హింసాత్మకంగా మారిన ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసనలు.. అనేక మందికి గాయాలు, పలువురి అరెస్టు..

Published : Nov 05, 2022, 04:49 AM IST
హింసాత్మకంగా మారిన ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసనలు..  అనేక మందికి గాయాలు, పలువురి అరెస్టు..

సారాంశం

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై గురువారం దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కాలికి బుల్లెట్ గాయం అయ్యింది. దీంతో ఆయన మద్దతు దారులు, పీటీఐ కార్యకర్తలు నిరసనలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసనలు శుక్రవారం హింసకు దారి తీశాయి. 

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై దాడి జరిగిన తరువాత ఆయన మద్దతు దారులు దేశ వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. అయితే ఈ నిరసనలు పలు ప్రాంతాల్లో హింసాత్మకంగా మారాయి. దీంతో గుంపులుగా ఉన్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. అనేక మందిని అరెస్టు చేశారు. 

మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ కుమారుడు ఎమ్మెల్యే అబ్బాస్‌ను అరెస్టు చేసిన ఈడీ.. ఎందుకంటే ?

ఈ నిరసన సందర్భంగా లాహోర్‌లోని గవర్నర్ హౌస్ వెలుపల పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) మద్దతుదారులు టైర్లు తగులబెట్టారు. ఇస్లామాబాద్‌లో తుపాకీ కాల్పులు కూడా జరిగాయని సంబంధిత వర్గాలు వెల్లడించినట్టు ‘న్యూస్ 18’ నివేదించింది. ఇమ్రాన్ ఖాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. అలాగే ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. 43 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్..

కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్, ముల్తాన్, క్వెట్టా, పెషావర్‌తో పాటు పాకిస్థాన్‌లోని అన్ని ప్రధాన నగరాల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ అయిన పీటీఐ ఆందోళనలు చేపడుతోంది. అందులో భాగంగానే ఆ పార్టీ మద్దతుదారులు రావల్పిండి, పెషావర్, లాహోర్, ముల్తాన్, కరాచీ, ఇతర నగరాల్లో ప్రధాన రహదారులను దిగ్బంధించారు. రావల్పిండిలోని ఫైజాబాద్ ఇంటర్‌ఛేంజ్‌లో, అల్లామా ఇక్బాల్ పార్క్ వెలుపల కూడా పీటీఐ కార్యకర్తలు గుంపులు గుంపులుగా చేరి నిరసనలు ప్రారంభించారు.

కొడుకుతో కలిసి సచిన్ టెండూల్కర్ జాలీ ట్రిప్.. ఖరీదైన కార్లను వదిలి కియా కేరెన్స్ లో ప్రయాణం.. వీడియో వైరల్

కాగా నిరసనల సందర్భంగా పోలీసులు, ఫ్రాంటియర్ కార్ప్స్ (ఎఫ్‌సీ) సిబ్బందిపై రాళ్ల దాడికి పాల్పడిన ప్రాంతంలో నిరసనకారులను చెదరగొట్టడానికి ఇస్లామాబాద్ పోలీసులు అడపాదడపా టియర్‌గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించారు. ఇస్లామాబాద్‌లో పలువురు పీటీఐ కార్యకర్తలను బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

లాహోర్‌లోని థోకర్ నియాజ్ బేగ్, బహవల్‌నగర్‌, రఫీక్ షాలో పార్టీ కార్యకర్తలు, మద్దతు దారులు నిరసనలు తెలిపారు. రాజన్‌పూర్‌, చౌక్ అలహాబాద్, రోజాన్, ఫాజిల్‌పూర్, జాంపూర్‌ మద్దతుదారులు బైఠాయించారు. పెషావర్‌లో మోటర్‌వే ఇంటర్‌చేంజ్ వద్ద నిరసనకారులు గుంపులగా చేరి నిరసన తెలిపారు. చర్సద్దాలోని పీటీఐ కార్యకర్తలు నిరసనకారులు టైర్లు తగులబెట్టారు. రోడ్లను దిగ్బంధించి, రాకపోకలకు అంతరాయం కలిగించారు.

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !