ర‌ష్యాను వ‌ణికించిన భూకంపం.. రిక్ట‌ర్ స్కేల్ పై 6.9 తీవ్రత న‌మోదు

Published : Apr 03, 2023, 04:33 PM IST
ర‌ష్యాను వ‌ణికించిన భూకంపం.. రిక్ట‌ర్ స్కేల్ పై 6.9 తీవ్రత న‌మోదు

సారాంశం

Moscow: రష్యా తూర్పు తీరంలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం రష్యాలోని పసిఫిక్ తీరంలో పెట్రోపావ్‌లోవ్స్క్-కామ్‌చట్‌స్కీకి దక్షిణంగా 44 కిలో మీట‌ర్ల(27 మైళ్ళు) దూరం, 100 కిలో మీట‌ర్ల లోతులో సంభవించిందని సంబంధిత ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొన్నాయి.   

Russia earthquake: ర‌ష్యాను మరోసారి భూ ప్ర‌కంప‌న‌లు వ‌ణికించాయి. ఆ దేశ తూర్పు తీరంలో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం రష్యాలోని పసిఫిక్ తీరంలో పెట్రోపావ్‌లోవ్స్క్-కామ్‌చట్‌స్కీకి దక్షిణంగా 44 కిలో మీట‌ర్ల(27 మైళ్ళు) దూరం,  100 కిలో మీట‌ర్ల లోతులో సంభవించిందని సంబంధిత ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

వివ‌రాల్లోకెళ్తే..  రష్యాలోని తూర్పు తీరంలో సోమవారం 6.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని, అయితే సునామీ సంభవించలేదని, తక్షణ ప్రాణనష్టం జరగలేదని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. భూకంపం రష్యా పసిఫిక్ తీరంలో పెట్రోపావ్లోవ్స్క్-కామ్‌చట్‌స్కీకి దక్షిణంగా 44 కిలో మీట‌ర్ల (27 మైళ్ళు)  దూరం, 100 కిలో మీట‌ర్ల లోతులో సంభవించింది.

మాస్కోకు తూర్పున 6,800 కిలో మీట‌ర్ల దూరంలో ఉన్న కమ్‌చట్కా ద్వీపకల్పం నుండి మీడియా పోస్ట్ చేసిన ఫుటేజీ, భూకంపం కారణంగా కూలిన తర్వాత సూపర్ మార్కెట్‌లు, వివిధ  భవనాలు దెబ్బ‌తిన్న దృశ్యాలు కనిపించాయి. అయితే, ప్రాణ‌న‌ష్టం మాత్రం సంభ‌వించ‌లేద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

 

 

రెస్క్యూ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది భవనాలను పరిశీలిస్తున్నాయ‌ని అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం, విధ్వంసం జరగలేదు. భూకంప తీవ్రత 6.9గా నమోదైనట్లు రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జియోఫిజికల్ సర్వే కంచట్కా బ్రాంచ్ తెలిపింది. యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తొలుత భూకంప తీవ్రత 6.6గా ఉందని తెలిపింది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని యూఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్ పేర్కొంది.

ఇదిలావుండగా, పాపువా న్యూ గినియాలోని మోరెస్బీలో భూకంపం వచ్చింది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4:00 గంటల తర్వాత భూకంపం సంభవించింది. దీని తీవ్రత 7.2. భూకంప కేంద్రం 80 కిలోమీటర్ల లోతులో ఉంది.  యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, సోమవారం తెల్లవారుజామున వాయువ్య పాపువా న్యూ గినియాలో 7.0 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !