తినగానే నిద్రపోతున్నారా..?

First Published 24, Jul 2018, 4:38 PM IST
Highlights

తిన్న వెంటనే నిద్రపోతే బ్రెస్ట్‌, ప్రొస్టేట్‌ కేన్సర్‌ వచ్చే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. పడుకోవడానికి 2 గంటల ముందు భోజనం చేయడం మంచిదని స్పెయిన్‌లోని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌కు చెందిన పరిశోధకులు సూచిస్తున్నారు.

ఒకప్పుడు అందరూ రాత్రి 8కాగానే భోజనాలు పూర్తిచేసి తొమ్మిదింటికల్లా.. నిద్రకు ఉపక్రమించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు.. లేట్ నైట్స్ పార్టీలనీ, ఆఫీసు వర్కులనీ ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు పడుకుంటున్నారో, ఎప్పుడు నిద్రలేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి.

అయితే.. చాలా వర్క్ టెన్షన్ లు ఎక్కువైపోయి.. చాలా ఆలస్యంగా భోజనం చేస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఇక అప్పటికే లేటు అయిపోతుంది కనుక.. తినగానే  నిద్రకు ఉపక్రమించేస్తున్నారు. ఇలా తినగానే నిద్రపోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.

తిన్న వెంటనే నిద్రపోతే బ్రెస్ట్‌, ప్రొస్టేట్‌ కేన్సర్‌ వచ్చే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. పడుకోవడానికి 2 గంటల ముందు భోజనం చేయడం మంచిదని స్పెయిన్‌లోని బార్సిలోనా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌కు చెందిన పరిశోధకులు సూచిస్తున్నారు.

872మంది పురుషులు, 1321 మంది స్త్రీలపై  సర్వే నిర్వహించగా ఈ విషయాలు తెలిసాయని వారు చెబుతున్నారు. వారి పరిశోధనలో రాత్రి తినగానే వెంటనే నిద్రించడం కారణంగా 621మందికి ప్రోస్టేట్ క్యాన్సర్, 1205మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్లు గుర్తించారు. వీటితోపాటు వారి శరీరంలో కొవ్వు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

రాత్రి 9లోపు భోజనం చేసేవారు, భోజనం చేశాక రెండు గంటల తర్వాత నిద్రించే వారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని వారు చెబుతున్నారు. పురుషుల్లో అయితే 26శాతం తక్కువ అవకాశం, స్త్రీలలో అయితే 16శాతం తక్కువగా వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు.. ఆలస్యంగా భోజనం చేసి.. తినగానే నిద్రపోవడం వల్ల ఇమ్యునిటీ సిస్టమ్ కూడా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Last Updated 24, Jul 2018, 4:38 PM IST