రక్త ప్రసరణకు ‘అష్ట’ పదులు: పౌష్టికాహారంతోనే ఇన్‌ఫెక్షన్లపై పోరు

First Published 25, Jul 2018, 11:32 AM IST
Highlights

శరీరంలోని వివిధ భాగాలకు సరిగ్గా రక్త ప్రసరణ జరగకపోతే ఆకలి కోల్పోతారు. అనూహ్య జీర్ణ సమస్యలు తలెత్తడంతోపాటు కాలి, చేతి వేళ్లలో తిమ్మిరి, చర్మం వివర్ణమవుతుంది. తరుచుగా అలసటకు గురవుతారు. సిరలు ఉబ్బిపోతాయి. వెంట్రుకలు, చేతి గోళ్లు పెలుసుబారుతాయి.

ధమనులు, సిరల ద్వారా రక్త ప్రవహించడాన్నే రక్త ప్రసరణ అంటారు. రక్త ప్రసరణ సరిగ్గా సాగాలంటే కొన్నిజాగ్రత్తలు తీసుకోవాల్సిందే. రక్త ప్రసరణ మంచి జరుగాలంటే మంచి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. రక్త ప్రసరణ ద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు అపారంగా ఆక్సిజన్ అందుతుంది. ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులపై పోరాడటంతోపాటు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహకరిస్తుంది. శరీరంలోని వివిధ భాగాలకు సరిగ్గా రక్త ప్రసరణ జరగకపోతే ఆకలి కోల్పోతారు. అనూహ్య జీర్ణ సమస్యలు తలెత్తడంతోపాటు కాలి, చేతి వేళ్లలో తిమ్మిరి, చర్మం వివర్ణమవుతుంది. తరుచుగా అలసటకు గురవుతారు. సిరలు ఉబ్బిపోతాయి. వెంట్రుకలు, చేతి గోళ్లు పెలుసుబారుతాయి.

రక్త ప్రసరణ మందగించడానికి కారణాలు
రక్త ప్రసరణ మందగించడానికి కారణాలేమిటని ఒకసారి పరిశీలిద్దాం.. రక్త ప్రసరణ మందగించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి దుమపానం. దుమపానం వల్ల అందులో ఉండే కార్బన్‌మొనాక్సైడ్.. ధమనుల్లోని గోడలపై పలకలు ఏర్పడడానికి, కణజాలం దెబ్బ తినడానికి కారణమవుతుంది. నిశ్చలమైన జీవన విధానం, ఫాస్ట్ ఫుడ్స్ తినే అలవాటు, అధిక, తక్కువ రక్తపోటు, కొలెస్ట్రాల్ కూడా రక్త ప్రసరణ మందగించడానికి కారణాలని పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. రక్త ప్రసరణ మెరుగుదలకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు గురించి ఒకసారి పరిశీలిద్దాం.. చేపలు, కమలా ఫలాలు, గ్రీన్ టీ, నట్స్, బీట్‌రూట్, వెల్లుల్లి, డార్క్ చాకొలెట్, మూలికలు రోజువారీ భోజనంలో తప్పక తింటూ ఉంటే రక్త ప్రసరణ సజావుగా సాగుతూ ఉంటుంది.

చేపల్లో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం
సల్మాన్, సముద్ర చేపలు, ఇతర చేపల్లో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండటం గుండెకు, రక్త ప్రసరణ వ్యవస్థకు ఎంతో మంచిది. రక్తంలో ఫలకలు, మంట తగ్గించడానికి సహాయకారిగా ఉంటుంది. వారానికి రెండు, మూడుసార్లు చేపలు తినడం వల్ల ఈ ప్రయోజనాలు ఒనగూడుతాయి. 

విటమిన్ ‘సీ’కి నిలయం కమలాలు
సీ విటమిన్‌కు నిలయమైన కమలా ఫలాలు తినడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థపై అద్భుతమైన ప్రభావం చూపుతుంది. ధమనుల నుంచి కణాల్లోకి నేరుగా రక్త ప్రసారం జరుగుతుంది. చర్మం ఏర్పాటులో విటమిన్ ‘సీ’ తప్పనిసరి. స్ట్రాబెర్రీలు, నిమ్మకాయలు, పైనాఫిల్, గంట మిరియాలు, క్యాబేజీల్లో విటమిన్ ‘సీ’ అందుబాటులో ఉంది. 

నట్స్‌లో మెగ్నిషియం సుసంపన్నం 
జీడిపప్పు, బాదం పప్పుతోపాటు వివిధ గింజల్లో మెగ్నిషియం, ఎల్ - ఆర్జినైన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ధమనులు హాయిగా, రిలాక్స్‌డ్‌గా పని చేసుకోవడానికి మెగ్నిషియం ముఖ్యమైన ఖనిజం. కాంట్రాక్ట్ విస్తరిస్తుంది. మరోవైపు లా- ఆర్జినైన్ నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

గ్రీన్ టీతో శరీరంలో ఉద్దీపన 
మీరు పాలతో కలిపిన టీ తరుచుగా తాగుతున్నారా? దానికి బదులుగా గ్రీన్ టీ తాగుతూ ఉంటే అది మీ శరీరంలోని వివిధ అవయవాల్లో ఉద్దీపన తీసుకొస్తుంది. గ్రీన్ టీ మీ రక్త నాళాల విస్తరణ కోసం, రక్త ప్రవాహం పెరుగుదలకు దోహద పడుతుంది. యాంటీ యాక్సిడెంట్స్‌కు నిలయమైన గ్రీన్ టీ పూర్తిగా మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. 

రక్త ప్రవాహానికి వెల్లుల్లి ఉద్దీపన
రక్త ప్రవాహానికి ఉద్దీపనగా వెల్లుల్లి పని చేస్తుంది. జీర్ణ ప్రక్రియలో మంటను తగ్గించడంతోపాటు సూక్ష్మజీవులను అంతమొందించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. వెల్లుల్లిలో గల ఆర్గానో సల్ఫర్ ఉత్పత్తులు టాక్సిన్లను బయటకు నెట్టివేయడానికి, ఇన్ పెక్షన్లపై శరీరం పోరాడటంలో వెల్లుల్లి సహకరిస్తుంది. అల్లం, ఉల్లిపాయలు భోజనంలో తీసుకోవడంతో నిజంగానే రక్త ప్రసారం మెరుగు పడుతుంది. 

మూలికలతో అనారోగ్య సమస్య పరిష్కారం ఇలా
మూలికలు ఎటువంటి అనారోగ్య సమస్యనైనా పరిష్కరించడానికి తద్వారా రక్త ప్రసరణ మెరుగుదలకు దోహదపడతాయి. కోరింద పళ్లు, పార్స్లీ పండ్ల వంటివి తినడంతో రక్త ప్రసారం మెరుగు పడుతుంది. బీట్‌రూట్లలో నైట్రేట్ నిల్వలు పుష్కలం. వీటిని తినడంతో రక్తనాళాల్లో రక్తం సరఫరా మెరుగవుతుంది. నైట్రిక్ యాసిడ్ నైట్రేట్‌గా మారి ధమనులు విస్తరించడానికి సాయపడుతుంది. డార్క్ చాకొలెట్ యాంటీ యాక్సిడెంట్స్‌తో నిండి ఉంటుంది. తద్వారా రక్త ప్రవాహం, ప్రసరణ మెరుగుదలకు దారి తీస్తుంది. ఫ్రీ రేడియల్ యాక్టివిటీని నిలువరించడంతోపాటు మంటను నిరోధిస్తుంది. 

Last Updated 25, Jul 2018, 11:32 AM IST