
పోర్న్ స్టార్‌కు రహస్యంగా డబ్బు చెల్లించిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మాన్ హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో లొంగిపోనున్నారు. దీని కోసం ఆయన సోమవారం తన ప్రైవేట్ విమానంలో న్యూయార్క్ నగరానికి చేరుకున్నారు. ట్రంప్ నేరం అంగీకరించే విచారణకు న్యాయమూర్తి ముందు హాజరయ్యే ముందు వేలిముద్రలు వేసే అవకాశం ఉంది.
మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేసీఆర్ ఫుల్ ఫోకస్.. 12 జెడ్పీ స్థానాల్లో గెలుపే లక్ష్యం..!
అడల్ట్ ఫిల్మ్ నటి స్టార్మీ డేనియల్స్ కు రహస్యంగా డబ్బు చెల్లించినందుకు ట్రంప్ పై విచారణ జరుగుతోంది. ట్రంప్ ఎదుర్కొంటున్న అనేక దర్యాప్తులలో న్యూయార్క్ కేసు ఒకటి. దీంతో క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న తొలి అమెరికా మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డుల్లోకి ఎక్కారు. ప్రముఖ వైట్ కాలర్ క్రిమినల్ డిఫెన్స్ లాయర్, మాజీ ఫెడరల్ ప్రాసిక్యూటర్ టాడ్ బ్లాంచ్, ఇతర ట్రంప్ న్యాయవాదులు సోమవారం విచారణకు సంబంధించిన వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, రేడియో కవరేజీని అనుమతించవద్దని న్యాయమూర్తిని కోరారు.
చనిపోయినట్లు నటించి ప్రియురాలితో రొమాన్స్.. భార్యకు దొరికేసిన భర్త..!
ఇలాంటి కవరేజీని అనుమతించరాదని వారు కోర్టుకు రాసిన లేఖలో వాదించారు. ‘‘ఇది కేసు చుట్టూ ఇప్పటికే ఉన్న సర్కస్ లాంటి వాతావరణాన్ని మరింత పెంచుతుంది. ఇది కోర్టు గది గౌరవం, మర్యాద రెండింటినీ దెబ్బతీస్తుంది’’ అని పేర్కొన్నారు. మాన్హాటన్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆల్విన్ బ్రాగ్ కార్యాలయం దీనిని న్యాయమూర్తి విచక్షణకు వదిలేస్తున్నట్లు తెలిపింది.
రష్యాను వణికించిన భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.9 తీవ్రత నమోదు
ట్రంప్ పై కేసు ఏంటంటే ?
2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అడల్ట్ ఫిల్మ్ నటి స్టార్మీ డేనియల్స్ కు ట్రంప్ 1,30,000 డాలర్లు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది నెలల తరబడి మాన్ హట్టన్ గ్రాండ్ జ్యూరీ సాక్ష్యాధారాలను విచారించింది. 2006లో లేక్ తాహో హోటల్ లో ట్రంప్ చేసిన లైంగిక దాడిపై మౌనంగా ఉండేందుకు తనకు డబ్బు చెల్లించారని డేనియల్స్ తెలిపింది. కానీ ఆమెతో తనకు అలాంటి సంబంధమూ లేదని ట్రంప్ కొట్టిపారేశారు. తాను నిర్దోషినని, వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష బరిలో నిలవబోతున్నందుకు ప్రతిపక్షాలు కావాలనే ఇదంతా చేస్తున్నాయని ఆరోపించారు.
కాగా.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో న్యూయార్క్ లో నిరసనలు తెలిపేందుకు ట్రంప్ అభిమానులు సిద్ధమవుతున్నారు. ఫ్లోరిడా విమానాశ్రయంలో ఆయన ప్రయాణించే మార్గంలో ట్రంప్ అభిమానులు గుర్తులు, జెండాలు పట్టుకుని నిరసనలు తెలియజేయాలని ప్లాన్ చేసుకున్నారు.