
దశాబ్దాలుగా స్నానం చేయని కారణంగా ‘‘ప్రపంచంలోని అత్యంత మురికి మనిషిగా (వరల్డ్ మోస్ట్ డర్టీ మ్యాన్) పేరు గాంచిన అమో హాజీ చనిపోయారు. ఆయన ఇరాన్ దేశానికి చెందని వ్యక్తి. అమో హాజీ తన 94 ఏళ్ల వయస్సులో చనిపోయారని ఆ దేశ ప్రభుత్వ మీడియా మంగళవారం నివేదించింది.
దీపావళి వేడుకలు: డజన్ల కొద్ది అగ్నిప్రమాదాలు.. వివరాలు ఇవిగో
ఆయన దాదాపు అర్ధ శతాబ్దానికి పైగా స్నానం చేయలేదు. ఒంటరిగానే జీవితం గడుతున్నాడు. అతడికి నీళ్లు అంటే భయం. అందుకే తాను స్నానం చేయబోనని పలు మార్లు మీడియాకు తెలిపారు. అలాగే స్నానం చేస్తే అనారోగ్యానికి గురవుతారనే భావన కూడా ఆయన అలాగే ఉండటానికి ఒక కారణం.
ఆయనపై మీడియాలో పలు మార్లు కథనాలు కూడా వచ్చాయి. ఏళ్ల తరబడి స్నానం చేయకపోవడం వల్ల ఆయన ముఖం నల్లగా మారింది. శరీరం మొత్తం దుర్వాసన వచ్చేది. బట్టలు కూడా మురికిగా మారాయి. ఆయన ఎక్కువగా ఇరాన్ ఎడారిలో ఒంటరిగా నివసించారు. స్థానిక ప్రజలు అమో హాజీ కోసం ఒక గుడిసెను నిర్మించి ఇచ్చారు.
2024 జనవరిలో అయోధ్య రామ మందిరం తెరుస్తాం - ట్రస్ట్ సభ్యుడు చంపత్ రాయ్
ఆయన రోజుకు ఐదు లీటర్ల నీరు తాగుతుండేవారు. శుభ్రంగా ఉండటం ఆయనకు ఇష్టం ఉండదు. అలాగే కుళ్లిన ఆహారాన్ని, మాంసాన్ని ఇష్టపడి తినేవారు. చెరువుల్లోని నీళ్లు తాగేవారు. కొత్తగా ఎక్కడైన బట్టలు దొరికితే వేసుకునేవారు. ఆయనకు పొగ తాగే అలవాటు ఉండేది. అమో హాజీపై మీడియాలో కథనాలు రావడంతో ఆయన ఆరోగ్యం పరీక్షించేందుకు వైద్యులు గుడిసెకు వెళ్లారు. ఈ పరీక్షల్లో అతడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని తేలడంతో డాక్టర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. అన్ని సౌకర్యాలతో, శుభ్రమైన ఇంట్లో ఉండే సాధారణ వ్యక్తిలా ఆరోగ్యంగా ఉన్నాడు. టెహ్రాన్‌లోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కోసం పారాసిటాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ అమో హాజీని పరీక్షించారు.
బంగ్లాదేశ్ లో ‘సిత్రాంగ్’ విలయతాండవం.. 16కు చేరిన మృతుల సంఖ్య.. కరెంటు లేక 10 మిలియన్ల మంది అవస్థలు
అమో హాజీ చుట్టూ నివసించే ప్రజలను ఆయన గౌరవించేవారు. అయితే కొందరు అతడిని ఎగతాళి చేసేవారు. కానీ స్థానిక యంత్రాంగం ఆయనకు సాయం చేసింది. స్థానిక గవర్నర్ అమో హాజీని ఒంటరిగా వదిలేయాలని ప్రజలను కోరారు. ఆయన సున్నిత మనస్కుడని గవర్నర్ పేర్కొన్నారు. ఇరాన్ మీడియా సంస్థల ప్రకారం 2013లో ఆయన జీవితంపై ‘‘ది స్ట్రేంజ్ లైఫ్ ఆఫ్ అమౌ హాజీ’’ అనే చిన్న డాక్యుమెంటరీ సినిమా కూడా రూపొందించారు. అయితే కొన్ని నెలల కిందట పలువురు గ్రామస్తులు ఆయనకు స్నానం చేయించడానికి ప్రయత్నించారు. చాలా రోజుల నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న అమో హాజీ.. దక్షిణ ప్రావిన్స్ ఫార్స్‌లోని డెజ్‌గా గ్రామంలో ఆదివారం మరణించారని వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ నివేదించింది.