పెళ్లికి ముందు ఇలాంటి ఆలోచనలా..? వాటిలో నిజమెంత?

By ramya neerukondaFirst Published Aug 21, 2018, 3:22 PM IST
Highlights

వాస్తవానికి లైంగిక తృప్తి కలిగించడానికి స్తంభించిన అంగ పరిమాణం మూడు నుంచి మూడున్నర అంగుళాలు ఉంటే సరిపోతుంది. తగుమాత్రం గట్టిపడి, చివరి వరకూ నిలిచి ఉండి, భాగస్వామిని తృప్తి పరచగలిగితే, అంగ పరిమాణం గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

పెళ్లి అనగానే.. చాలా మంది భయపడిపోతుంటారు. ఆడపిల్లలు మాత్రమే పెళ్లి అంటే భయపడతారనుకోవడం పొరపాటు. ఎందుకంటే.. వారికి ఎంత భయం ఉంటుందో.. పెళ్లి పీటలు ఎక్కబోయే వరుడికి కూడా అంతే భయం ఉంటుంది.  ముఖ్యంగా సెక్స్  విషయంలో తనను తాను నిరూపించుకోగలనా  అనే ప్రశ్న అబ్బాయిలను తొలచివేస్తుందట. సాధారణంగా వచ్చే అనుమానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

సెక్స్ విషయంలో అబ్బాయిలకు వచ్చే మొదటి సందేహం. నాలో సామర్థ్యం ఉందా లేదా..? అని ఈ భయం అర్థం లేనిది. తొలిసారి కలయిక జరపలేకపోతే నపుంసకుడు అనుకుంటారనీ, భార్య దృష్టిలో దిగజారిపోతాననీ అబ్బాయిలు అవసరానికి మించి ఆలోచించి ఆత్మన్యూనతకు లోనవుతూ ఉంటారు. కానీ ఇలా అర్థం లేని భయాలతో కలిసే ప్రయత్నం చేసినప్పుడే అంగం తగినంత స్తంభించకపోవడం, క్షణాల వ్యవధిలోనే స్ఖలనం అయిపోవడం లాంటివి జరుగుతాయి. 

దాంతో... ‘నాకు నపుంసకత్వం ఉందా?’ అనే అనుమానం మనసును తొలిచేయడం మొదలు పెడుతుంది. నిజానికి నపుంసకత్వం అనేది లేదు. ‘ప్రీమెచ్యూర్‌ ఎజాక్యులేషన్‌ (శీఘ్ర స్ఖలనం), ఎరెక్టయిల్‌ డిస్‌ఫంక్షన్‌ (అంగం తగినంత గట్టిపడకపోవడం) మాత్రమే ఉన్నాయి. ఈ రెండిటికీ చికిత్సలున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా సామర్థ్యం గురించిన అనుమానాలుంటే ‘ప్రీ మ్యారిటల్‌ కౌన్సెలింగ్‌’ తీసుకోవచ్చు. సామర్థ్య పరీక్షలు చేయించుకుని స్వీయ సామర్థ్యాన్ని నిర్ధరించుకోవచ్చు.

ఇంకొందరు.. పెళ్లికి ముందు సెక్స్ విషయంలో అనుభవం కచ్చితంగా ఉండాలని భావిస్తుంటారు. అది చాలా తప్పు అంటున్నారు నిపుణులు. అబ్బాయల్లాగే అమ్మాయిలు కూడా ఆలోచిస్తే దానిని అంగీకరించగలరా అనే ప్రశ్న మీకు మీరు వేసుకుంటే సమాధానం దొరకుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

చాలా మందికి ఉండే మరో అనుమానం..నా అంగం చిన్నదేమో? అని. వాస్తవానికి లైంగిక తృప్తి కలిగించడానికి స్తంభించిన అంగ పరిమాణం మూడు నుంచి మూడున్నర అంగుళాలు ఉంటే సరిపోతుంది. తగుమాత్రం గట్టిపడి, చివరి వరకూ నిలిచి ఉండి, భాగస్వామిని తృప్తి పరచగలిగితే, అంగ పరిమాణం గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

 

related news..

‘ డాగీ స్టైల్’ కే ఓటు అంటున్న మహిళలు

ఆ విషయంలో భార్యలపై భర్తల ఫిర్యాదులు ఇవే..

హస్త ప్రయోగానికి బానిసలయ్యారా..? ఇదిగో చిట్కాలు

click me!