రాత్రి వేళ్లలో అరటి పండు తినొచ్చా? లేదా?

 |  First Published Jul 23, 2018, 10:48 AM IST

పోషకాలతో కూడిన ఖనిజాలు గల అత్యంత పోషక విలువ గల పండు అరటి పండు. ఆయుర్వేదం ప్రకారం రాత్రి వేళ్లలో అరటి పండ్లు తినడం ఎంతమాత్రం సురక్షితం కాదు


రాత్రి వేళ్లలో ఫలాలు తినడానికి దూరంగా ఉండటమే శ్రేయస్కరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకించి రాత్రి వేళ అరటి పండు తినకుండా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎలాగైనా అరటి పండుకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. పోషకాలతో కూడిన ఖనిజాలు గల అత్యంత పోషక విలువ గల పండు అరటి పండు. ఆయుర్వేదం ప్రకారం రాత్రి వేళ్లలో అరటి పండ్లు తినడం ఎంతమాత్రం సురక్షితం కాదు. జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే రాత్రి అరటి పండు తినకుండా దూరంగా ఉండాలని ఆయుర్వేద వైద్య నిపుణులు తెలిపారు. అరటి పండు జీర్ణం కావడానికి చాలా టైం పడుతుంది. సోమరిగా ఉన్నామన్న భావన కలుగుతుంది.

పోషక పదార్థాల విలువ ఆధారంగా అరటి పండు ఎంతో ఆరోగ్యకరమైందైనా, శక్తిమంతమైందైనా రాత్రివేళ మాత్రం దాన్ని భుజించకూడదనే పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకించి దగ్గు, జలుబు, ఆస్తమా, సైనస్ సమస్యలతో బాధపడే వారు రాత్రి తినకుండా ఉంటే బాగుంటుందని చెబుతున్నారు. సాయంత్రం వేళ గానీ, ఉదయంగానీ జిమ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత అరటి పండు భుజించడం మంచి పద్దతి అని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు.

Latest Videos

హోటళ్లు, రెస్టారెంట్లలో తిన్న భోజనం స్పైసీగా ఉంటే దాన్ని తగ్గించేందుకు అరటి పండు తినడమే సేఫ్ ఆప్షన్ అని అంటున్నారు. అయితే రాత్రి వేళ ఒక అరటి పండు తినడం వల్ల రాత్రివేళ కడుపులో మంట, స్టమక్ అల్సర్ తగ్గిస్తుందని సూచిస్తున్నారు. పోటాషియం నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల రోజంతా అలసిపోయిన తర్వాత అరటి పండు తినడం వల్ల కండరాలు విశ్రాంతి పొందుతాయి. సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఒకటి గానీ, రెండు అరటి పండ్లు తినడం వల్ల తేలిగ్గా నిద్ర పోవచ్చు.

ఒక పెద్ద అరటి పండులో 487 మిల్లిగ్రాముల పొటాషియం ఉంటుందని పరిశోదకుల అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్క అరటి పండులో 105 కేలరీలు ఉంటాయి. 500 కేలరీల్లోపు ఆహారం మాత్రమే డిన్నర్‌లో తీసుకోవాలంటే రెండు అరటి పండ్లు గానీ, కప్పు చిలికిన పాలు తాగితే చాలు. రాత్రి వేళ పొద్దుపోయిన తర్వాత మిఠాయిలు, అరటి పండ్లు తినకుండా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. 

అదే సమయంలో అరటి పండులో పీచు, విటమిన్లు అత్యధికంగా ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. అరటి పండు పూర్తిగా పోషక పదార్థాలు కలిగి ఉంటుంది. కానీ రాత్రి వేళ్లలో అరటి పండు తినడం మంచి ఐడియా కాదని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు. ఆస్తమా, సైనస్ సమస్య ఉన్న వారు సాయంత్రం, రాత్రి పొద్దుపోయిన తర్వాత అరటి పండు తినకుండా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

click me!