ఈ ఉల్లి కోస్తే కన్నీళ్లు రావు

First Published Jul 3, 2018, 12:04 PM IST
Highlights


కన్నీరు తెప్పించని ఉల్లి ఇది

ఉల్లిపాయతో కూరకి వచ్చే రుచే వేరు. దాదాపు ఏ కూర చేయాలన్నా ఉల్లిపాయ వాడాల్సిందే. ఏవో కొన్ని కూరలు మినహాయించి అన్నింటిలోనూ ఉల్లిపాయని వాడుతుంటారు. వండిన తర్వాత కూరకి ఉల్లిపాయ అద్భుతమైన రుచిని అందిస్తుంది. కానీ.. కూర వండటానికి ఉల్లిపాయను కోసేటప్పుడు అసలు సమస్యంతా.

కళ్లు మంటలు పుట్టి.. కంటి వెంట నీరు కారుతూ ఉంటుంది. అందుకే అందరూ ఉల్లి కోయడానికి అష్టకష్టాలు పడతారు. కంటివెంట నీరు రాకుండా ఉండేందుకు చిత్ర విచిత్ర చిట్కాలు కూడా ఉపయోగిస్తుంటారు. అయితే ఇక నుంచి ఈ సమస్య లేదు.

కన్నీరు పెట్టించని ఉల్లిపాయను కనుగొన్నారు.  సాధారణంగా మనం ఉల్లిపాయ కోయగానే దానిలోని లాక్రిమేటరీ ఫ్యాక్టర్‌ సింతేజ్‌ (ఎల్‌ఎఫ్ఎస్‌) అనే ఎంజైమ్‌ స్పందించి, లాక్రిమేటరీ ఫ్యాక్టర్‌ (ఎల్‌ఎఫ్‌) అనే దానిని విడుదల చేస్తుంది. వేగంగా గాలిలో కలిసిపోయే లక్షణమున్న ఈ ఎల్‌ఎఫ్‌ మూలంగానే మనకు కన్నీరు వస్తుంది. 

కాగా.. తాజాగా ఎల్ ఎఫ్ ఎస్ లేని ఉల్లిని కనుగొన్నారు. 30 సంవత్సరాల పాటు దీనిపై పరిశోధనలు జరిపి మరీ ఈ ఉల్లిని కనుగొన్నారు. ఈ ఉల్లిపాయకు ‘సనాయిన్స్’ అనే నామకరణం కూడా చేశారు.  ప్రస్తుతం ఈ రకం ఉల్లిపాయలు యూఎస్ లోని వాషింగ్టన్, నివిడాలలో లభిస్తున్నాయి. త్వరలోనే ఈ ఉల్లి భారత్ లోకి కూడా అడుగుపెట్టనుంది. 

click me!