ప్రధాని మోడీ పై పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ప్ర‌శంస‌లు.. ఏమ‌న్నారంటే ?

By team teluguFirst Published Sep 23, 2022, 10:32 AM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలతో ముంచెత్తారు. ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆస్తులను ప్రధాని మోడీ ఆస్తులను పోల్చారు. 

ప్రధాని నరేంద్ర మోడీపై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి ప్రశంసలు కురిపించారు. ఈసారి అవినీతికి సంబంధించి పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, అతడి కుటుంబాన్ని చుట్టుముట్టారు. విదేశాలలో వేల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపించారు. పొరుగు దేశ ప్రధాని మోడీకి విదేశాల్లో ఇంత సంపద ఉందా అని ర్యాలీలో ప్రజలను ప్రశ్నించారు.

Rainfall: దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ వీకెండ్ వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు

ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రసంగానికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఇందులో విదేశాల్లో ఉంటున్న నవాజ్ షరీఫ్‌పై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఉన్న సంపద ప్రపంచంలోని మరే ఇతర నాయకుడికి ఉండదని ఆయ‌న అన్నారు.‘‘  విదేశాల్లో షరీఫ్‌కు ఎంత సంపద ఉందో ఎవరూ ఊహించలేరు. ఏ దేశానికి చెందిన నాయకుడికి తన దేశం బయట కోట్లాది సంపద ఉండ‌దు. మ‌న పొరుగు దేశ ప్ర‌ధానికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ? ’’ అని ఇమ్రాన్ ఖాన్ ప్ర‌శ్నించారు.

భారత్ జోడో యాత్ర ప్ర‌భావంతోనే ముస్లిం మత గురువులతో మోహన్ భగవత్ సమావేశం - కాంగ్రెస్

పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ భారతదేశాన్ని, ప్రధాని మోడీని ప్రశంసించడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు కూడా ఆయ‌న భారతదేశ విదేశాంగ విధానం, అమెరికా, రష్యా భార‌త ప్ర‌ధానికి ఉన్న సంబంధాల విష‌యంలో మోడీని ప్ర‌శంసించారు. 

క్వాడ్‌లో భాగమైనప్పటికీ భారతదేశం అమెరికాపై ఒత్తిడి తెచ్చిందని, ప్రజలకు ఉపశమనం కలిగించడానికి రష్యా నుండి తక్కువ ధరకు చమురును కొనుగోలు చేసిందని ఆయన అన్నారు. దేశం స్వతంత్ర విదేశాంగ విధానం సహాయంతో తమ ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఇమ్రాన్ అన్నారు. భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తక్కువ ధరల నివేదికను రీట్వీట్ చేస్తూ పీటీఐ చీఫ్ ఈ విషయాన్ని తెలిపారు.

మధ్యప్రదేశ్ లో దారుణం.. చిన్నారులతో టాయిలెట్లు శుభ్రం చేయించిన టీచర్..

కాగా.. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై దాఖలైన ధిక్కార విచారణను పాకిస్థాన్‌లోని అత్యున్నత న్యాయస్థానం గురువారం వాయిదా వేసింది. మహిళా న్యాయమూర్తిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పేందుకు ఇమ్రాన్‌ కోర్టుకు హాజరయ్యాడు. ఆ తర్వాత ఇస్లామాబాద్ హైకోర్టు అతడిపై ధిక్కార విచారణను వాయిదా వేసింది. వాస్తవానికి ఆగస్టు 20న ఇక్కడ జరిగిన ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ తన స‌హ‌చ‌రుడు షాబాజ్ గిల్‌తో ప్ర‌వ‌ర్త‌న తీరుపై పోలీసు ఉన్నతాధికారులు, ఎన్నికల సంఘం రాజకీయ ప్రత్యర్థులపై కేసు నమోదు చేస్తానని బెదిరించాడు.

click me!