ఉక్రెయిన్ లో యుద్ధం ఇక ముగించాలి - యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో భార‌త్ వాద‌న‌

By team teluguFirst Published Sep 23, 2022, 2:12 PM IST
Highlights

ఉక్రెయిన్ లో రష్యా ఇక యుద్ధం ముగించాలని ఐక్య రాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ డిమాండ్ చేసింది. ఈ యుద్ధ ప్రభావం మొత్తం అంతర్జాతీయ సమాజంపై పడుతోందని చెప్పింది. 

ఉక్రెయిన్‌లో వివాదానికి స్వస్తి పలికి, చర్చలకు తిరిగి రావాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ గురువారం తెలిపింది. ఇది యుద్ద యుగం కాకూడ‌ద‌ని చెప్పింది. ఈ మేర‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ వివాదం కొనసాగుతున్న తీరు మొత్తం అంతర్జాతీయ సమాజానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. యుద్ధాన్ని తక్షణమే ముగించాలని, చర్చలు  దౌత్యానికి తిరిగి రావాలని భారతదేశం అన్ని పక్షాలకు తన అభ్యర్థనను పునరుద్ఘాటిస్తున్నట్లు ఆయన చెప్పారు. 

కాలానికి అనుగుణంగా రెడ్ క్రాస్ సొసైటీ మారాలి - కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వీయ‌

వివాదాస్పద పరిస్థితుల్లో కూడా మానవ హక్కులు లేదా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడాన్ని సమర్థించలేమని ఈ రోజు భద్రతా మండలికి నొక్కి చెప్పాలనుకుంటున్నట్లు విదేశాంగ మంత్రి చెప్పారు. ఇలాంటి చర్య ఎక్కడ జరిగినా నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. బుచాలో జరిగిన హత్యలకు సంబంధించి భారతదేశం ఇదే అభిప్రాయాన్ని కొనసాగించింద‌ని అన్నారు. బుచా ఘటనపై స్వతంత్ర విచారణకు ఆ సమయంలో భారతదేశం మద్దతు ఇచ్చిన విషయాన్ని కూడా ఆయ‌న గుర్తు చేశారు. 

గాంధీ కుటుంబ స‌భ్యులెవ‌రూ కాంగ్రెస్ చీఫ్ కాకూడ‌ద‌ని రాహుల్ గాంధీ నాతో అన్నారు - అశోక్ గెహ్లాట్

గ్లోబలైజ్డ్ ప్రపంచంలో సుదూర ప్రాంతాలలో కూడా యుద్ధ సంఘర్షణ ప్రభావాలు క‌నిపిస్తున్నాయ‌ని జైశంకర్ కౌన్సిల్‌కు తెలిపారు. పెరుగుతున్న ఖర్చులు, ఆహార ధాన్యాలు, ఎరువులు, ఇంధనాల నిజమైన కొరత రూపంలో యుద్ధ ప‌రిణామాల‌ను అంద‌రూ అనుభ‌వించార‌ని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాల్సిన ఆవశ్యకత ఉంద‌ని నొక్కిచెప్పారు. ఉక్రెయిన్ వివాదాన్ని ముగించి చర్చలకు తిరిగి రావాల‌ని ఆకాంక్షించారు. ‘‘ ఈ కౌన్సిల్ దౌత్యానికి అత్యంత శక్తివంతమైన సమకాలీన చిహ్నం. అది తన ప్రయోజనానికి అనుగుణంగా జీవించడం కొనసాగించాలి. మనమందరం సబ్ స్క్రైబ్ చేసే గ్లోబల్ ఆర్డర్, అంతర్జాతీయ చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్, అన్ని రాష్ట్రాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని గౌరవించడంపై ఆధారపడి ఉంటుంది. ఈ సూత్రాలను కూడా మినహాయింపు లేకుండా సమర్థించాలి ’’ అని ఆయన అన్నారు.

Spoke at the UNSC briefing on Ukraine. pic.twitter.com/LZ7m8ERPmM

— Dr. S. Jaishankar (@DrSJaishankar)

ఈ యూఎన్ కౌన్సిల్ స‌మావేశంలో జై శంకర్‌తో పాటు, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, UK విదేశాంగ, కామన్వెల్త్, అభివృద్ధి వ్యవహారాల కార్యదర్శి జేమ్స్ ఈ అంశంపై ప్ర‌సంగించారు.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో భారీ వ‌ర్షం.. గురుగ్రామ్, నోయిడాలో పాఠ‌శాల‌ల మూసివేత‌..

కాగా.. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు కొనసాగుతోంది. యుద్ధం జరిగి ఇన్ని రోజులు గడిచినా రష్యా వైఖరి మాత్రం దూకుడుగానే ఉంది. అయితే రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధంపై ప్రపంచం పాటు భారత్ కూడా గ‌తంలో కూడా ఆందోళన వ్య‌క్తం చేశారు. ఇది యుద్ధ యుగం కాదని భారత ప్రధాని నరేంద్ర మోదీ చాలాసార్లు నొక్కి చెప్పారు. భారత్ తన వైపు నుంచి ఉక్రెయిన్‌కు మానవతా సాయం అందిస్తోంది.

click me!