తొలి కలయిక.. నొప్పి తప్పదా..?

By ramya neerukonda  |  First Published Aug 23, 2018, 3:20 PM IST

దాంతో భయం భయంగా శోభనం గదిలోకి వెళ్లి, కలయిక సమయానికి మరింత బిగుసుకుపోతారు. దాంతో అంగప్రవేశం క్లిష్టమై నిజంగానే నొప్పి మొదలవుతుంది. 
 


చాలా మంది అమ్మాయిలకు ఉండే భయాల్లో ఇది ప్రధానమైనది. పెళ్లి చేసుకుంటున్నామని బయటకు ఎంత ఆనందంగా ఉన్నా.. ఆ తర్వాత జరిగే తొలిరాత్రి గురించి అందరూ కంగారుపడుతూనే ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ కదా నొప్పి ఉంటుందని.

ఎవరో చెప్పడం ద్వారానో, ఎక్కడో వినడం ద్వారానో దీని గురించి తెలుసుకొని ఉంటారు. దానికి తోడు పెళ్లి  అయిపోయి.. తొలిరాత్రి మరికొద్ది గంటల్లో అనగానే..  ‘అబ్బాయి చెప్పినట్టు విను! నొప్పి అని దూరం నెట్టేయకు!’ అంటూ పెద్దలు చెప్పే మాటలతో ఉన్న భయం కాస్తా రెట్టింపవుతుంది. దాంతో భయం భయంగా శోభనం గదిలోకి వెళ్లి, కలయిక సమయానికి మరింత బిగుసుకుపోతారు. దాంతో అంగప్రవేశం క్లిష్టమై నిజంగానే నొప్పి మొదలవుతుంది. 

Latest Videos

అసలు ‘తొలి కలయిక నొప్పితో ముగుస్తుంది’ అనే నమ్మకం ఏర్పడడానికి కారణం... ‘కన్నెపొర’! కొందరిలో ఇది కాస్త మందంగా ఉండి అంగప్రవేశానికి ఆటంకం కలిగించవచ్చు. ఇది ఎంతో అరుదు. నిజానికి ఎక్కువశాతం మంది అమ్మాయిల్లో కన్నెపొర చిన్నప్పుడు ఆటలాడేటప్పుడే చిరిగిపోతుంది. కాబట్టి నొప్పికి ఆస్కారం ఉండదు. ఒకవేళ కలయిక ఎటువంటి ఇబ్బందీ లేకుండా తేలికగా జరిగిపోవాలనుకుంటే కె.వై జెల్లీ, లూబిక్‌ మొదలైన లూబ్రికెంట్లు వాడవచ్చు. అవసరమనుకుంటే బయటివాళ్లకు బదులు దగ్గరి బంధువుల్లో ఉండే పెద్దలతో చర్చించాలి.

click me!