పెళ్లికి ముందు సెక్స్ కి నో చెబితే... పోప్ ఫ్రాన్సిస్ వివాదాస్పద కామెంట్స్..!

By telugu news teamFirst Published Jun 22, 2022, 2:48 PM IST
Highlights

ఆయన  చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి.  కొందరు.. ఆయన చేసిన కామెంట్స్ ని సమర్థిస్తుంటే... మరికొందరు మాత్రం విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

రోమ్ బిషప్, కాథలిన్ చర్చి అదిపతి పోప్ ఫ్రాన్సిస్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలిచే ఆయన మరోసారి అలాంటి కామెంట్సే చేసి వార్తల్లోకి ఎక్కడం గమనార్హం.

పెళ్లికి ముందు సెక్స్‌కు దూరంగా ఉండటమే నిజమైన ప్రేమకు సంకేతమని పోప్ ఫ్రాన్సిస్ ప్రశంసించారు. పెళ్లి వరకు సెక్స్‌ను తిరస్కరించడం సంబంధాన్ని సురక్షిత మార్గమని పోప్ అన్నారు.   కాగా.. ఆయన  చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి.  కొందరు.. ఆయన చేసిన కామెంట్స్ ని సమర్థిస్తుంటే... మరికొందరు మాత్రం విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

“యువ జీవిత భాగస్వాములు తమ స్నేహాన్ని మరింతగా పెంచుకోవడానికి... దేవుని దయను అంగీకరించడానికి సమయాన్ని కనుగొనడంలో సహాయపడటం విలువైనదే. వివాహానికి ముందు పవిత్రత ఖచ్చితంగా ఈ కోర్సుకు అనుకూలంగా ఉంటుంది"  అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

ఈ రోజుల్లో జంటలు లైంగిక ఉద్రిక్తత లేదా ఒత్తిడి కారణంగా వారి సంబంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని లేదా 'విడిపోతారని' ఆయన పేర్కొన్నారు. ఆయన చేసిన కామెంట్స్ పై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. పోప్ చేసిన వ్యాఖ్యలు సంబంధంలో సెక్స్  ప్రాముఖ్యతను దెబ్బతీస్తున్నాయని ఇటాలియన్ వేదాంతి విటో మాన్‌కుసో అన్నారు.

ఇదిలా ఉండగా... గతంలోనూ ఆయన పెంపుడు జంతువుల విషయంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేటి యువత పిల్లల్ని కనకుండా పెంపుడు జంతువులకు ప్రాధాన్యం ఇస్తూ ఓ రకమైన స్వార్థాన్ని ప్రదర్శిస్తున్నారని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

 2014లో కూడా సంతానానికి బదులుగా జంతువులను పెంచుకోవడం సాంస్కృతిక పరమైన క్షీణత అని స్పష్టం చేశారు. తిరిగి తాజాగా,  నేడు మనం ఓ రకమైన స్వార్థాన్ని చూస్తున్నామని, కొందరు వ్యక్తులు పిల్లల్ని కనాలనుకోవడం లేదనే విషయాన్ని మనం గమనిస్తున్నామని పేర్కొన్నారు.

ఒక్కొక్కసారి ఒక బిడ్డతోనే సరిపెట్టుకుంటున్నారని, కానీ కుక్కలు, పిల్లులను పెంచుకుంటున్నారని, పిల్లల స్థానాన్ని పెంపుడు జంతువులు ఆక్రమిస్తున్నాయని ఆయన చెప్పారు. ఈ మాటలు జనానికి నవ్వు తెప్పించవచ్చు కానీ ఇది వాస్తవమని అని స్పష్టం చేశారు. 

ఇలా చేయడం మాతృత్వాన్ని, పితృత్వాన్ని నిరాకరించడమేనని స్పష్టం చేశారు. ఇది మనల్ని క్షీణింపజేస్తుందని, మనలోని మానవత్వాన్ని పోగొడుతుందని తెలిపారు. కాగా, జీవ సంబంధమైన కారణాల వల్ల పిల్లలు కలగనివారు దత్తత తీసుకోవడం గురించి పరిశీలించాలని ఆయన సూచించారు.

తల్లిదండ్రులు కావడానికి వెనుకాడకూడదని హితవు చెప్పారు. బిడ్డను కనడం రిస్క్‌తో కూడుకున్నదేనని, అయితే పిల్లలు లేకపోవడం మరింత రిస్క్ అని వివరించారు.

click me!