వర్షాకాలంలో స్వీట్‌గా.. స్పైసీగా ఇలా..

 |  First Published Jul 25, 2018, 1:06 PM IST

వర్షాకాలంలో టేస్ట్ చేయాల్సిన అద్భుతమైన టేస్టీ ఫుడ్..


వర్షాకాల సమయంలో ఇళ్లకు పరిమితమయ్యే వారి కాలక్షేపానికి  ఈ పానీయాలు హాయినిస్తాయి. బయట వర్షం కురుస్తున్నప్పుడు వెచ్చగా రగ్గు కప్పుకుని టీవీ చూస్తూ కాలక్షేపం చేయడానికి మించిన మంచి పని మరొకటి ఉండదు. గోరు వెచ్చని టీ తాగుతూ టీవీ చూస్తుంటే లభించే మజాయే వేరు.

గోల్డెన్ మిల్క్ 
పసుపు పొడి కలిపిన పాలు తాగుతున్నప్పుడు వచ్చే టేస్టే వేరు. ఇది స్పైసీగా ఉండటంతోపాటు రుచికరంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిదే.

Latest Videos

కావాల్సిన పదార్థాలు:

ఒక కప్ పాలు,
చిటికెడు నల్లని మిరియాల పొడి,
చిటికెడు దాల్చిన చెక్క పొడి,
రెండు టీ స్పూన్ల పసుపు, 
చిటికెడు అల్లం ముద్ద
రుచి కోసం తేనె లేదా షుగర్ 

గోల్డెన్ మిల్క్ తయారుచేసే పద్ధతి:

ఒక కప్పు పాలను వేడి చేయాలి. నల్లని మిరియాలు, దాల్చిన చెక్క పొడి చిటికెడు చొప్పున కలుపాలి. చిటికెడు అల్లంతోపాటు రెండు టేబుల్ స్పూన్ల పసుపు పొడి కూడా కలుపాలి. రుచికోసం తేనె గానీ, పాక్షికంగా రిఫైండ్ చేసిన షుగర్ కలిపి వేడితోనే తాగితే మజాగా ఉంటుంది. 

యాపిల్ ప్లస్ దాల్చిన చెక్క టీ

యాపిల్ ప్లస్ దాల్చిన చెక్క పొడితో కలిపి తయారు చేసిన టీ ఒక సిప్ తాగితే అది నేరుగా మిమ్మల్ని శరదృతువు కాలానికి తీసుకెళుతుంది. 

అవసరమైన పదార్థాలు:
రెండు కప్‌ల నీరు
ఒక టీ స్పూన్ అల్లం పొడి
ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి
ఒక యాపిల్ ముక్కలు
ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం
రుచి కోసం తేనె

తయారుచేసే పద్దతి:

స్టవ్‌పై రెండు కప్‌ల నీటిని మరిగించాలి. బుడగలు వచ్చిన తర్వాత సిద్దంగా తయారు చేసిన పదార్థాలను కలిపేసి గ్యాస్ ఆర్పేయాలి. పది నిమిషాల వేచి చూసిన తర్వాత వేడి చేసి సిద్ధం చేసిన యాపిల్ ద్రవాన్ని అదే వేడితో తాగాలి. 

ఘాటైన హాట్ చాకొలేట్:

ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో రెగ్యులర్‌గా చాకొలెట్ తినడం కంటే హాట్ చాకొలెట్ కోసం ప్రయత్నిద్దాం. స్వీట్‌గానూ, మిర్చి పొడి కలుపడంతో స్పైసీగా ఉంటుంది. 

అవసరమైన పదార్థాలు:

ఒక కప్ పాలు
చిటికెడ్ వెనీలా పొడి
రెండు టేబుల్ స్పూన్ల కోకా పొడి
చిటికెడు దాల్చిన చెక్క పౌడర్
చిటికెడు మిర్చి పొడి
రుచి కోసం చక్కెర

తయారు చేసే పద్దతి:

పాలను స్టవ్ మీద వేడి చేయాలి. బుడగలు రాగానే చిటికెడు వెనీలా పొడిని, కోకాపోడితోపాటు దాల్చిన చెక్క, మిర్చి పౌడర్ కలిపి గ్యాస్ ఆర్పేయాలి. తరువాత రుచికి సరిపడా చ్కెర కలిపి వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేయాల్సి ఉంటుంది. 
 

click me!