అమెరికాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 7.4 తీవ్రత నమోదు.. సునామీ హెచ్చరిక జారీ

Published : Jul 16, 2023, 01:23 PM IST
అమెరికాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 7.4 తీవ్రత నమోదు.. సునామీ హెచ్చరిక జారీ

సారాంశం

అమెరికాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అలాస్కా ద్వీపకల్ప వచ్చిన ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదని తెలుస్తోంది. అయితే సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. 

అమెరికాలోని అలాస్కా ద్వీపకల్ప ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.4 తీవ్రతతో నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్ జీఎస్) తెలిపింది. అయితే భూకంపం తర్వాత అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.

సింధ్ నదిలోకి దూసుకెళ్లిన సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం.. 8 మందికి గాయాలు

అందులో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. 9.3 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యూఎస్జీఎస్ తెలిపింది. ‘‘ఆదివారం తెల్లవారుజామున 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. సునామీ హెచ్చరిక వ్యవస్థ ద్వారా ముప్పు జారీ చేయబడింది. దీని కేంద్రం 5.78 మైళ్ల లోతులో ఉంది’’ అని యూఎస్ జీఎస్ ట్వీట్ చేసింది. 

మే నెల 25వ తేదీన కూడా అమెరికాలోని కాలిఫోర్నియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దాని తీవ్రత 5.5గా నమోదు అయ్యింది. ఈస్ట్ షోర్ కు నైరుతి దిశలో 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలిఫోర్నియాలో ఈ భూకంప కేంద్రం ఉందని, దాని లోతు 1.5 కిలోమీటర్లుగా ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్ జీఎస్) తెలిపింది.

వారెవ్వా.. జాబిల్లిపై భారత జాతీయ చిహ్నం, ఇస్రో లోగోను ముద్రించనున్న చంద్రయాన్- 3 రోవర్

అయితే ఈ భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టమూ సంభవించలేదు. అంతకు ముందు రోజు జపాన్ రాజధాని టోక్యో, పరిసర ప్రాంతాల్లో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి. టోక్యోకు ఆగ్నేయంగా ఉన్న చిబా ప్రిఫెక్చర్ లో భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.

మణిపూర్ లో కొనసాగుతున్న హింస.. ఇంట్లోనే మహిళను దారుణంగా కాల్చి చంపిన దుండగులు

భూమి లోపల ఏడు పలకలు నిరంతరం తిరుగుతూ ఉండటమే ఈ భూకంపాలకు కారణం. ఈ ప్లేట్లు ఎక్కువగా ఢీకొనే ప్రదేశాలను ఫాల్ట్ లైన్స్ అంటారు. ఇవి తరచుగా ఢీకొంటూ ఉంటాయి. దీని వల్ల ప్లేట్లు విరిగిపోతాయి. వాటి విచ్ఛిన్నం కారణంగా లోపల ఉన్న శక్తి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో అది ఓ మార్గాన్ని కనుగొంటుంది. దీని వల్ల ఆ ప్రాంతంలో భూమి కంపిస్తుంది. దీనినే భూకంపం అని అంటారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే