం కానికి. కొంత సమయం వెయిట్ చెయ్యాలి. అంతేకాని ఎంతకీ ఫీవర్ తగ్గడం లేదని రెండు మూడు గంటల్లోనే పారాసెటమాల్ మళ్లీ వేసుకుంటే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఎంతకీ తగ్గడం లేదనుకుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. అంతేకానీ వెంట వెంటనే వైద్యులను సంప్రదించకుండా వేసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. బరువు తక్కువగా ఉన్నవాళ్లు, కిడ్నీ, లివర్ సమస్యలు, ఆల్కహాల్ ఎక్కువగా తాగేవారు పారాసెటమాల్ ను డాక్టర్లను సంప్రదించిన తర్వాతే వాడాలి. అలాగే వీటిని మోతాదుకు మించి వేసుకోవడం వల్ల చర్మం వ్యాధులు, అలర్జీలు, వాంతులు, విరేచరనాలు, ఆకలిగా అనిపించకపోవడం, తరచుగా చెమటలు పట్టడం వంటి అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

క్రిస్మస్ కోసం స్పెషల్ స్టైలిష్ రెడ్ డ్రెస్‌లు
Ragi Java: చలికాలంలో రాగి జావ తాగితే ఏమౌతుంది?