గాజాలో ఉన్న హమాస్ కు చెందిన అడ్వాన్స్ డిటెక్షన్ సిస్టంను ఇజ్రాయిల్ దళాలు నేలమట్టం చేశాయి. ఇటీవల హమాస్ కు ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తున్న రెండు బ్యాంకులను, భూగర్భ సొరంగంను కూడా ధ్వంసం చేసింది.
పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ కు భారీ ఎదురుదెబ్బ తగలిగింది. గాజాలో విమానాలను గుర్తించడానికి ఉపయోగించే కీలక సాధనమైన, ఉగ్రవాద సంస్థకు చెందిన 'అడ్వాన్స్ డ్ డిటెక్షన్ సిస్టం'ను పూర్తిగా ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్ ) తెలిపింది. ముట్టడి తీర ప్రాంతంలో వైమానిక దాడుల్లో 80కి పైగా కొత్త టార్గెట్ లను చేధించినట్టు ఐడీఎఫ్ ప్రకటించింది.
undefined
అలాగే ఇటీవలే ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికి హమాస్ ఉపయోగించే రెండు బ్యాంకు శాఖలు, భూగర్భ సొరంగం, రెండు హమాస్ ఆపరేషనల్ కమాండ్ సెంటర్లు, ఆయుధాల నిల్వ సౌకర్యాలు, శిక్షణ, తయారీ, నిల్వ కోసం ఉపయోగించే రెండు హమాస్ కాంపౌండ్లపై ఇటీవల ధ్వంసం చేశామని ఐడీఎఫ్ పేర్కొంది.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ ఆకస్మిక దాడి చేసింది. దీనికి ఇజ్రాయెల్ వెంటనే స్పందించింది. హమాస్ పై యుద్ధం ప్రకటించింది. యుద్ధ ప్రారంభించింది పాలస్తీనానే అయినప్పటికీ ముగించేది మాత్రం తామే అని పేర్కొంది. అప్పటి నుంచి యూదు దేశం నిరంతర వైమానిక దాడులతో గాజాపై దాడిని కొనసాగిస్తూనే ఉంది.
విషాదం.. జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ ఎల్ఓసీ వద్ద బుల్లెట్ గాయంతో జవాను మృతి.. ఏం జరిగిందంటే ?
కాగా.. ఇజ్రాయెల్ తీరప్రాంతంపై దాడి చేయడానికి హమాస్ మిలిటెంట్లు ఉపయోగించినట్లు భావిస్తున్న గాజాలోని నావికా స్థావరాలపై కూడా ఐడీఎఫ్ దాడులు నిర్వహించిందని ‘సీఎన్ఎన్’ తెలిపింది. ఈ ఆపరేషన్ లో ఐడీఎఫ్ నావికాదళ సైనికులు, ఐఎఎఫ్, ఇజ్రాయిల్ ఆర్టిలరీ కార్ప్స్ పాల్గొన్నాయి. క్షిపణి పడవలు, సైనిక హెలికాప్టర్లు, గ్రౌండ్ ఆర్టిలరీ బ్యాటరీల నుంచి ఫిరంగి దాడులను ఉపయోగించి నౌకాశ్రయాలను టార్గెట్ చేశారు.
అలాగే గాజా తీరం నుంచి ఇజ్రాయెల్ లోకి చొరబడేందుకు ప్రయత్నించిన హమాస్ డైవర్ ను ఇజ్రాయెల్ నావికా దళాలు అడ్డుకున్నాయని ఐడీఎఫ్ తెలిపింది. గాజా చుట్టూ ఉన్న అవరోధాన్ని పునర్నిర్మించామని, పదాతిదళం, సాయుధ సైనికులు, ఆర్టిలరీ కార్ప్స్ తో పాటు ఎన్ క్లేవ్ తో సరిహద్దుకు సమీపంలో 300,000 మంది రిజర్వ్ దళాలను సమీకరించామని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి జొనాథన్ కాన్రికస్ పేర్కొన్నారు.
ఒడిశా రైలు ప్రమాదం : క్లెయిమ్ చేయని మృతదేహాలకు అంత్యక్రియలు.. గడ్డకట్టడంతో ఆలస్యమైన దహన సంస్కారాలు..
ఇదిలా ఉండగా.. హమాస్ దాడి నేపథ్యంలో పాలస్తీనా ఎన్ క్లేవ్ కు విద్యుత్, ఆహారం, నీరు, ఇంధనం సహా నిత్యావసర సరుకుల సరఫరాను నిలిపివేస్తూ గాజాను పూర్తిగా ముట్టడించాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలెంట్ ఆదేశించారు. కాగా.. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైన నాటి నుంచి నేటి వరకు ఇరు వైపులా తీవ్ర ప్రాణ నష్టం జరిగింది. రెండు దేశాలకు చెందిన పౌరులు, సైనికుల మరణాల సంఖ్య 3 వేలు దాటిందని పలు నివేదికలు చెబుతున్నాయి.