దీనికోసం తమ toddlers కు రకరకాల రూపాల్లో food ని అందిస్తారు. అయితే, పాలు మానేసి అప్పుడప్పుడే ఘనాహారానికి మారుతున్న మీ పిల్లలకు కొన్ని రకాల ఆహారపదార్థాలు అందించకుండా ఉండడమే మంచిదని చెబుతున్నారు చిన్నపిల్లల నిపుణులు.
చిన్నపిల్లలకు ఆహారం తినిపించేసరికి హరిహరబ్రహ్మాదులు గుర్తుకువస్తారు. వారు సరిగా తినక, పోషకాలు అందక వారి ఎదుగుదల ఎక్కడ దెబ్బతింటుందో అని తల్లిదండ్రులు బాధపడుతుంటారు. దీనికోసం వారికి ఇష్టమైన రూపంలో feeding చేయాలని ప్రయత్నిస్తారు.
దీనికోసం తమ toddlers కు రకరకాల రూపాల్లో food ని అందిస్తారు. అయితే, పాలు మానేసి అప్పుడప్పుడే ఘనాహారానికి మారుతున్న మీ పిల్లలకు కొన్ని రకాల ఆహారపదార్థాలు అందించకుండా ఉండడమే మంచిదని చెబుతున్నారు చిన్నపిల్లల నిపుణులు.
సంవత్సరంలోపు పిల్లలకు అన్నప్రాశన తరువాత వీలును బట్టి కొత్త రుచులను తల్లిదండ్రులు పరిచయం చేస్తుంటారు. అయితే కొన్నిరకాల రుచులు సంవత్సరంలోపు వారికి తెలియకుండా ఉండడమే మంచిదట. ఆయా పదార్థాలు నిజానికి మంచివే అయినా చిన్నారులకు మాత్రం అప్పుడే మంచివి కాదని... వీటిని కాస్త దూరంగా పెట్టాలని Pediatricians చెబుతున్నారు.
అలాంటి ఎనిమిది రకాల పదార్థాల గురించి చెబుతున్నారు కూడా. మరి అవేంటో.. ఎందుకు childrenకు పెట్టొద్దో.. ఇప్పుడు చూద్దాం. వీటిల్లో ముందు వరుసలో ఉంటుంది.
తేనె..ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. నిజానికి అప్పుడే పుట్టిన పిల్లలకు honey నాకించడం మనకు తెలుసు. కానీ పోషకాహార నిపుణులు మాత్రం సంవత్సరంలోపు పిల్లలకు తేనె పెట్టకూడదని అంటున్నారు. ఎందుకంటే దీంట్లో spores, bacteria ఉంటాయి. ఇవి చిన్నపిల్లల్లో botulism అంటే విషపూరితంగా మారుతాయి.
ఆవుపాలు : ఆవుపాలు పిల్లలకు త్వరగా అరగవు. వారికి అరిగించుకోవడం కష్టమవుతుంది. ఇవి కొంచెం మందంగా ఉంటాయి. అంతేకాదు cow milk లో ఐరన్, విటమిన్ ఈ లు ఉండవు. ఇవి తల్లిపాలు, ఫార్ములా మిల్క్ లోనే దొరుకుతాయి.
పండ్ల రసాలు : చిన్నారులకు కావాల్సిన పోషకాలు పండ్ల రసాల్లో ఉండవు. అంతేకాదు fruit juiceలో అధిక మోతాదులో ఉండే చక్కెరలు పిల్లల్లో డయేరియాకు దారి తీస్తాయి. దీంతోపాటు అనేక రకాల పొట్టసంబంధిత సమస్యలు వస్తాయి.
తీపి పదార్థాలు : chocolates, candies, కోలా లాంటి తీపి పదార్థాలు సంవత్సరం లోపు పిల్లలకు పెట్టకపోవడమే మంచిది. సహజసిద్ధమైన చక్కెరలు ఉండే పండ్లను తినిపించొచ్చు.
పాశ్చరైజ్ చేయని ఆహారాలను చిన్నారులకు ఇవ్వకూడదు. ఈ unpasteurised foodలో ఉండే బ్యాక్టీరియా అత్యంత ప్రమాదకరం. ఇది చిన్నారుల పొట్టకు హాని కలిగిస్తుంది. అది వారి ప్రాణాలకే ప్రమాదంగా పరిణమించవచ్చు.
బరువు తగ్గాలని అనుకునేవారు... ఈ 8సూత్రాలు తెలుసుకోవాలి..!
కాల్చిన ఆహారపదార్థాలను సంవత్సరం లోపు చిన్నపిల్లలకు ఇవ్వొద్దు. smoked meat లో ఉండే రసాయనాలు, అధిక మొత్తంలో ఉండే సోడియం లు చిన్నారులకు ప్రమాదకరంగా మారతాయి.
శుద్ధి చేయబడిన ధాన్యాలు : refind grains లో ఎక్కువ మొత్తంలో పోషకాలు ఉండవు. మామూలుగా ధాన్యాల్లో ఎన్నో పోషకాలున్నా.. రిఫైన్డ్ చేసిన వాటిల్లో అవి కొరవడతాయి. అందుకే వీటిని మీ చిన్నారులకు దూరంగా ఉంచాలి.