చైనాలో కోవిడ్ విధ్వంసం.. రోజుకు 9,000 మరణాలు !

By Rajesh KarampooriFirst Published Jan 1, 2023, 2:22 AM IST
Highlights

ప్రస్తుతం చైనాలో  కొనసాగుతున్న కరోనా  కొత్త దశలోకి ప్రవేశించిందని, దేశం కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటుందని ఆ దేశ అధ్యక్షుడు జి జిన్‌పింగ్ శనివారం అన్నారు.

చైనాలో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్  విధ్వంసం సృష్టిస్తోంది. కోవిడ్ ఇన్‌ఫెక్షన్ కారణంగా మరణాల సంఖ్య వేగంగా పెరుగుతుంది. మీడియా నివేదికల ప్రకారం.. ప్రస్తుత పరిస్థితుల్లో చైనాలో రోజుకు 9,000 మంది చనిపోతున్నారు. అంటువ్యాధుల పెరుగుదల కారణంగా చైనాలో కోవిడ్ మరణాల సంఖ్య రెట్టింపు అయిందని UK పరిశోధనా సంస్థ ఎయిర్‌ఫినిటీ పేర్కొంది. నవంబర్‌లో చైనా ప్రభుత్వం జీరో-కోవిడ్ విధానాన్ని సడలించిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది.

వాస్తవానికి  నగరాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో చైనా ప్రభుత్వం కోవిడ్ విధానాన్ని పరిగణనలోకి తీసుకోవలసి వచ్చింది. ఎయిర్‌ఫినిటీ మోడల్ డేటా  ప్రకారం.. డిసెంబర్‌లో చైనా మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య లక్షకు చేరుకోవచ్చని, కనీసం ఒక కోటి 86 లక్షల మందికి సోకవచ్చని నివేదిక పేర్కొంది. జనవరి మధ్య నాటికి.. రోజుకు 37 లక్షల కోవిడ్ కేసులు నమోదు కావచ్చునని, అలాగే.. జనవరి 23 నాటికి చైనాలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ కారణంగా 5 లక్షల 84 వేల మంది మరణించే అవకాశం ఉందని అంచనా వేసింది.

మరోవైపు.. చైనా  కోవిడ్ సమాచారాన్ని ప్రపంచంతో పంచుకోవడం లేదనీ, చైనాలో కోవిడ్ విధ్వంసం  సృష్టించడంతో  గణాంకాలు అంచనా వేయడం కష్టంగా మారింది. అయితే, చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (NHC) గత వారం దేశంలో కోవిడ్  ప్రస్తుత వేవ్ ప్రపంచంలోనే అతిపెద్దదని ధృవీకరించింది. మీడియా నివేదికల ప్రకారం.. మార్చి 2023 నాటికి చైనాలో ఒక బిలియన్ మందికి పైగా  కోవిడ్ బారిన పడవచ్చు. చైనా జనాభాలో 30 శాతం మంది అంటే 400 మిలియన్లకు పైగా ఇప్పటికే వ్యాధి బారిన పడ్డారు.

Omicron యొక్క BF.7 వేరియంట్ చైనాలో ప్రజలకు వేగంగా సోకుతోంది. అయితే కోవిడ్‌ లక్షణాలు లేకుంటే కార్మికులను విధులకు పిలిపిస్తున్నారు. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కరోనా మహమ్మారి కారణంగా కుప్పకూలింది. సవాళ్లను ఎదుర్కోవడంలో కష్టపడుతోంది. కోవిడ్ కేసులు లేదా మరణాల సంఖ్య గురించి చైనా పారదర్శకంగా వ్యవహరించడం లేదని బయోసైన్స్ రిసోర్స్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రిటిష్ వైరాలజిస్ట్ జోనాథన్ లాథమ్ అన్నారు. ఖచ్చితమైన డేటాతో మాత్రమే చైనా , ఇతర దేశాలు మంచి నిర్ణయాలు తీసుకోగలవని తెలిపారు.  

కరోనాపై పోరాటం కొనసాగుతోంది: జిన్‌పింగ్

ఈ తరుణంలో దేశాన్ని ఉద్దేశించి చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మాట్లాడుతూ.. తాము తాజాగా COVID-19తో పోరాడే కొత్త దశలోకి ప్రవేశించామని, అక్కడ కఠినమైన సవాళ్లు  ఉన్నాయని జి అన్నారు. దేశం మునుపెన్నడూ లేని విధంగా ఇబ్బందులు, సవాళ్లను ఎదుర్కొంటున్నందున ఇది అంత తేలికైన ప్రయాణం కాదని ఆయన అన్నారు. చైనా యొక్క అసాధారణ ప్రయత్నాలు అపూర్వమైన ఇబ్బందులను అధిగమించడానికి సహాయపడ్డాయని జి జిన్‌పింగ్ అన్నారు. 

అసాధారణమైన కృషితో అపూర్వమైన ఇబ్బందులు, సవాళ్లను అధిగమించామని, ఇది ఎవరికీ అంత తేలికైన ప్రయాణం కాదని అన్నారు. దేశంలో ప్రబలుతున్న కోవిడ్ మహమ్మారి  తీవ్రమైన పరిస్థితి గురించి సమాచారం ఇవ్వకుండానే ఆయన ఇలా అన్నారు. తన ప్రసంగంలో అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల దృష్ట్యా చైనా COVID-19 ప్రతిస్పందనను స్వీకరించిందని జి చెప్పారు.

ప్రజల నిరసనల నేపథ్యంలో ఈ నెల ప్రారంభంలో 'జీరో-కోవిడ్' విధానాన్ని రాత్రిపూట సడలించిన తర్వాత, దేశంలోని ప్రస్తుత కోవిడ్ పరిస్థితి పూర్తిగా మారిందని తెలిపారు. మరోవైపు WHO పదేపదే విజ్ఞప్తుల తరువాత.. చైనా శుక్రవారం తన అధికారులను ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులతో మాట్లాడటానికి అనుమతించింది.

click me!