చాక్లెట్ తింటే బరువు తగ్గుతారా..?

 |  First Published Aug 9, 2018, 3:00 PM IST

వారంలో ఐదుసార్లు చాక్లెట్లు తినేవారు చాక్లెట్లు తిననివారి కంటే బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉన్నాయని వారు చెబుతున్నారు.


చాక్లెట్లు తింటే బరువు పెరగతారని అందరూ అంటూ ఉంటారు. అయితే.. చాకెట్లు తింటే సులభంగా బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. తాజా పరిశోధణలో ఈ విషయాలు వెలుగుచూశాయి.

నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. బరువు తగ్గాలనుకునేవారు కఠినమైన డైట్‌ ప్లాన్‌ ఫాలో అవుతుంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు అనుకున్న ఫలితాన్ని వారు పొందలేరు. అలాంటివారు తియ్యని చాక్లెట్లు తింటే బరువు తగ్గుతారు అంటున్నారు పరిశోధకులు. 

Latest Videos

చాక్లట్లకు, శరీర మాస్ ఇండెక్స్‌కు సంబంధం వుందని, వారంలో ఐదుసార్లు చాక్లెట్లు తినేవారు చాక్లెట్లు తిననివారి కంటే బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉన్నాయని వారు చెబుతున్నారు. కోకోలోని పాలిఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ మెటబాలిజం పనితీరును మెరుగుపరచడమే అందుకు కారణమంటున్నారు పరిశోధకులు. 

అయితే రోజుకు 30 గ్రాములకు మించి తింటే క్యాలరీల కౌంట్ పెరుగుతుంది కనుక మితంగా తినాలంటున్నారు. అలాగే మంచి నీరు కూడా ఎక్కువగా తాగితే క్యాలరీల ఖర్చు కూడా పెరుగుతుంది. వీలయినప్పుడల్లా ఓ గ్లాసుడు నీళ్ళు తాగితే చాలు... తెలీకుండా బరువు తగ్గిపోతారుట. 

click me!