coronavirus: అమెరికాలో క‌రోనా విల‌య‌తాండ‌వం.. ఒక్క‌రోజే 10 ల‌క్ష‌ల కేసులు !

By Mahesh Rajamoni  |  First Published Jan 4, 2022, 2:13 PM IST

coronavirus: క‌రోనా దెబ్బ‌కు అగ్ర‌రాజ్యం అమెరికా గ‌జ‌గ‌జ వ‌ణికిపోతుంది. క‌రోనా పంజాతో అక్క‌డి ఆస్ప‌త్రుల‌న్ని రోగుల‌తో నిండిపోతున్నాయి. ఇదివ‌ర‌కు ఏ దేశంలోనూ న‌మోదుకాని విధంగా ఒక్క‌రోజే 10 ల‌క్ష‌ల కోవిడ్-19 కేసులు అమెరికాలో వెలుగుచూశాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన బైడెన్ స‌ర్కారు అంక్ష‌లు విధించింది. 
 


coronavirus: క‌రోనా వైర‌స్ సునామీ విరుచుకుప‌డుతోంది. దీంతో క‌రోనా కొత్త కేసులు రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. గ‌తేడాది న‌వంబ‌ర్‌లో ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి పెర‌గ‌డంతో కొత్త కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా అగ్ర‌రాజ్యం అమెరికాలో క‌రోనా మహ‌మ్మారి క‌ల్లోలం సృష్టిస్తోంది. ఇదివ‌ర‌కు వ‌చ్చిన క‌రోనా వేవ్ ల కంటే అనేక  రెట్లు అధికంగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. రోజువారీ క‌రోనా కేసులు రికార్డు స్థాయిలో న‌మోదు అవుతున్నాయి. ఒక్క‌రోజే 10 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. క‌రోనా వెలుగుచూసిన‌ప్ప‌టి నుంచి రెండేండ్ల కాలంలో ఒకే రోజు ఇన్ని కేసులు ఏ దేశంలో కూడా న‌మోదు కాలేదు. అమెరికాలో ప్ర‌స్తుతం క‌రోనా కొత్త కేసుల పెరుగుద‌ల‌పై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. క‌రోనా క‌ట్ట‌డి కోసం ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటోంది. 

Also Read: Bulli Bai: బుల్లిబాయ్ యాప్ కేసు.. ఒక‌రి అరెస్టు.. స‌మాచారం లేద‌న్న బెంగ‌ళూరు పోలీసులు !

Latest Videos

undefined

అమెరికాలో గ‌త నాలుగు రోజుల క్రితం 5,90,000 కేసులు న‌మోదున అయ్యాయి. అయితే, సోమ‌వారం నాటికి ఆ సంఖ్య రెట్టింపు అయింది. క‌ర‌నా క‌ట్ట‌డి కోసం బైడెన్ స‌ర్కారు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. కోవిడ్‌-19 ఉధృతి నేప‌థ్యంలో అమెరికాలో స్కూళ్లు, కార్యాల‌యాల‌ను మూసివేశారు. విమానాల‌ను ర‌ద్దు చేశారు. ఇదిలావుండ‌గా, కేసుల తీవ్ర‌త‌తో ఆస్ప‌త్రులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. దాదాపు అక్క‌డి ఆస్ప‌త్రుల్లో 70 శాతం వ‌ర‌కు నిండిపోతున్నాయ‌ని స‌మాచారం. క‌రోనా బారిన‌ప‌డుతున్న వారిలో ఆరోగ్య సిబ్బంది సైతం అధికంగా ఉండ‌టంపై ఆ దేశ ఆరోగ్య వ్య‌వ‌స్థ తీవ్ర ఒత్తిడికి గుర‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనావైరస్ వ్యాధి (కోవిడ్-19) కారణంగా ఆస్ప‌త్రిలో చేరిన వారి సంఖ్య యునైటెడ్ స్టేట్స్‌లో దాదాపు నాలుగు నెలల్లో రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం 100,000 మందికి పైగా చేరారు. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (HHS) నుండి వచ్చిన తాజా డేటా ప్ర‌కారం..  కోవిడ్-19 కార‌ణంగా ఆస్ప‌త్రిలో చేరిన వారి సంఖ్య చివరిగా 2021 సెప్టెంబర్ 11న 100,000ను దాటింది.

Also Read: COVID-19: కేంద్ర మంత్రి మ‌హేంద్ర నాథ్ పాండేకు క‌రోనా.. మ‌రో బీజేపీ నేత‌కు సైతం..

ప్రస్తుతం, అమెరికా వ్యాప్తంగా దాదాపు మూడొంతుల మంది హాస్పిటల్ బెడ్‌లు నిండిపోయాయనీ, ప్రతి ఏడుగురిలో ఒకరు కోవిడ్-19తో బాధపడుతున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అమెరికాలోని ఒహియో, డెలావేర్, న్యూజెర్సీ, వ్యోమింగ్, అలాస్కా వంటి ప్రాంతాల్లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. క‌రోనా బారిన‌ప‌డి ఆస్ప‌త్రుల్లో చేరుతున్న పిల్ల‌ల సంఖ్య సైతం అమెరికాలో గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. డిసెంబర్ 31తో ముగిసిన వారంలో ప్రతిరోజూ 500 మందికి పైగా పిల్లలు క‌రోనాతో ఆస్ప‌త్రుల్లో చేరుతున్నార‌ని US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) డేటా పేర్కొంది.  ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న క్ర‌మంలో అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ క‌మ‌లా హ్యారిస్ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ వేరియంట్‌ను అడ్డుకోగ‌లిగే చ‌ర్య‌ల‌పై క‌రోనా వైర‌స్ రెస్పాన్స్ బృందాల‌తో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇవాళ స‌మీక్ష చేయ‌నున్న‌ట్లు స్థానిక మీడియా పేర్కొంది. కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 293,021,949 క‌రోనా కేసులు, 5,466,375 కోవిడ్ మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. అయితే, ఒక్క అమెరికాలోనే 57,131,187 క‌రోనా కేసులు, 848,885 మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన జాబితాలో అమెరికా త‌ర్వాతి స్థానంలో భార‌త్‌, బ్రెజిల్, యూకే, ర‌ష్యాలు ఉన్నాయి. 

Also Read: Modi: పంజాబ్ ప‌ర్య‌ట‌న‌కు ప్ర‌ధాని మోడీ.. ఎన్నిక‌ల ల‌క్ష్యంగా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం !

click me!