ఓ వైపు కోవిడ్ ఉధృతి.. మరో వైపు న్యూయర్ సెలబ్రేషన్.. వుహాన్ లో వేల సంఖ్యలో గుమిగూడిన ప్రజలు

By team teluguFirst Published Jan 1, 2023, 10:25 AM IST
Highlights

చైనాలో కరోనా విజృంభిస్తోంది. అయినా అక్కడి ప్రజలు అవేవీ పట్టించుకోలేదు. డిసెంబర్ 31 రాత్రి వేడుకలు జరుపుకునేందుకు శనివారం రాత్రి వేల సంఖ్యలో వుహాన్ ప్రజలు గుమిగూడారు. 

చైనాలో ఓ వైపు కోవిడ్ ఉధృతి కొనసాగుతుండగా.. మరో పైపు ప్రజలంతా వేల సంఖ్యలో గుంపులుగా చేరి న్యూయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. కరోనాను నియత్రించడానికి విధించిన ‘జీరో కోవిడ్ విధానం’ను ఇటీవల చైనా వెనక్కి తీసుకుంది. దీంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు శనివారం రాత్రి వేలాది మంది ప్రజలు వుహాన్‌లో గుమిగూడారని ‘రాయిటర్స్’ నివేదించింది. కోవిడ్ మొదలైన వుహాన్ సిటీలో సంప్రదాయం ప్రకారం సరిగ్గా రాత్రి 12 గంటల సమయంలో యువకులు అంతా ఆకాశంలోకి బెలూన్ లు విడుదల చేశారు.

ఏం చేశాడ‌ని.. ఫడ్నవీస్ భార్య వ్యాఖ్య‌ల‌పై రాజ‌కీయ దుమారం.. మోడీ టార్గెట్ గా నితీష్ కుమార్ విమర్శలు

కోవిడ్ పరిమితులు చాలా కాలం పాటు అమలులో ఉన్నాయి. కాబట్టి ఇన్ని రోజులు అన్ని వేడుకలకు చైనా ప్రజలు దూరంగా ఉన్నారు. అయితే కోవిడ్ పరిమితులు అన్నీ ప్రభుత్వం ఎత్తేయడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేశారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. కాగా.. చైనాలో కోవిడ్ కారణంగా రోజుకు 9,000 మందికి పైగా మరణిస్తున్నారని ఆస్ట్రేలియాకు చెందిన news.com.au నివేదించింది. ‘‘ చైనాలో అంటువ్యాధుల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి బ్రిటీష్ ఆధారిత పరిశోధనా సంస్థ ఎయిర్‌ఫినిటీ కోవిడ్‌తో మరణిస్తున్న వారి సంఖ్యను రెట్టింపు చేసింది. బీజింగ్ కఠినమైన జీరో-కోవిడ్ విధానాన్ని ఎత్తివేసిన తర్వాత ఇలా జరిగింది’’ అని పేర్కొంది. 

థర్టీ ఫస్ట్ నైట్ తాగి డ్యాన్స్ చేసి మధ్యాహ్నం లేచే వారు కొత్తగా ఏం చూడరు - బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్

అయితే కొంత కాలం కిందట ఓ అపార్ట్‌మెంట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ కఠిమైన క్వారంటైన్‌ నిబంధనలు అమలులో ఉండటం వల్ల అగ్నిమాపక సిబ్బందిని అపార్ట్‌మెంట్‌ లోపలికి రాకుండా నిలిపివేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ అగ్నిప్రమాదం వల్ల 10 మంది మరణించారు. దీంతో కఠిన నిబంధనలపై చైనా అంతటా నిరసనలు చెలరేగాయి. ఈ నిరసన వల్లే చైనా తన కోవిడ్ విధానాన్ని వెనక్కి తీసుకుంది.

క‌శ్మీర్ లోయ‌లో తగ్గుముఖం పట్టిన ఉగ్రవాదం…! 172 మంది ఉగ్ర‌వాదుల హ‌తం..

దీంతో కోవిడ్ కేసుల్లో పెరుగుదల కనపిస్తోందని news.com.au. పేర్కొంది. డిసెంబర్‌లో కోవిడ్‌తో ముడిపడి ఉన్న మరణాలు 100,000కి చేరే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే దాదాపు 18.6 మిలియన్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయని తెలిపింది. జనవరి మధ్య నాటికి చైనాలో రోజుకు 3.7 మిలియన్ల కోవిడ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. జనవరి 23 నాటికి చైనాలో మొత్తం 584,000 మరణాలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. ‘‘మార్చి నాటికి ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది చైనీయులు కోవిడ్ బారిన పడే అవకాశం ఉంది. జనాభాలో 30 శాతానికి పైగా ఇప్పటికే వ్యాధి బారిన పడి ఉండవచ్చు. అంటే 400 మిలియన్ల మంది ప్రజలు’’  అని ‘ది ఆస్ట్రేలియన్’ నివేదిక పేర్కొంది.
 

click me!