Corona Side Effect: కొవిడ్ నుంచి కోలుకున్నవారికి వచ్చే సమస్యలేంటో తెలుసా..?

By Mahesh RajamoniFirst Published Jan 22, 2022, 9:48 AM IST
Highlights

Corona Side Effect: ఏ సమయంలో ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాల మీదికి తెచ్చుకోవాల్సి వస్తుందోనంటూ ప్రజలు బిక్కు బిక్కు మంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ కరోనా వచ్చి తగ్గినా.. భవిష్యత్ లో దీని కారణంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందోనంటూ చాలా మంది ఆందోళలన చెందుతున్నారు. కరోనా తగ్గిన తర్వాత ఎటువంటి సమస్యలు వస్తాయంటే..

Corona Side Effect: ప్రపంచ దేశాలన్నీ కంటికి కనిపించని కరోనా వైరస్ తో యుద్దం చేస్తున్నాయి. దీని బారిన పడి ఇంకొంత మంది ప్రాణాలు పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అయినా ఈ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపెడుతూనే ఉంది. ఇప్పటికే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అంటూ అటాక్ చేసి లక్షల మందిని ప్రాణాలను తీసింది. కాగా సెకండ్ వేవ్ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టిందనుకున్నసమయంలోనే కరోనా థర్డ్ వేవ్ అంటూ, ఒమిక్రాన్ అంటూ ప్రజలపై విరుచుకుపడుతోంది. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దాటికి ప్రజల కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఈ వైరస్ వచ్చి కొన్ని రోజులే అయినా కేసులు విపరీతంగా పెరుగిపోతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ ఒమిక్రాన్ వ్యాప్తికి ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తం అయ్యాయి. కొన్ని దేశాలు లాక్ డౌన్ లు కూడా విధించాయి. ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. మరికొన్ని దేశాలు ఒమిక్రాన్ బారిన పడకుండా ప్రజలకు తగిన జాగ్రత్తలు సూచిస్తున్నాయి. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. అయినా ఈ వేరియంట్ వ్యాప్తి ఏమాత్రం ఆగడం లేదు. ఈ వేరియంట్ చాలా తొందరగా ఒకరినుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుందని అధ్యయనాలు తేల్చి చెప్పాయి. లక్షణాలుల తీవ్రతరంగా లేకపోయినా.. జాగ్రత్త పడాల్సి అవసరం ఎంతో ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చాలా మంది కరోనా సోకి దాని నుంచి బయటపడ్డవారు ఉన్నారు. 

అయితే మహమ్మారి నుంచి బయటపడ్డ తర్వాత వారు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్టు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా వారు జీవితంలో ఏదో కోల్పోయినట్టు, అశాంతి, నిరాశ వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు నిపుణులు వెళ్లడిస్తున్నారు.  కరోనా మహమ్మారి కారణంగా వారు చాలా వరకు జీవితాన్నిసంతోషంగా గడపలేకపోతున్నారట. అందులోనూ దీని కారణంగా నిరుత్సాహం పెరిగిపోతుందని అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. అలాగే దీని నుంచి బయటపడ్డాకా జీవితాన్ని ఉత్సాహంగా స్టార్ట్ చెయ్యలేకపోతున్నారట. జీవితంలో క్రుంగుబాటుకు గురవుతున్నారని నిపుణులు తెలుపుతున్నారు. లైఫ్ లో వెనకబడిపోయాననే ఫీలింగ్ వీరిలోనే అధికంగా కనిపిస్తుందని తెలుపుతున్నారు. ఇలాంటి మానసిక స్థితినే లాంగ్విషింగ్ అంటారు. అంటే జీవితంలో ఇక నేనేమీ చేయలేను, ఇకపై చేసేదేమీ లేదనే భావన కలగడం. ముఖ్యంగా కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వీరు చాలా వరకు మూడ్ ఆఫ్ లోనే ఉంటున్నారట. 

2020లో ఏప్రిల్, జూన్ మధ్యలో సుమారుగా 78 దేశాల్లో కరోనా సోకిన 10 శాతం మందిని ఎంచుకుని వారిపై పరిశోధన చేశారు. కాగా ఆ పరిశోధనలో కొవిడ్ సోకిన వారు ఆ సమయంలో తీవ్ర మానసికి ఒత్తిడికి గురయ్యినట్టు పేర్కొన్నారు. మానసిక ఒత్తిడి వల్ల తమ లైఫ్ ను మునపటిలా లీడ్ చేయలేకపోతున్నారని తెలిపారు. అలాగే దీని వల్ల బద్దకం కూడా వస్తుందని.. అది కూడా ఎక్కువ రోజులు ఉండదని నిపుణులు తెలుపుతున్నారు. కొవిడ్ సమయంలో ఒంటరిగా ఉండటం మూలంగానే ఇలాంటి మానసిక సమస్యలు వస్తాయట. అందుకే తమకు ఇష్టమైన వారితో వారి ఫీలింగ్స్ ను షేర్ చేసుకుంటే ఇలాంటి ఒత్తిడులను, సమస్యలను ఈజీగా అధిగమించొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 

click me!