దక్షిణ కొరియా హోలోవీన్ వేడుకల్లో అపశృతి.. తొక్కిసలాటలో 149 మంది దుర్మరణం..

Published : Oct 30, 2022, 10:01 AM ISTUpdated : Oct 30, 2022, 10:02 AM IST
దక్షిణ కొరియా హోలోవీన్ వేడుకల్లో అపశృతి.. తొక్కిసలాటలో 149 మంది దుర్మరణం..

సారాంశం

దక్షిణ కొరియా రాజధానిలో ఘోర ప్రమాదం జరిగింది. హాలోవీన్ వేడుకల్లో నిర్వహిస్తున్న సమయంలో ఒక్క సారిగా తొక్కిసాలట జరిగింది. దీంతో 149 మంది చనిపోయారు. 150 మంది వరకు గాయాలు అయ్యాయి. 

దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో శనివారం రాత్రి చేపట్టిన హాలోవీన్ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. ఈ వేడుకలు జరుగుతున్నప్పుడు ఒక్క సారిగా తొక్కిసాలట జరిగింది. ఈ ఘటనలో 149 మంది చనిపోయారు. మరో 150 మంది వరకు గాయపడ్డారు. దక్షిణ కొరియాలో ఇటీవలి కాలంటో జరిగిన ప్రమాదాల్లో ఇదే అతి పెద్దదని నగర అగ్నిమాపక విభాగం తెలిపింది.

ఈ విషయం నేను మోదీని అడగాలని అనుకుంటున్నాను.. : యూసీసీపై గుజరాత్ ప్రభుత్వ ప్రకటనపై మండిపడ్డ ఒవైసీ

దేశ రాజధానిలో సంవత్సరం మొత్తంలో జరిగే అత్యంత రసవత్తరమైన వేడుకల్లో ఒకటి ఇది. ఈ సందర్భంగా జనం పెద్ద సంఖ్యలో ఒక్క దగ్గర గుమిగూడటంతో ఈ ప్రమాదం సంభవించింది. హాలోవీన్ ఉత్సవాల కోసం శనివారం సాయంత్రం ఇటావాన్ నైట్‌లైఫ్ లోని ఇరుకైన వీధుల్లోకి దాదాపు 100,000 మంది వరకు చేరుకున్నట్టు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. 

ఇరాక్ లో భారీ బాంబ్ పేలుళ్లు... పదిమంది మృతి, 20 మందికి గాయాలు

గాయపడిన వారికి సత్వర చికిత్స అందించాలని, పండుగ ప్రదేశాల భద్రతను సమీక్షించాలని అధికారులకు పిలుపునిస్తూ దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఒక ప్రకటన విడుదల చేశారు. క్షతగాత్రులకు చికిత్స అందిచడానికి హాస్పిటల్ లో విపత్తు వైద్య సహాయక బృందాలు నియమించాలని, అవసరమైన బెడ్స్ ఏర్పాటు చేయాలని ఆయన ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆదేశించారు.

సియోల్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స చేయడానికి అందుబాటులో ఉన్న సిబ్బందితో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న 400 మందికి పైగా అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 140 అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకొచ్చారు. జాతీయ అగ్నిమాపక ఏజెన్సీ అధికారులు కూడా ఘటనా స్థలానికి వచ్చారు. 

12 ఏళ్ల బాలికపై మైనర్ బాలుర గ్యాంగ్ రేప్.. ఫోన్లో చిత్రీకరణ..డబ్బుల కోసం బ్లాక్ మెయిల్..సోషల్ మీడియాలో పోస్ట్

ఈ ప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీలు బయటకు వచ్చాయి. అందులో అంబులెన్స్ లు రోడ్డుపై నిలిచి ఉన్నాయి. అలాగే భారీగా మోహరించిన పోలీసుల మధ్య క్షతగాత్రులకు చికిత్స అందించడానికి స్ట్రెచర్లపై ఆరోగ్య సిబ్బంది వారిని తీసుకెళ్తున్నారు. అత్యవసర సిబ్బంది, పాదచారులు వీధుల్లో పడి ఉన్న వ్యక్తులకు సీఆర్ఫీ చేయడం కనిపిస్తోంది. మరో వైపు పారామెడిక్స్ సిబ్బంది అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని పరీశీలించడం కనిపించింది.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?