Laugh : ఒక చిన్ని చిరునవ్వుతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?

By Mahesh RajamoniFirst Published Jan 20, 2022, 2:51 PM IST
Highlights

Laugh : ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్దాలెన్నో గెలవొచ్చు.. ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలన్నో కలపొచ్చు.. అంటూ సాగే పాట నవ్వు వల్ల కలిగే ఎన్నోప్రయోజనాలను చెప్తుంది. నవ్వు వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవచ్చనేది ఎవరూ కాదనలేని నిజం. అయినా కొందరి చాదస్తం కూడా ఇతరుల పెదవులపై చిరునవ్వును లేకుండా చేస్తుంది. నవ్వు నాలుగు విధాల చెడు అనే వాళ్లు తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలున్నాయి..
 

Laugh : నవ్వడం ఒక యోగం, నవ్వించడం భోగం, నవ్వకపోవడం ఒక రోగం అనే సామేత ఊరికే రాలేదు. ఎందుకంటే నవ్వు నాలుగు విధాల మంచే కానీ.. చెడు లేదని. ఒక చిన్ని నవ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ మనుషులు మర మనుషుల్లాగా జీవిస్తున్నారు. లేచామా.. తిన్నామా.. పని చూసుకుని వచ్చామా అనే విధంగానే బతుకుతున్నారు. నలుగురితో కాసేపు మాట్లాడి మనస్ఫూర్తిగా నవ్వే కాస్త సమయం దొరకని వారు నేడు బొచ్చెడు మంది ఉన్నారు. అంతెందుకు ఇంట్లో వాళ్లతో అయినా నవ్వుతారా అంటే అది కూడా లేని వాళ్లు చాలా మంది ఉన్నారు. నవ్వేతే వాళ్ల సొమ్ము ఎవరైనా ఎత్తుకుపోతారనే విధంగా చాలా మంది నవ్వు అంటే ఏంటో తెలియని వారు ఉన్నారు. కానీ ఒక నవ్వు ఎన్ని ఎంత మనశ్శాంతిని ఇస్తుందో, ఎన్ని అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు. అవునండి ఒక చిన్న చిరునవ్వుతో కలిగే లాభాలో ఏంటేంటో ఓ అధ్యయనం తేల్చిచెప్పింది. 

నలుగురితో మాట్లాడి సరదాగా నవ్వుకునే వారికి.. ఒంటరిగా గడిపేవారికి మధ్య చాలా తేడాలు ఉన్నాయని అధ్యయనం వెళ్లడించింది. సరదాగా కాసేపు నవ్వే వారికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. అలాగే నవ్వుతో ఒత్తిడిని ఈజీగా తరిమికొట్టొచ్చు. ముఖ్యంగా రక్త పోటు కూడా నియంత్రణలో ఉంటుందని తేలింది. నవ్వడం వల్ల మన శరీరంలో ఆక్సిజన్ స్థాయి అమాంతం పెరుగుతుందని నిపుణులు వెళ్లడిస్తున్నారు. అలాగే నవ్వుతో ఒత్తిడి తగ్గి ఇమ్యునిటీ పవర్ కూడా పెరుగుతుంది. శ్యాస వ్యాయామంగా నవ్వు ఉపయోగపడుతుందని నిరూపితమైంది. నవ్వు శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ ను బాగా అందించడంలో ముందుంటుంది. నవ్వుతో ఊపిరతిత్తుల సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది. అలాగే నవ్వుతో రోజంతా హ్యాపీగా, ఉత్సాహంగా, శక్తివంతంగా పనిచేయగలుగుతామని అధ్యయనం వెళ్లడించింది.

 అయితే నవ్వే వాళ్లతో పోల్చుకుంటే నవ్వని వాళ్లలో  Blood circulation సరిగ్గా లేదట. కాగా నవ్వడం వల్ల శరీరం ఎన్నో వ్యాధులను ఎదుర్కొనే విధంగా తయారవుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకుని ఎలాంటి రోగాన్నైనా ఇట్టే నయం చేసే శక్తిని పుంజుకుంటుంది. అలాగే నవ్వుతో ఇన్ఫెక్షన్ నిరోధక కణాలను పెంచడంలో ముందుంటుంది. నవ్వినప్పుడు సెరోటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి ఆందోళనను, నిరుత్సాహాన్ని దూరం చేస్తుందని నిపుణులు వెళ్లడిస్తున్నారు. అలాగే నవ్వితే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని తేలింది. మనం చేసే పని పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపడంలో నవ్వు ప్రముఖ పాత్ర వహిస్తుందని అధ్యయనాలు తేల్చి చెప్పాయి. 
 
కాగా మన జీవిత కాలాన్ని పెంచడంలో నవ్వు ఎంతో ఉపయోగపడుతుందట. అందుకే నవ్వుడాన్ని అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహాలనిస్తున్నారు. నవ్వుతో పని పట్ల శ్రద్ధను పెంచుకోవడంతో పాటుగా శరీరం అనేక వ్యాధులను తొందరగా నయం చేసే రోగ నిరోధక శక్తిని కూడా పొందుతుంది. అలాగే ఎముకల బలాన్ని పెంచడంలో నవ్వు ఎంతో ఉపయోగపడుతుంది. సో నవ్వుకు దూరమైన వాళ్లు ఇప్పటి నుంచి రోజూ దీన్ని ఒక వ్యాయామంలా అనుకుని నవ్వడం ప్రారంభించండి. నవ్వుతోనే అందం, ఆనందం. అలసి సొలసిన మనసుకు నవ్వు బూస్ట్ లా పనిచేస్తుంది. అంతేకాదు.. నవ్వుతో ఎన్నో కొత్త బంధాలను పొందవచ్చు. ఎన్నో అసాధ్యమనుకునే సమస్యలను  సుసాధ్యం చేయొచ్చు. 

click me!