పాలస్తీనాలో కాల్పుల విరమణకు పిలుపునిచ్చిన మలాలా.. యుద్ధం పిల్లలనూ వదలదన్న శాంతి బహుమతి గ్రహీత

పాలస్తీనాలో కాల్పుల విరమణను తక్షణం అమలు చేయాలని మానవ హక్కుల, విద్యా కార్యకర్త మలాలా పిలుపునిచ్చారు. యుద్ధం పిల్లలను కూడా విడిచిపెట్టడదని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు. 

Malala called for a ceasefire in Palestine. Peace Prize laureate for war leaves no children..ISR

ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య నెలకొన్న సంక్షోభం పల్ల పాకిస్తాన్ మానవ హక్కుల, విద్యా కార్యకర్త, 2014 నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనాలో తక్షణ కాల్పుల విరమణ జరగాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రస్తుత యుద్ధంలో మృతుల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య పెరుగుతుండం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

విషాదం.. జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ ఎల్ఓసీ వద్ద బుల్లెట్ గాయంతో జవాను మృతి.. ఏం జరిగిందంటే ?

Latest Videos

ఈ సందర్భంగా ఆమె తన చిన్నతనం నుంచి కళ్ల ముందు చూసిన అనుభవాన్ని వివరించారు. ‘‘ఇజ్రాయెల్ లోని వారి ఇళ్ల నుండి అపహరణకు గురైన వారినే కాదు.. వైమానిక దాడుల నుండి దాక్కున్న వారినే కాదు లేదా గాజాలో ఆహారం నీరు లేకుండా ఉన్న వారినే కాకుండా.. పిల్లలను కూడా ఏ యుద్ధం వదలిపెట్టదు.’’ అని ఆమె మంగళవారం తన ఇన్ స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు. 

పవిత్ర భూమిలో శాంతి, న్యాయం కోసం పరితపించే పిల్లలు, ప్రజలందరి కోసం తాను చింతిస్తున్నానని ఆమె పోస్టులో తెలిపారు. తన 11వ ఏట హింస, ఉగ్రవాదాన్ని చూశానని తెలిపారు. గత రోజుల విషాదకరమైన వార్తలను చూస్తున్నానని, అయితే ఈ ఉద్రిక్త వాతావరణంలో చిక్కుకున్న పాలస్తీనా, ఇజ్రాయెల్ పిల్లల గురించి ఆలోచిస్తున్నానని చెప్పారు.

pic.twitter.com/WdzadzFqxc

— Malala Yousafzai (@Malala)

2012లో మహిళలకు విద్యను అందించాలని డిమాండ్ చేసినందుకు పాకిస్థాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు ఆమె తలపై కాల్పులు జరిపారు. అప్పుడు ఆమె వయస్సు 14 ఏళ్లు మాత్రమే. దీంతో ఆమెను విమానంలో బర్మింగ్ హామ్ లోని క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ గాయానికి ఆపరేషన్లు చేయడంతో ఆమె కోరుకున్నారు. మలాల సేవలను గుర్తించి నోబెల్ శాంతి బహుమతి కూడా వరించింది. అత్యంత చిన్న వయస్సులో నోబెల్ శాంతి బహుమతి పొంది ఆమె రికార్డు నెలకొల్పారు. 

దారుణం.. ట్యాక్సీని చోరీ చేసి, డ్రైవర్ ను 200 మీటర్ల ఈడ్చుకెళ్లిన దొంగలు.. గాయాలతో బాధితుడు మృతి

ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం ఐదో రోజుకు చేరుకున్నాయి. దీంతో ఇరు వైపులా తీవ్ర ప్రాణ నష్టం జరుగుతోంది. ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన ఆకస్మిక అసాధారణ దాడి, దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు గాజాపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన ఎదురుదాడి, వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 3 వేల మంది మరణించారు. 

vuukle one pixel image
click me!