ప్రారంభమైన న్యూ ఇయర్‌.. స్వాగతం చెప్పిన న్యూజిలాండ్.. ఆక్లాండ్‌లో సెలబ్రేషన్స్ అదుర్స్..

By Sumanth KanukulaFirst Published Dec 31, 2022, 5:03 PM IST
Highlights

ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ జోష్‌ నెలకొంది.  ఇప్పటికే న్యూజిలాండ్‌ ప్రజలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీప కాంతుల వెలుగుల్లో ఆక్లాండ్‌ నగరం మెరిసిపోయింది.

ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ జోష్‌ నెలకొంది. 2022కు గుడ్ బై చెప్పి.. 2023 న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం ప్రపంచ దేశాలలోని ప్రజలు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల ప్రజలు న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పేశారు. అందరికంటే ముందుగా ఓషియానియా‌ న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పేసింది.  ప్రపంచంలోని కొత్త సంవత్సరం ముందుగా ఓషినియాలో ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకే అక్కడ న్యూ ఇయర్ ప్రారంభమైంది. చిన్న పసిఫిక్ ద్వీప దేశాలు టోంగా, కిరిబాటి, సమోవా‌లు కొత్త ఏడాదికి స్వాగతం పలికాయి. 

ఇక, న్యూజిలాండ్‌ కూడా కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. అక్కడ సంబరాలు అంబరాన్ని అంటాయి. మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీప కాంతుల వెలుగుల్లో ఆక్లాండ్‌ నగరం మెరిసిపోయింది. ఆక్లాండ్ హార్బర్ బ్రిడ్జిపై లైట్ షో, ఆక్లాండ్ స్కై టవర్ నుండి బాణాసంచా ప్రదర్శనతో న్యూజిలాండ్ 2023 నూతన సంవత్సరానికి గ్రాండ్‌గా స్వాగతం పలికింది. మరికొన్ని గంటల్లోనే ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలు కూడా న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పనున్నాయి. ఇక, న్యూ ఇయర్ వేడుకలు మొత్తంగా ప్రపంచమంతటా 25 గంటల పాటు జరుగుతాయి.

 

| People in New Zealand cheerfully welcome New Year 2023 amid fireworks & light show. Visuals from Auckland.

(Source: Reuters) pic.twitter.com/mgy1By4mmA

— ANI (@ANI)


గత రెండేళ్లుగా కోవిడ్‌ కారణంగా చాలా దేశాలలోని పరిమితంగానే న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు. అయితే ప్రస్తుతం చాలా దేశాల్లో కరోనా ప్రభావం పెద్దగా లేదు. దీంతో రెండేళ్ల తర్వాత గ్రాండ్‌గా న్యూ ఇయర్ సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.   

click me!