Night Shift Food Habits: నైట్ టైం పనిచేసే వారే ఎక్కువగా అనేక సమస్యలకు లోనవుతుంటారు. కారణం.. వేళ కాని వేళలో వారు ఫుడ్ ను తీసుకోవడం వల్లే. పొద్దంతా పడుకుని రాత్రి పనిచేసే సమయంలో చిరుతిళ్లు, ఆహారపదార్థాలను తింటూ ఉంటారు. దీని వల్ల మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకే రాత్రి కంటే పగటిపూట తినడమే ఉత్తమనని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమయంలోనే ఉద్యోగాలు చేయాలన్నా నిబంధనలు ఏమీ లేవు. అందులోనూ కాలం ఎలా అయితే మారుతుందో.. అలాగే ఉద్యోగాలూ.. వారి పని వేళలు కూడా అలాగే మారుతున్నాయి. కొందరు పొద్దంతా వర్క్ చేస్తే.. మరికొందరు నైట్ టైం లో వర్క్ చేస్తున్నారు. అంటే షిఫ్ట్ ల వైస్ గా అన్నమాట. ఒక వారమో లేకపోతే నెలకోసారో మార్నింగ్ టైం లో చేస్తే మరో వారం నైట్ షిఫ్ట్ ల్లో వర్క్ చేస్తున్నారు. అయితే మార్నింగ్ సమయంలో వర్క్ చేసే వారికంటే నైట్ షిఫ్టుల్లో వర్క్ చేసే వారికే ఎక్కువ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే వీరు నైట్ టైం వర్క్ చేసి పొద్దంతా పడుకుంటున్నారు. దీని వల్ల వారి జీవన శైలి పూర్తిగా మారిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు పగటి పూట తినాల్సిన ఆహారాలను, చిరుతిళ్లను రాత్రి పూట తింటున్నారు. ఈ అలవాటు భవిష్యత్ లో గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యల బారిన పడేస్తుంది.
ఇదే విషయం పై అమెరికాలోని National Heart, Lung and Blood Institute సైంటిస్టులు పరిశోధనలు చేసి ఆసక్తికరమై విషయాలను వెళ్లడించారు. ఈ పరిశోధన చేయడానికి ఆరోగ్యంగా ఉన్నా 12 మంది మగవారిని, ఏడుగురు ఆడవారిని ఎంచుకున్నారు. వీరికి ఒక నెల రోజుల పాటు వేర్వేరు Timings లల్లో ఫుడ్ ను పెట్టారు. అలా చేయడం వల్ల వారి జీవన శైలి పూర్తిగా మారి వారి జీవగడియారంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని శాస్త్రవేత్తలు వెళ్లడించారు. ముఖ్యంగా రాత్రి పూట తిన్నవారి శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగాయని తెలియజేశారు.
నైట్ షిఫ్ట్ అయినా కానీయండి.. మరేదైనా కానీయండి.. కానీ వేళ కాని వేళల్లో ఆహారాన్ని తీసుకోవడం మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. పగటి పూట తినడమే ఆరోగ్యానికి మంచిదని శాస్త్రవేత్తలు వెళ్లడిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి పూట పనిచేసే వారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమీ కాదని రాత్రి సమయంలో ఆహారం తిన్నా, చిరుతిళ్లు తిన్నా.. స్థూలకాయం, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని మరిష్కా బ్రౌన్ అనే శాస్త్రవేత్త పేర్కొంటున్నారు. అందుకే ఇకనుంచి ఇలాంటి అలవాట్లుంటే వెంటనే మానుకోండి. ఈ భయంకరమైన సమస్యల నుంచి తప్పించుకున్నవారవుతారు.